ఎంబీబీఎస్ పాస్ పర్సంటేజ్‌ను ఇటీవల 40 శాతానికి తగ్గించిన నేషనల్ మెడికల్ కమిషన్.. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది. పాతవిధానం ప్రకారం 50 శాతం పాస్ పర్సంటేజ్ ఉంటుందని తాజాగా ప్రకటించింది. పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయాన్ని మార్చుకున్నట్టు శుక్రవారం (అక్టోబరు 6న) అధికారికంగా ఓ నోటిఫికేషన్‌ను ఎన్‌ఎంసీ విడుదల చేసింది. 


సాధారణంగా ఎంబీబీఎస్ కోర్సు చివరలో అగ్రిగేట్ సబ్జెక్టుల్లో(థియరీ, ప్రాక్టికల్ కలిపి) ఓవరాల్‌గా 50 శాతం మార్కులు వస్తేనే ఉత్తీర్ణతగా పరిగణిస్తారన్న సంగతి తెలిసిందే. అయితే సెప్టెంబర్‌లో ఈ పాస్‌ పర్సంటేజ్‌ను 40 శాతానికి తగ్గిస్తూ ఎన్‌ఎంసీ నిర్ణయం తీసుకుంది. దానికి తగ్గట్టుగా కాంపిటెన్సీ బేస్డ్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ (సీబీఎంఈ) పాఠ్య ప్రణాళిక (కరిక్యులమ్‌) మార్గదర్శకాలను సవరించింది. తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.


ALSO READ:


అజీమ్ ప్రేమ్‌జీ వర్సిటీలో డిగ్రీ కోర్సులు, వివరాలు ఇలా!
అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్సిటీ బెంగళూరు, భోపాల్‌లోని క్యాంపస్‌లలో 2023-24 విద్యా సంవత్సరానికి పీజీ కోర్సుల్లో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. సంబంధిత విభాగాల్లో డిగ్రీ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు నవంబరు 22లోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ప్రవేశ పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


ఎన్‌సీఈఆర్‌టీలో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సు, అర్హతలివే!
న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), 2024 విద్యాసంవత్సరానికిగాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(NID)తో పాటు ఆర్‌ఐఈ- షిల్లాంగ్‌, భోపాల్‌, అజ్‌మేర్‌, భువనేశ్వర్‌, మైసూరులో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో సెంటర్‌లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 
కోర్సు పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణ, దరఖాస్తుకు వీరు అర్హులు
తెలంగాణలోని నిరుద్యోగ యువతీ, యువకులకు సైబర్‌ సెక్యూరిటీ కోర్సుల్లో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ సైబర్‌ సెక్యూరిటీ డైరెక్టర్‌ విమలారెడ్డి అక్టోబరు 2న ఒక ప్రకటనలో తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్‌ సైబర్‌ సెక్యూరిటీ మేనేజ్‌మెంట్‌, సైబర్‌ సెక్యూరిటీ ఎథికల్‌ హ్యాకింగ్‌ సర్టిఫికేట్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని ఆమె వెల్లడించారు. ఈ కోర్సులకు ఇంటర్‌, డిగ్రీ, పీజీ, ఇంజినీరింగ్‌, పాలిటెక్నిక్‌ డిప్లొమా పూర్తిచేసినవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. అక్టోబరు 13 లోపు ద్వారా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. ఇత వివరాలకు 78931 41797లో సంప్రదించాలని విమలారెడ్డి సూచించారు.
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


IWST: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ బెంగళూరులో పీజీ డిప్లొమా ప్రోగ్రామ్
బెంగళూరులోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఉడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ(ఐడబ్ల్యూఎస్‌టీ) పీజీ డిప్లొమా ప్రోగ్రామ్‌లో ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతుంది. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సైన్స్‌ డిగ్రీ, ఇంజినీరింగ్ బీఈ, బీటెక్‌)  ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలు గల అభ్యర్థులు అక్టోబర్ 30 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 
కోర్సు వివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...