వసు రిషికి కాల్ చేస్తుంది. చేసింది ఏంజెల్ అనుకుని రిషి ఎన్ని సార్లు చెప్పాలి ఏంజెల్ నేను ఇప్పుడు రాలేనని అరుస్తాడు. వసు వాయిస్ విని ఎందుకు చేశావని అడుగుతాడు. యాక్సిడెంట్ అయ్యింది అందుకే చేశానని చెప్పేసరికి రిషి షాక్ అవుతాడు. మహేంద్ర సార్ వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసరికి రిషి కంగారుగా బయల్దేరతాడు. వసు ఇంట్లో మహేంద్రకి డాక్టర్ కట్టు కడుతూ ఉంటాడు. చిన్న చిన్న దెబ్బలే త్వరగా కోలుకుంటారని డాక్టర్ చెప్పి మెడిసిన్ రాసి వెళ్ళిపోతాడు. అప్పుడే రిషి పరిగెత్తుకుంటూ వచ్చి మహేంద్రని చూసి టెన్షన్ పడతాడు. మేడమ్ కి ఎలా ఉందని అడుగుతాడు.


మహేంద్ర: మేం బాగున్నాము నువ్వేం బాధపడకు


రిషి: అసలు ఈ యాక్సిడెంట్ ఎలా జరిగింది. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు. మేడమ్ మీరే రమ్మని కాల్ చేశారా?


మహేంద్ర: లేదు విశ్వనాథం కాల్ చేశారు. రిషికి ఏంజెల్ కి పెళ్లి ఫిక్స్ చేశాను, నిశ్చితార్థానికి డేట్ పెట్టుకుంటున్నాం రమ్మని చెప్పారు. ఆ టెన్షన్ లో వస్తుంటే కారు స్పీడ్ కి స్కిడ్ అయి యాక్సిడెంట్ అయ్యింది. అసలు ఈ పెళ్లి ఏంటి? తను నువ్వు సైలెంట్ గా ఉండటం ఏంటి అసలు ఏం జరుగుతుంది


రిషి: ఇప్పుడు ఈ విషయం గురించి వదిలేయండి డాడ్. మీరు రెస్ట్ తీసుకోండి తర్వాత మాట్లాడుకుందాం


Also Read: సీతారామయ్య కోరిక విని షాకైన తల్లీకొడుకులు- భర్త ప్రేమకి పొంగిపోయిన కావ్య


జగతి రిషితో మాట్లాడటానికి ట్రై చేస్తుంటే రెస్ట్ తీసుకోమని చెప్పేసి వెళ్ళిపోతాడు. కారు బ్రేక్ లు సడెన్ గా ఎలా ఫెయిల్ అయ్యాయి. దీనికి కారణం శైలేంద్ర అయి ఉంటాడా? తనే బ్రేక్స్ తీసేసి ఉంటాడా అని జగతి డౌట్ పడుతుంది.


మహేంద్ర; ఇప్పుడు ఈ మాటలు రిషి వింటే చాలా ప్రమాదం. ప్రస్తుతం రిషి మనసులో మోయలేనంత భారం మోస్తున్నాడు. ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయట పడే మార్గం ఆలోచించాలి.


రిషి ఆలోచిస్తూ ఉండగా వసు వస్తుంది.


రిషి: మన జీవితం ఇలా అయిపోయింది ఏంటి? ఎప్పటికప్పుడు ఊహించని జరుగుతున్నాయ్ ఎందుకు? అటాక్స్ యాక్సిడెంట్స్.. ఇదా జీవితం. ఇదంతా ఎందుకు జరుగుతుందని ఎవరిని అడగాలి


వసు: ఎవరినో అడిగితే మీ ప్రశ్నలకు సమాధానం దొరకదు. దీనికి ఎక్కడ బీజం పడిందో, ఇక్కడిదాకా రావడానికి మూల కారణం ఏంటా అని ఆలోచించండి. మీరంటే గిట్టని వాళ్ళు ఉన్నారు. ఇప్పటికైనా మీ శత్రువులని గుర్తించండి. ఉంటే ఉండనివ్వమని ఇలా నిర్లక్ష్యం చేస్తే వీటికి అడ్డుకట్ట ఉండదు. బాధలు భరిస్తూ ఎందుకు నలిగిపోవాలి. మీ శత్రువులు గుర్తిస్తే పరిష్కారం దొరుకుతుంది కదా


రిషి: నా శత్రువులు ఎవరో మీకు తెలుసు కదా వాళ్ళు ఎవరో చెప్పండి మేడమ్


వసు: మీకు అయిన వాళ్ళే మీ శత్రువులు


రిషి: షటప్ అని వసు మీదకి చెయ్యి ఎత్తుతాడు. ఇలా మరోసారి అనొద్దు. ఇప్పుడు నాకు వచ్చిన కోపానికి మీరు నా వసుధార అయి ఉంటే.. ఇప్పుడు మీ వసుధార అని కాదని మిమ్మల్ని వదిలిపెడుతున్నా. అయినా నాకు అయిన వాళ్ళలో శత్రువులు ఎవరు ఉన్నారు. నన్ను ఇబ్బంది పెట్టి ప్రాణాలు తీయాలని ఎవరూ చూడరు. అయిన వాళ్ళలో నాకు శత్రువులు ఎవరూ లేరు


వసు: మరి మమ్మల్ని ఎందుకు శత్రువుల్లాగా చూస్తున్నారు


రిషి: నేను చూడటం లేదు మీరు నా నమ్మకాన్ని చంపేశారు. కాలేజ్ కి సంబంధించి నాకు శత్రువులు ఉన్నారు వాళ్ళు అటాక్ చేసిన ప్రతి సారి నేను తప్పించుకుంటున్నా అందుకే ఇప్పుడు నన్ను వీక్ చేయడానికి డాడ్ ని మేడమ్ ని టార్గెట్ చేశారు. అంతే కానీ మీరనుకున్నట్టు ఏమి ఉండదు


వసు: మీకోసం మీ తల్లిదండ్రులని ఎవరో టార్గెట్ చేశారని మీరే అంటున్నారు కదా వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మీదే కదా


రిషి: నా బాధ్యత నాకు గుర్తు చేయాల్సిన పని లేదు


రిషి వెళ్లిపోతుంటే వసు అడ్డుపడి ఆగమని కొన్ని విషయాలు చెప్పాలని అంటుంది. తనని వెళ్లనివ్వమని డోర్ తీయబోతుంటే బోల్ట్ తగిలి చేతికి గాయం అవుతుంది. వెంటనే వసు తనని కూర్చోబెట్టి ఫస్ట్ ఎయిడ్ చేస్తానని అంటే రిషి వినదు. దీంతో వసు కోపంగా చేతిని లాక్కుని కట్టుకడుతుంది. మహేంద్ర సర్ కోసం ఇక్కడే ఉండమని అడుగుతుంది. మన మధ్య ఈ దూరం బాగోలేదని ఇద్దరూ మనసులతో మాట్లాడుకుంటారు. మహేంద్ర పక్కనే కూర్చుని రిషి అలాగే నిద్రపోతాడు. అది చూసి వసు బెడ్ షీట్ కప్పి వెళ్లిపోతుంటే రిషి తన చేతిని పట్టుకుని కళ్ళు తెరిచి థాంక్స్ చెప్తాడు. డాడ్ తరఫున కూడా థాంక్స్ అంటాడు.  కానీ మీరు చెయ్యి పట్టుకున్న తీరు చూస్తుంటే మీ తరఫున థాంక్స్ చెప్తున్నట్టు ఉందని అనేసరికి రిషి చెయ్యి వదిలేస్తాడు.  పొగరు ఏంజెల్ విషయంలో మీ నిర్ణయం ఏంటని అడగవచ్చుగా కనీసం గుడ్ నైట్ అయిన చెప్పొచ్చుగా, వాళ్ళ ఇంట్లో పడుకున్నానని టెక్కు చూపిస్తుందని తిట్టుకుంటాడు.


Also Read: జాహ్నవి ఎంట్రీతో దివ్యకి కష్టాలు, తులసిని సైడ్ చేసేందుకు రత్నప్రభ స్కెచ్


మహేంద్ర నిద్రలేచి కిందకి దిగగానే కళ్ళు తిరిగిపడిపోతుంటే రిషి వచ్చి పట్టుకుంటాడు. విశ్వనాథం వాళ్ళకి నిజం చెప్పకుండా ఎన్నాళ్ళు తప్పించుకుని తిరుగుతున్నావని మహేంద్ర అడుగుతాడు.


జగతి: అవును రిషి నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం మేమే. మేము చేసింది తప్పని ఒప్పుకుంటున్నాం. గతం గురించి ఆలోచించి నీకు నువ్వు శిక్ష వేసుకోవద్దు. వాళ్ళకి నిజం చెప్పడం ఇబ్బంది అయితే జరిగింది అంతా మేం నీ తరఫున చెప్తాం. కనీసం ఈ రకంగా అయినా మేం చేసిన తప్పు సరిదిద్దుకునే అవకాశం ఇవ్వు


రిషి: అవసరం లేదు నేను ఒంటరిని నా తరఫున ఎవరూ సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు


అప్పుడే విశ్వనాథం మహేంద్ర వాళ్ళకి కాల్ చేస్తాడు. తన ఫోన్ రిషి లిఫ్ట్ చేస్తాడు. మహేంద్ర వాళ్ళు వచ్చారని ఇంకా నిద్రలేవలేదని అబద్ధం చెప్తాడు.


విశ్వం: నిశ్చితార్థం ముహూర్తం పెట్టడానికి పంతులు వస్తున్నాడు ఎట్టి పరిస్థితిల్లోనూ 11 గంటల్లోపు ఇంట్లో ఉండాలి. నీతో పాటు వాళ్ళని ఇంటికి తీసుకుని రా


రిషి: ఏంటి డాడ్ ఇది నాకు ఈ పెళ్లి ఇష్టం లేదంటే వాళ్ళు నిశ్చితార్థం పెళ్లి అని ముహూర్తం పెట్టిస్తున్నారు. దీన్ని ఎలా ఫేస్ చేయాలి


వసు: నిజం చెప్పండి. మౌనంగా ఉండి తప్పు చేస్తున్నారు. మీకు ఈ పెళ్లి ఇష్టం లేదని వాళ్ళకి తెలియదు. మా రిషి సర్ ఇలా చేయడు


రిషి: అవును నేను సాదాసీదా మనిషిని అందుకే చేయని తప్పుని నెత్తిన పెట్టుకుని తిరుగుతున్నా


మహేంద్ర: ఈ మనోవేదన అవసరమా. నువ్వు ఎలా ఉండాలని అనుకుంటే అలా ఉండగలిగే రాజువి. మనసు ఒకటి మాట ఒకటి అయ్యే పరిస్థితిలో ఇరుక్కున్నావ్. నువ్వు వాళ్ళకి ధైర్యంగా ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేయ్


జగతి: అయితే మేం నిజం చెప్తాం


రిషి: ఏం చెప్తారు నేను మీ కొడుకునని చెప్తారా? ఈ మేడమ్ కి నాకు నిశ్చితార్థం అయ్యిందని చెప్తారా? లేదంటే మీ కొడుకు మీద నింద వేసి కాలేజ్ నుంచి వెళ్లగొట్టారని చెప్తారా? ఏం చెప్తారు. మీరు ఎవరికీ ఏ నిజాలు చెప్పాల్సిన అవసరం లేదు. నేను నమ్మిన వాళ్ళు బతికుండగానే నా ప్రాణం తీసేశారు