'అఖండ', 'వీర సింహా రెడ్డి' సినిమాలో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ, తాజాగా ‘భగవంత్ కేసరి’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచి పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ వద్ద డీసెంట్ ఓపెనింగ్స్ ని అందుకుంది. ఇతర చిత్రాల నుంచి గట్టి పోటీ ఉన్నప్పటికీ కూడా మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది.
రెండో రోజు వసూళ్లు ఎంతంటే..
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ 'లియో', రవితేజ 'టైగర్ నాగేశ్వరరావు' నుంచి ‘భగవంత్ కేసరి’ గట్టి పోటీ ఎదుర్కొంది. అయినాసరే బాక్సాఫీస్ వద్ద రెండు రోజుల్లో రూ. 50 కోట్లకు పైగా సంపాదించింది. ఈ నేపథ్యంలోనే రెండో రోజుల కలెక్షన్లను చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ప్రపంచ వ్యాప్తంగా రెండు రోజుల్లో రూ. 51.12 కోట్ల గ్రాస్ వసూళు చేసినట్లు తెలిపింది. అమెరికాలో 800K డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ.6.65 కోట్లు వసూళు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రెండో రోజు రూ.18 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రెండు రోజుల్లో రూ. 30 కోట్లకు పైగా వరకు షేర్ వచ్చిందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఆంధ్రాలో రూ.15 కోట్లు, సీడెడ్‌లో రూ.8 కోట్లు, నైజాంలో రూ.10 కోట్లు కలెక్ట్ చేసిందట. మొత్తంగా వరల్డ్‌వైడ్‌గా రూ.51.12 కోట్ల గ్రాస్‌ను అందుకున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
తెలంగాణ యాసలో అదరగొట్టిన బాలయ్య
నటసింహా నందమూరి బాలకృష్ణ, శ్రీలీల ప్రధాన పాత్రల్లో నటించిన ఎమోషనల్ ఫ్యామిలీ మూవీ 'భగవంత్ కేసరి'. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. అర్జున్ రాంపాల్ విలన్ పాత్రలో కనిపించారు. ఈ చిత్రంలో శ్రీ లీల బాలయ్య కూతురుగా నటించింది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలో మహిళల గురించి చర్చించిన తీరుపై విమర్శకుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. ముఖ్యంగా శ్రీలీల ఈ చిత్రంలో కెరియర్ బెస్ట్ పర్ఫామెన్స్ ఇచ్చిందని చెప్పవచ్చు. అలాగే బాలయ్య తెలంగాణ స్లాంగ్ లో డైలాగ్స్, యాక్షన్ తో అదరగొట్టేసారు. ఈ సినిమాకు థమన్ అదిరిపోయే మ్యూజిక్‌ను ఇచ్చారు. ఇక, ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించారు.
Read Also: కంగనాను కావాలనే పిలవలేదు, కరణ్ జోహార్‌ను ఆట ఆడేసుకుంటున్న నెటిజన్లు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial