న్యూఢిల్లీలోని నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రిసెర్చ్ అండ్ ట్రైనింగ్ (NCERT), 2024 విద్యాసంవత్సరానికిగాను డిప్లొమా కోర్సులో ప్రవేశానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా న్యూఢిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌(NID)తో పాటు ఆర్‌ఐఈ- షిల్లాంగ్‌, భోపాల్‌, అజ్‌మేర్‌, భువనేశ్వర్‌, మైసూరులో గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌ డిప్లొమా కోర్సులో ప్రవేశాలు కల్పించనున్నారు. ఒక్కో సెంటర్‌లో 50 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 


వివరాలు..


* గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్‌లో డిప్లొమా కోర్సు


వ్యవధి: ఒక ఏడాది. ఇందులో 6 నెలలు-గైడెడ్ సెల్ఫ్ లెర్నింగ్, ఇంటెన్సివ్ ప్రాక్టికమ్-3 నెలలు, ఇంటర్న్‌షిప్-3 నెలలు.


అర్హత: కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీతోపాటు బీఈడీచేసి టీచర్లుగా పనిచేస్తున్నవారు, రెండేళ్ల టీచింగ్ అనుభవం ఉన్నవారు దీంతోపాటు రెండేళ్ల పని అనుభవం ఉన్న ఉపాధ్యాయులు లేదా పీజీ(సైకాలజీ/ ఎడ్యుకేషన్/ సోషల్ వర్క్/ చైల్డ్ డెవలప్‌మెంట్/ స్పెషల్ ఎడ్యుకేషన్‌) ఉత్తీర్ణులై ఉండాలి. కనీసం ఏడాది బోధన లేదా సంబంధిత పని అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది. 


బోధనా మాధ్యమం: ఇంగ్లిష్/ హిందీ.


దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారాజ


ప్రవేశ విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.


ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరితేది: 03.11.2023.


Notification


Online Application


Website


ALSO READ:


జేఎన్‌టీయూహెచ్‌లో పార్ట్‌ టైమ్ పీజీ కోర్సులు, అర్హతలివే!
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నలాజికల్‌ యూనివర్సిటీ (జేఎన్‌టీయూహెచ్‌)-పార్ట్‌ టైమ్ పీజీ కోర్సుల్లో దరఖాస్తు గడువును అధికారులు పొడిగించారు. సెప్టెంబరు 27తో ముగిసిన గడువును అక్టోబరు 9 వరకు పొడిగించారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.3000 చెల్లించాల్సి ఉంటుంది. ఎంటెక్‌, ఎంబీఏ ప్రోగ్రామ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఒక్కో ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఆరు సెమిస్టర్లు ఉంటాయి. వీటిని ఉద్యోగులకు ప్రత్యేకించారు. అభ్యర్థులు హైదరాబాద్‌ పరిధిలో కనీసం ఏడాదిపాటు ఉద్యోగం చేసిన అనుభవం తప్పనిసరిగా ఉండాలి. దరఖాస్తుతోపాటు ఒరిజినల్‌ సర్వీస్‌ సర్టిఫికెట్‌ అవసరమవుతాయి. ప్రవేశపరీక్ష ద్వారా సీట్లను భర్తీ చేస్తారు. అయితే ఈ ప్రోగ్రామ్‌లకు ఎలాంటి స్కాలర్‌షిప్‌ లభించదు. 
కోర్సుల వివరాల కోసం క్లిక్ చేయండి..


అంబేడ్కర్ వర్సిటీ డిగ్రీ, పీజీ ప్రవేశ గడువు మరోసారి పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ (బీఏ/బీకాం/బీఎస్సీ), పీ.జీ(ఎంఏ, ఎంకామ్, ఎమ్మెస్సీ, ఎంబీఏ, బీఎల్ఐఎస్‌సీ, ఎంఎల్ఐఎస్‌సీ, పీజీ డిప్లొమా, పలు సర్టిఫికెట్) కోర్సుల్లో ప్రవేశాల గడువును అధికారులు మరోసారి పొడిగించారు. అక్టోబరు 4తో గడువు ముగియగా.. ప్రవేశాలు పొందేందుకు అక్టోబరు 20 వరకు అవకాశం కల్పిస్తున్నట్లు ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. అభ్యర్థులు అక్టోబరు 20 వరకు ఎలాంటి ఆలస్య రుసుము చెల్లించాల్సిన అవసరంలేదు. ఆయా కోర్సుల్లో చేరడానికి, విద్యార్హతలు, ఫీజు తదితర వివరాలను సమీపంలోని అధ్యయన కేంద్రాన్ని సందర్శించాల్సి ఉంటుంది. 
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సులు - వివరాలు ఇలా
వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌,  2023-24 విద్యా సంవత్సరానికి వర్సిటీతో పాటు అనుబంధ కళాశాలల్లో ఎంఎస్సీ నర్సింగ్‌, ఎంపీటీ కోర్సుల్లో ప్రవేశానికి వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. ప్రవేశాలు కోరేవారు అక్టోబరు 1 నుంచి అక్టోబరు 7 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కనీసం 55 శాతం మార్కులతో బీఎస్సీ (నర్సింగ్‌) లేదా పోస్ట్‌ బీఎస్సీ(నర్సింగ్‌) ఉత్తీర్ణతతో పాటు అయిదేళ్ల పని అనుభవం ఉండాలి. బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు 50 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.
ప్రవేశాలకు సంబంధించిన పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి...