రస్టిక్ యాక్షన్ థ్రిల్లర్‌గా ‘మంగళవారం’, ట్రైలర్ లాంఛ్ చేసిన మెగాస్టార్
‘RX100’ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘మంగళవారం’. ఇప్పటికే విడుదలైన టీజర్, పోస్టర్లు ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెంచాయి. అసలు సినిమా టైటిలే చాలా కొత్తగా ఆసక్తి కలిగిస్తోంది. ‘మహాసముద్రం’ చిత్రంతో ఘోర పరాభవాన్ని చవిచూసిన ఆయన ఇప్పుడు ‘మంగళవారం’ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నారు. హార్రర్ కమ్ థ్రిల్లర్ జానర్‌ను రూపొందిన ఈ సినిమా నవంబర్ 17న రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం వరుస అప్ డేట్స్ తో సినిమాపై అంచనాలు పెంచుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
3 భాగాలుగా ‘మహా భారతం‘- బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సంచలన నిర్ణయం
వివేక్ రంజన్ అగ్నిహోత్రి. బాలీవుడ్ సంచలన దర్శకుడు. ఆయన తెరకెక్కించింది తక్కువ సినిమాలే అయినా.. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. అద్భుత ప్రేక్షకాదరణ దక్కించుకున్నాయి. ఆయన దర్శకత్వంలో మరో ప్రతిష్టాత్మక చిత్రం రూపుదిద్దుకోబోతోంది. భారతీయులు ఎంతో గొప్పగా భావించే మహా భారతాన్ని తెరకెక్కించబోతున్నారు. మూడు భాగాలుగా వెండితెరపై విజువల్ వండర్‌గా ఆవిష్కరించబోతున్నారు. ఈ మేరకు వివేక్ అధికారిక ప్రకటన చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'సరిపోదా శనివారం' అంటున్న నాని - వివేక్ ఆత్రేయ!
నేచురల్ స్టార్ నాని కథానాయకుడిగా యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ ఓ కొత్త సినిమా చేయడానికి సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఆల్రెడీ వీళ్ళిద్దరూ 'అంటే సుందరానికి' సినిమా చేశారు. బాక్సాఫీస్ బరిలో ఆ సినిమాకు ఆశించిన వసూళ్లు రాలేదు. కానీ, ప్రేక్షకులతో పాటు విమర్శకుల మనసులు గెలుచుకుంది. ఇప్పుడు మరోసారి హీరో, దర్శకుడు కలిసి సినిమా చేస్తున్నారు. ఆ సినిమాకు టైటిల్ ఖరారు చేసినట్లు తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
'భగవంత్ కేసరి' రెండవ రోజు కలెక్షన్స్ ఎంతంటే?
'అఖండ', 'వీర సింహా రెడ్డి' సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తాజాగా ‘భగవంత్ కేసరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇతర చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది. బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో రూ. 50 కోట్లకు పైగా సంపాదించింది. ఈ నేపథ్యంలోనే రెండో రోజుల కలెక్షన్లను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రజనీకాంత్, లోకేష్ కనగరాజ్ సినిమాలో విలన్‌గా మలయాళ హీరో?
మన తెలుగు రాష్ట్రాల్లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులు ఎలా అయితే ఉన్నారో... ఈ తరం ప్రేక్షకులలో దర్శకుడు లోకేష్ కనగరాజ్‌కు కూడా అలాగే అభిమానులు ఉన్నారు. రీసెంట్ విజయ్ సినిమా 'లియో'కి వస్తున్న కలెక్షన్స్ అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. సందీప్ కిషన్ 'నగరం' (తమిళంలో 'మా నగరం), కార్తీ 'ఖైదీ', లోకనాయకుడు కమల్ హాసన్ 'విక్రమ్' సినిమాల ఎఫెక్ట్ అది. పృథ్వీరాజ్ సుకుమారన్ గుర్తు ఉన్నారు కదా! ప్రభాస్ 'సలార్'లో కీలక పాత్రలో నటించారు. ఆయన సినిమాలు కొన్ని తెలుగులో రీమేక్ అయ్యాయి. మరొకొన్ని డబ్ అయ్యాయి. ఇప్పుడు రజనీకాంత్ సినిమాలో విలన్ పాత్ర కోసం డిస్కషన్స్ చేస్తున్నారు. ఏమవుతుందో చూడాలి. ఇదీ లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)లో సినిమాయే. హీరోలతో పాటు విలన్ క్యారెక్టర్లను సైతం సంథింగ్ స్పెషల్ అన్నట్లు ఉంటాయి. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)