గుప్పెడంతమనసు సెప్టెంబరు 12 ఎపిసోడ్


విశ్వనాథం వాళ్లకి నిజం చెప్పేద్దామని మహేంద్ర అంటే..అవసరం లేదంటాడు రిషి
రిషి: ఎవ్వరికీ నిజం చెప్పాల్సిన అవసరం లేదు..నేను నమ్మనివాళ్లు బతికి ఉండగానే ప్రాణం తీశారు కానీ వాళ్లు మాత్రం సొంత మనుషిలా ఆదరిస్తున్నారు
జగతి: మాకు ఎందుకీ శిక్ష
రిషి: వాళ్ళు నన్ను చేరదీసి సొంత మనిషిలా చూసుకున్నారు. వాళ్ళకి నేను ఎదురు చెప్పలేను . శిక్ష వేసింది మీరు అనుభవిస్తున్నది నేను. అయినా మళ్లీ చెప్తున్నాను అక్కడికి వచ్చి మీరు ఎవరు ఏమి మాట్లాడటానికి వీల్లేదు అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు రిషి. 


రిషి ఏంటి అలా మాట్లాడుతున్నాడేంటి అని మహేంద్ర అంటే..ఆయన ఏంజెల్ ని పెళ్లి చేసుకుంటే అందరికంటే నేనే ఎక్కువగా సంతోషిస్తాను అంటూ బాధతో అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వసుధార. 


అందంగా ముస్తాబైన ఏంజెల్..పనిమనిషి సుభద్రమ్మ తో చూశావా ఎంత బావున్నానో..నీకు కొడుకు ఉంటే నన్ను కోడలిగా చేసుకునేదానివి కదా అంటుంది. అలా మాట్లాడకండమ్మా అన్న సుభద్రమ్మ ఏదో తగ్గింది అంటుంది. ఇంతలో వచ్చిన విశ్వనాథం మనవరాలను చూసి పెళ్లికళ వచ్చేసింది అంటూ ఆనందపడతాడు. ఏదో తగ్గింది అనగానే..పూలు పెట్టుకుంటుంది. పంతులుగారు వచ్చారని తెలిసి  ఇద్దరు హాల్లోకి వస్తారు. రిషి కూడా అప్పుడే వస్తాడు. వెనుకగా వచ్చిన మహేంద్ర వాళ్ళని చూసి కంగారు పడతాడు విశ్వనాథం. యాక్సిడెంట్ జరిగిందని తెలుసుకుని బాధపడతాడు. రిషి పెళ్లికి ఒప్పుకున్నాడు అన్న దగ్గర నుంచి ఎందుకు నువ్వు కాంటాక్ట్ లో లేవు అని   వసుధారని అడుగుతుంది  ఏంజెల్. ఇప్పుడు రాకపోతే నేనే వచ్చేసేదాన్ని అంటుంది. 
విశ్వనాథం: సరే ఇప్పుడు అందరూ వచ్చేసారు కదా ఇంక ఈ టాపిక్ వదిలేయ్  అంటాడు విశ్వనాథం. 
పంతులుగారు ముహూర్తాలు పెట్టేయమంటారా అని అడగడంతో రిషి ఫ్రెష్ అయి వస్తాడు అప్పుడు పెడుదురుగాని అని చెప్తాడు విశ్వనాథం. 
జగతి ఏదో చెప్పేందుకు ట్రై చేస్తుంది కానీ రిషి కళ్లతోనే సైగచేసి ఆపేస్తాడు...రిషి ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. 
వెళ్తున్న రిషి ని చూస్తూ మొదట రిషి పరిచయం అయినప్పటి నుంచీ జరిగినవన్నీ గుర్తుచేసుకుని బాధపడుతుంది. మన బంధం గురించి కీలక నిర్ణయం తీసుకునే సమయం ఇది ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది అని మనసులో అనుకుంటుంది.
 
Also Read: నిజం చెప్పేయమన్న జగతి- ఏంజెల్ ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డ రిషి


మరోవైపు DBST కాలేజీకి వస్తాడు ఎంఎస్ఆర్. ఎన్నాళ్ళ నుంచో  కలలు కంటున్న ఈ కాలేజీ ఇప్పుడు నా వశం కాబోతుంది అని అనుకుంటాడు. ఇంతలో ఫణీంద్ర, శైలేంద్ర కూడా వస్తారు. ఫణీంద్ర  కోపంగా ఎమ్మెస్సార్ దగ్గరికి వచ్చి ఏంటి సడన్ గా రమ్మన్నావు అయినా నువ్వు ఎందుకు ఈ కాలేజీకి వచ్చావు అని అడుగుతాడు. 
MSR: నాకు రావాల్సింది రాయించుకునేందుకు వచ్చాను. నేను వచ్చిన పనేంటో చెబుతానంటూ అప్పుడు తను ఈ కాలేజీకి అప్పిచ్చిన విషయం చెప్తాడు ఎమ్మెస్సార్.
ఫణీంద్ర: ఏంటి శైలేంద్ర ఇది, నువ్వు నీ ఫ్రెండ్ దగ్గర నుంచి తెచ్చాను అన్నావు అంటూ కొడుకుని నిలదీస్తాడు 
శైలైంద్ర: నేను డబ్బు తెచ్చింది నా ఫ్రెండ్ దగ్గరే డాడ్. కానీ వాడి వెనుక ఎమ్మెస్సార్ ఉన్నాడని నాకు తెలియదు అంటూ నటిస్తాడు. ఫణీంద్ర: మోసం చేశావంటూ కోపంతో రగిలిపోతాడు 
MSR: మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం మోసం చేసే వాళ్ళు ఉంటూనే ఉంటారు. మోసపోవటం మీ తప్పు అంటూ కార్ లోంచి డాక్యుమెంట్స్ తీసి నాతో లోపలికి రండి అంటూ ఆర్డర్ వేసినట్లు చెప్తాడు. 
అసలు నువ్వు లోపలికి రావడమేంటి, నీతో మాటలు ఏంటి  అంటూ కోప్పడతాడు ఫణీంద్ర. లోపలికి వస్తే మీకే తెలుస్తుంది అంటూ అక్కడ నుంచి లోపలికి బయలుదేరుతాడు ఎమ్మెస్సార్. ఫాలో అవుతారు తండ్రి కొడుకులు.


Also Read: ఈ రాశివారిపై శివానుగ్రహం ఉంటుంది, సెప్టెంబరు 12 రాశిఫలాలు


మరోవైపు ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు రిషి.ఇప్పుడు ముహూర్తాలు పెట్టండి అంటాడు విశ్వనాథం. అప్పుడు రిషి లేచి పంతులు గారికి డబ్బు ఇచ్చి మీరు ఇప్పుడు ఏమి ముహూర్తాలు పెట్టక్కర్లేదు దయచేసి వెళ్లిపోండి అంటాడు. రిషి ప్రవర్తనకి ఆశ్చర్యపోతారు విశ్వం ఏంజెల్. ఎందుకు అలా మాట్లాడుతున్నావు అంటాడు విశ్వనాథం. నేను మీతో మాట్లాడాలి ముందు ఆయనని పంపించేయండి అని చెప్పడంతో పంతులు గారిని పంపించేస్తాడు విశ్వనాథం. ఆ తర్వాత మహేంద్ర వాళ్ళని చూపిస్తూ వాళ్ళు నా ఆత్మీయులు. వాళ్ళు ఇక్కడికి వచ్చింది కార్యక్రమం చూసి వెళ్లిపోవటానికి కాదు. కీలకమైన మలుపులో నన్ను హెచ్చరించడానికి వచ్చారు అని చెప్తాడు రిషి. అవును అంటూ మహేంద్ర ఏదో మాట్లాడబోతుంటే మీరేమీ మాట్లాడకండి, చెప్పవలసింది నేను అంటాడు  రిషి. 
అంతా షాక్ లో ఉండి చూస్తుంటారు...
ఎపిసోడ్ ముగిసింది...