Mansoor Ali Khan On Chiranjeevi: సౌత్ స్టార్ హీరోయిన్ త్రిషపై తమిళ నటుడు మన్సూర్ అలీ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆయన కామెంట్స్ పై పలువురు ప్రముఖులు ఆగ్రహం వ్యక్తం చేశారు. త్రిషకు మద్దతుగా 'లియో' దర్శకుడు లోకేష్ కనగరాజ్, మెగాస్టార్ చిరంజీవి, యువ హీరో నితిన్, నటి ఖుష్బూ, హీరోయిన్ మాళవికా మోహనన్ సహా పలువురు సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పించారు. జాతీయ మహిళా కమిషన్ కూడా సీరియస్ అయ్యింది. తమిళ పోలీసులు ఆయనపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేశారు. చివరకు మన్సూర్ త్రిషకు క్షమాపణ చెప్పడంతో వివాదం సర్దుమణిగింది.


మెగాస్టార్ పై మన్సూర్ తీవ్ర ఆరోపణలు


మరోవైపు త్రిషపై అనుచిత వ్యాఖ్యల నేపథ్యంలో తనపై మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలను మన్సూర్ తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.  తనను వక్రబుద్ధి కలిగిన వ్యక్తి అని విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిది వక్రబుద్ధి? అంటూ ఘాటుగా ప్రశ్నించారు. చిరంజీవి పార్టీ పెట్టి రూ. 1,000 కోట్లు సంపాదించారని ఆరోపించారు. ప్రజల కోసం పైసా ఖర్చు పెట్టడం లేదని మండిపడ్డారు. ఆయనతో కలిసి నేను కూడా నటించాను. ప్రతి ఏటా పాత హీరోయిన్లు అందరితో కలిసి పార్టీ చేసుకుంటారు. కేవలం ఆడవారినే ఆ పార్టీకి పిలుస్తారు. దాని గురించి నేనేమీ అనడం లేదు. అది ఆయన వ్యక్తిగత విషయం. కానీ, నా విషయంలో కనీసం ఫోన్ చేసి, మన్సూర్ అలీ ఖాన్ ఏం అయ్యింది? ఇలా ఎందుకు అన్నావ్? అని అడగలేదు. పెద్ద నటుడు ఇలా చేయడం నాకు బాధ అనిపించింది’’ చిరంజీవి లాంటి పెద్ద నటుడు ఏం జరిగిందో తెలుసుకోకుండా అడ్డగోలుగా వ్యాఖ్యానించడం బాధ కలిగించిందన్నారు. ఆయన తనకు ఫోన్ చేసి “మన్సూర్.. ఏం జరిగిందో చెప్పు” అని అడిగి తెలుసుకుని ఉంటే బాగుండేదన్నారు. ఏం తెలుసుకోకుండా విమర్శించడం ఆవేదన కలిగించిందన్నారు. 





త్రిష, చిరంజీవి, ఖుష్బూ మీద పరువు నష్టం దావా


అటు అభ్యంతరకర వ్యాఖ్యల వివాదానికి ఫుల్ స్టాప్ పడిందని భావిస్తున్న నేపథ్యంలో మన్సూర్ అలీ ఖాన్ మరో కొత్త వివాదానికి తెర తీశారు. చిరంజీవిపై రూ. 20 కోట్లు, త్రిష, ఖుష్బూపై రూ. 10 కోట్ల చొప్పున పరువు నష్టం దావా వేస్తానని వెల్లడించారు. త్రిషతో పాటు చిరంజీవి, ఖుష్బూ మీద కేసు నమోదు చేయనున్నట్లు ప్రకటించారు. పది రోజుల పాటు ప్రజలతో పాటు తన శాంతికి విఘాతం కలిగించారని, వ్యభిచారానికి ప్రేరేపిస్తూ అల్లర్లు సృష్టించాలని ప్లాన్ చేశారని ఆయన ఆరోపించారు. సదరు వ్యక్తులపై క్రిమినల్, సివిల్ దావా వేస్తామన్నారు. తాను మీడియా సమావేశంలో మాట్లాడింది ఒకటి అయితే, ఎడిట్ చేసి త్రిష గురించి తాను తప్పుగా మాట్లాడినట్లు అసభ్యంగా చిత్రీకరించారని మన్సూర్ ఆరోపించారు. పూర్తి ఆధారాలతో కేసు వేయనున్నట్లు మన్సూర్ అలీ ఖాన్ తెలిపారు. పరువు నష్టం కేసుల ద్వారా వచ్చిన డబ్బును తమిళనాడులో మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబాలకు విరాళంగా ఇస్తానని చెప్పారు. ఆయన నిర్ణయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. సర్దుమణిగిన వివాదాన్ని మళ్లీ రెచ్చగొట్టడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. 






Read Also: మాజీ ప్రధాని ఇందిరా గాంధీని కలిసిన కంగనా, అదెలా సాధ్యమని షాక్ అవుతున్నారా?


ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply