మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ జూనియర్ (Jr NTR) ఉదయం దుబాయ్ వెళ్లారు. గురువారం బయలు దేరారు. పిల్లలు అభయ్ రామ్, భార్గవ్ రామ్ సైతం ఆయన వెంట ఉన్నారు. ఫ్యామిలీ అంతా కలిసి దుబాయ్ వెళ్లినప్పటికీ... ఇది హాలిడే ట్రిప్ కాదు! ఓ అవార్డు వేడుకలో పాల్గొనడానికి ఆయన వెళ్లినట్లు తెలిసింది. 


'ఆర్ఆర్ఆర్'కు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు గ్యారెంటీ!
ఈ నెల 15, 16వ తేదీల్లో... శుక్రవారం, శనివారం నాడు సైమా (SIIMa Awards 2023) - సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ వేడుకలు దుబాయ్ (Dubai)లో జరుగుతాయి. వాటిలో పాల్గొనడానికి ఎన్టీఆర్ వెళ్లినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాలో నటనకు గాను ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ అవార్డు అందుకోనున్నారని సమాచారం.


'ఆర్ఆర్ఆర్'లో కొమురం భీం పాత్రలో ఎన్టీఆర్ అద్భుతమైన నటన కనబరిచారు. 'కొమురం భీముడో... కొమురం భీముడో' పాటలో ఆయన అభినయం ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టించింది. ఇక, ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సులో ఎన్టీఆర్ ఎంట్రీ అయితే గూస్ బంప్స్ తెప్పించింది. ఇప్పుడు 'సైమా' అవార్డు కూడా ఎన్టీఆర్ ఖాతాలో చేరినట్లు తెలిసింది. 


సైమా అవార్డు వేడుకలకు వెళ్లడం కోసం 'దేవర' చిత్రీకరణకు ఎన్టీఆర్ చిన్న బ్రేక్ ఇచ్చారని ఫిల్మ్ నగర్ వర్గాల ఖబర్. వీకెండ్ ఎలాగో షూటింగు ఉండదు. ఆ లెక్కన చూసినా సరే ఇది పెద్ద బ్రేక్ కాదు. కొన్ని రోజుల నుంచి హైదరాబాద్ సిటీలో 'దేవర' అండర్ వాటర్ సీక్వెన్సులు, యాక్షన్ సీన్లు తీస్తున్నారు. 


అన్నా అని పిలిచా... సెల్ఫీ పోస్ట్ చేసిన హిమజ!
ఎన్టీఆర్ వెళ్లిన విమానంలో నటి హిమజ కూడా దుబాయ్ వెళ్లారు. ఫ్లైటులో ఎన్టీఆర్ కనిపించిన వెంటనే 'అన్నా' అని పిలిచానని హిమజ పోస్ట్ చేశారు.


Also Read : రాయల్ ఫ్యామిలీ వారసుడిగా ఎన్టీఆర్ - 'దేవర' కథలో అసలు ట్విస్ట్ ఇదే!?






'ఆర్ఆర్ఆర్' తర్వాత సుమారు ఏడాది పాటు ఎన్టీఆర్ కొత్త సినిమా 'దేవర' స్క్రిప్ట్ వర్క్ జరిగింది. ఒక్కసారి సెట్స్ మీదకు వెళ్లిన తర్వాత శరవేగంగా చిత్రీకరణ చేస్తున్నారు దర్శకుడు కొరటాల శివ. ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన 'అతిలోక సుందరి' శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ నటిస్తున్నారు. ఇది పాన్ ఇండియా సినిమా అయినప్పటికీ... జాన్వీకి తొలి తెలుగు సినిమా. ఇందులో బాలీవుడ్ హీరో సైఫ్ అలీ ఖాన్ మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. 


'దేవర' తర్వాత మరో రెండు సినిమాలను ఎన్టీఆర్ లైనులో ఉంచారు. అందులో 'కెజియఫ్', 'సలార్' చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ సినిమా ఒకటి. ఇంకొకటి... హిందీలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోలుగా 'వార్', 'పఠాన్' సినిమాల ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న 'వార్ 2' ఒకటి. ప్రస్తుతం ఎన్టీఆర్ చేస్తున్న సినిమాలు అన్నీ జాతీయ స్థాయిలో ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని చేస్తున్న సినిమాలే. 


Also Read పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డౌట్స్ తీర్చిన హరీష్ శంకర్




ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial