బాలకృష్ణ 'భగవంత్ కేసరి'లో విలన్ ఫస్ట్ లుక్
గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన సినిమా 'భగవంత్ కేసరి'. బ్రో ఐ డోంట్ కేర్... అనేది ఉప శీర్షిక. విజయ దశమి కానుకగా అక్టోబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ విలన్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ రోజు ఆయన ఫస్ట్ లుక్ విడుదల చేశారు. 'భగవంత్ కేసరి'లో రాహుల్ సంఘ్వి పాత్రలో అర్జున్ రాంపాల్ కనిపించనున్నారని చిత్ర బృందం తెలియజేసింది. స్టైలిష్ సూట్ వేసుకుని, కుర్చీలో రాయల్‌గా కూర్చున్న అతని ఫస్ట్ లుక్ విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
చిరంజీవి ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్!
మెగా ఇంట పెళ్లి సంబరం మొదలైంది. చిరంజీవి సోదరుడు నాగబాబు కుమారుడు వరుణ్ తేజ్ (Varun Tej), సొట్ట బుగ్గల సుందరి లావణ్యా త్రిపాఠి త్వరలో ఏడు అడుగులు వేయనున్నారు. అయితే.... శుక్రవారం రాత్రి చిరు ఇంట్లో ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరిగాయి. మెగా కుటుంబ సభ్యులకు లావణ్యా త్రిపాఠి తెలుసు. కథానాయికగా ఆమె చేసిన సినిమాలు చూశారు. వరుణ్ తేజ్ కాకుండా అల్లు శిరీష్ సరసన ఓ సినిమా చేశారు. గీతా ఆర్ట్స్ నిర్మించిన సినిమాల్లో నటించారు. వినాయక చవితి నాడు నాగబాబు ఇంట్లో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి పూజలు చేశారు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేశారు కూడా! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
గోపీచంద్ 32 షూటింగ్ షురూ - ఈ సినిమాతోనైనా దర్శకహీరోలు సరైన సక్సెస్ సాధిస్తారా?
మాచో స్టార్ గోపీచంద్ హీరోగా శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది గోపీచంద్ కెరీర్ లో 32వ చిత్రం. చిత్రాలయం స్టూడియోస్ బ్యానర్ పై ప్రొడక్షన్ నెం.1 గా ఇటీవలే ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమాలతో గ్రాండ్ గా లాంచ్ చేశారు. అయితే తాజాగా ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించిన అప్డేట్ ను దర్శకుడు సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. ప్రస్తుతానికి #Gopichand32 అనే వర్కింగ్ టైటిల్ తో పిలబడుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ఇటలీ, మిలాన్ లోని కొన్ని అద్భుతమైన లోకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్నట్లు తెలుపుతూ శ్రీను వైట్ల ఓ వీడియోని షేర్ చేశారు. ఈ షెడ్యూల్ లో హీరో గోపీచంద్ తో పాటు ఇతర తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరిస్తున్నారని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అల్లు అర్జున్, సూర్యతో సినిమాల తర్వాత 'అఖండ 2' - మహేష్ బాబుతో కూడా...
కమర్షియల్ సినిమాలు చేయడంలో బోయపాటి శ్రీనుది సెపరేట్ స్టైల్. గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ఆయన చేసిన సినిమాలు భారీ విజయాలు సాధించాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తీసిన 'సరైనోడు' కూడా సూపర్ డూపర్ సక్సెస్ సాధించింది. ఇప్పుడు ఈ ఇద్దరు హీరోలతో ఆయన మళ్ళీ సినిమాలు చేయబోతున్నారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించిన తాజా సినిమా 'స్కంద'. ది ఎటాకర్... అనేది ఉప శీర్షిక. ఉస్తాద్ రామ్ పోతినేని హీరోగా నటించిన చిత్రమిది. విమర్శకుల నుంచి సినిమాకు మిశ్రమ స్పందన లభించింది. మాస్ & బి సి సెంటర్ ఆడియన్స్ నుంచి సినిమాకు వసూళ్లు బాగా వచ్చాయి. 'స్కంద' విడుదల తర్వాత బోయపాటి శ్రీను తీయబోయే సినిమా ఏది? ఈ ప్రశ్నకు తాజా ఇంటర్వ్యూలలో ఆయన జవాబు ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'యానిమల్'లో రణబీర్, రష్మిక ఫస్ట్ నైట్ అంత వయలెంట్‌గా ఉంటుందా?
'యానిమల్' టీజర్ చూశారా? విలన్ల మీద హీరోల గొడ్డలి వేటు చాలా గట్టిగా పడింది. రక్తం ఏరులై పారింది. సినిమాలో వయలెన్స్ ఏ విధంగా ఉంటుంది? అనే ప్రశ్నకు టీజర్ స్పష్టమైన జవాబు ఇచ్చింది. తెలుగులో 'అర్జున్ రెడ్డి', తర్వాత ఆ కథతో హిందీలో తీసిన 'కబీర్ సింగ్' సినిమాలతో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మేకింగ్ స్టైల్ ఏంటనేది జనాలకు తెలుసు. అందువల్ల, ఆ టీజర్ చూసిన ప్రేక్షకులు సినిమా ఎలా ఉంటుందోనని ఊహించుకున్నారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే... యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే కాదు, రొమాంటిక్ సీన్స్ కూడా చాలా వయలెంట్‌గా ఉంటాయట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)