TDP News : చంద్రబాబు అరెస్టుకు వ్యతిరేకంగా శాంతియుత నిరసనలు తెలిపే వారిపైనా కేసులు పెట్టడం, సెక్షన్ 30 పేరుతో నిరసనలను అణిచి వేయడంపై అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ నేతలకు సెక్షన్ 30 వర్తించదా అని ప్రస్నించారు. చంద్రబాబును అరెస్టు చేయడంపై ప్రజల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోందని.. పోలీసు ల సాయంతో ప్రజల్ని నిలువరిస్తూ తప్పించుకుంటున్నారు గానీ.. లేకుంటే ప్రజలు తాడేపల్లి ప్యాలెస్ ను నేలమట్టం చేసేవారని అచ్చెన్నాయుడు జోస్యం చెప్పారు. గుంటూరులో నేడు అన్నిపార్టీలు కలిసి శాంతియుత ర్యాలీకి పిలుపు నిచ్చారు. దాన్ని అడ్డుకోవడానికి పోలీసులు రాత్రి నుంచే అన్నిపార్టీల నేతల్ని ఇళ్ల నుంచి బయటకు రాకుండా నిర్బంధించారని మండిపడ్డారు. .
రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చడం టీడీపీ ఉద్దేశం కాదు !
రాష్ట్రాన్ని వల్లకాడుగా మార్చడం తెలుగుదేశం పార్టీ ఉద్దేశం కాదని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. శాంతియుత నిరసనలకు చేతకాక పిలుపునివ్వడం లేదని.. రాష్ట్రం, ప్రజలు నష్టపోకూడదు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరక్కూడదనే ఆలోచిస్తున్నామన్నారు. మొన్న మేం మోత మోగిద్దాం.. కార్యక్రమానికి పిలుపునిచ్చాం. ప్రజలు స్వఛ్చందంగా వారికి నచ్చిన విధంగా మోత మోగించి నిరసన తెలిపి, చంద్రబాబుకి మద్ధతిచ్చారు. అలానే గాంధీ జయంతి నాడు సత్యాగ్రహ దీక్షలకు పిలుపునిస్తే, ప్రజలు వారి ఇళ్లల్లో ఉండే నిరాహార దీక్షలు చేపట్టారు. నేడు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చిన ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమం కూడా దిగ్విజయం అవుతుంది. ప్రజల నిరసనల నుంచి వెలువడే కాంతి ధాటికి ఈ ప్రభుత్వం.. ముఖ్యమంత్రి కళ్లు బైర్లు కమ్ముతాయని హెచ్చరించారు.
పోలీసుల తీరుపై కోర్టుకు వెళ్లే ఆలోచన
తెలుగుదేశం పార్టీ చేపట్టే కార్యక్రమాలకు మాత్రమే 144 సెక్షన్ వర్తిస్తుందా అని అచ్చెన్నాయుడు ప్రశ్నించారు. రెండ్రోజుల్లో విజయవాడలో వైసీపీ భారీ సమావేశం పెట్టనుంది. దానివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తవా అని డీజీపీ ని ప్రశ్నిస్తున్నా. ఖాకీ దుస్తులు వేసుకోగానే సరికాదు.. చట్టం వైసీపీవారికి మాత్రమే చుట్టమా? మేం ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా, శాంతియుతంగా నిరసన తెలుపుతామని లిఖితపూర్వకంగా తెలియచేస్తున్నా కూడా పోలీసులు మా కార్యక్రమా లపై ఉక్కుపాదం మోపుతున్నారని మండిపడ్డారు. పోలీసులు తీరు మార్చుకోవాలన్నారు. శాంతియుత నిరసన ప్రదర్శనలు తమకు రాజ్యాంగం ిచ్ిచన హక్కు అన్నారు.
శాశ్వతంగా సెక్షన్ 30 అమలు చేస్తారా ?
రాష్ట్రంలో పోలీసు పాలన జరుగుతోందని సెక్షన్ 30 అనేది ఎప్పుడో చాలా విపత్కర పరిస్థితులు తలెత్తినప్పుడు మాత్రమే పెడతారన్నారు. అదికూడా కేవలం ఒకటి.. రెండు రోజులు మాత్రమే. కానీ జగన్ రెడ్డి వచ్చాక నెలలతరబడి సెక్షన్ 30 అమలు చేస్తు న్నారని విమర్శించారు. రాష్ట్రప్రభుత్వానికి ఊడిగం చేస్తున్న పోలీసు అధికారులు.. రాజ్యాంగహక్కుల్ని కాలరాస్తున్న జగన్ రెడ్డి సర్కార్ దమనకాండపై, మా నిరసనలను అడ్డుకోవడంపై న్యాయస్థానాల్ని ఆశ్రయించ బోతున్నామని ప్రకటించారు. తప్పు చేసే పోలీసుల్ని న్యాయస్థానాల ద్వారానే శిక్షిస్తాం.” అని అచ్చెన్నాయుడు తేల్చిచెప్పారు.