అప్పుడు వర్మ, ఇప్పుడు వంగా - నా ఫేవరేట్ యాక్టర్ రణబీర్: రాజమౌళి
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, రష్మిక కలిసి నటించిన తాజా చిత్రం ‘యానిమల్’. దర్శకుడు సందీప్ వంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. డిసెంబర్ 1న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ‘యానిమల్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దిగ్గజ దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళి చీఫ్ గెస్టులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజమౌళి దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో పాటు రణబీర్ కపూర్ పై ప్రశంసలు కురిపించారు. అప్పట్లో వర్మ లాగే, ఇప్పుడు వంగా సంచలనాలు క్రియేట్ చేయబోతున్నారని చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
రష్మిక రాలేదు... కానీ 'గర్ల్ ఫ్రెండ్' మొదలు!
రష్మికా మందన్నా ప్రధాన పాత్రలో రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్న సినిమా 'ది గర్ల్ ఫ్రెండ్'. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విద్య కొప్పినేని, ధీరజ్ మొగిలినేని నిర్మాతలు. కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా ఈ రోజు హైదరాబాద్ సిటీలో లాంఛనంగా చిత్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రష్మిక డుమ్మా కొట్టారు. (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
పార్టీ పెట్టి కోట్లు సంపాదించారు, పేదల కోసం పైసా ఖర్చు చేయలేదు - చిరంజీవిపై మన్సూర్ అలీ తీవ్ర వ్యాఖ్యలు
సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ పై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు మన్సూర్ క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది. మరోవైపు త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తనపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మన్సూర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తనను వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిది వక్రబుద్ధి? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి రూ. 1,000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
ఒడియమ్మా... నానితో ఆట, తమిళ హీరోతో పాట - శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో!
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'హాయ్ నాన్న'. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... అందులో ఆమె తళుక్కున మెరిశారు. అప్పుడు ప్రత్యేక గీతం, కొన్ని సీన్లు చేశారని అర్థమైంది. అంతకు ముందు సినిమాలో ఆమె నటించిన సంగతి బయటకు వచ్చింది. ఈ రోజు ఆ లిరికల్ వీడియో విడుదల చేశారు.శృతి హాసన్ సాంగ్ స్పెషాలిటీస్ ఎన్నో తెలుసా? (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
ఉడుంపట్టు పట్టిన ప్రగతి, పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం కొట్టేసింది!
సినీనటి ప్రగతి గురించి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాల్లో డీసెంట్ క్యారెక్టర్స్‌తో మంచి పేరు తెచ్చుకున్న ఆమె సోషల్ మీడియాలో భలే యాక్టీవ్‌గా ఉంటారు. నిత్యం జిమ్ చేస్తూ.. ఫిట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంది. చెమటలు కక్కేలా వర్కౌట్స్ చేస్తుంది. తాజాగా తన కష్టం వెనుకున్న అసలు కథ ఏంటో ప్రపంచానికి చాటి చెప్పింది. ఏకంగా నేషనల్ లెవెల్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్ లో కాంస్యం సాధించి సత్తా చాటింది. అందరూ ఔరా అనేలా చేసింది. (పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి)
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply