Nani, Shruti Haasan Set Dance Floor On Fire In The Party Anthem Odiyamma From Hi Nanna movie: నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన తాజా చిత్రం 'హాయ్ నాన్న'. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్, కమల్ హాసన్ ముద్దుల కుమార్తె శృతి హాసన్ ఓ స్పెషల్ సాంగ్ చేశారు. ఆల్రెడీ విడుదలైన ట్రైలర్ చూస్తే... అందులో ఆమె తళుక్కున మెరిశారు. అప్పుడు ప్రత్యేక గీతం, కొన్ని సీన్లు చేశారని అర్థమైంది. అంతకు ముందు సినిమాలో ఆమె నటించిన సంగతి బయటకు వచ్చింది. ఈ రోజు ఆ లిరికల్ వీడియో విడుదల చేశారు.
నానితో ఆట... తమిళ హీరోతో పాట!
ఇప్పటి వరకు నాని, శృతి హాసన్ కలిసి నటించలేదు. వాళ్ళిద్దరూ కలిసి చేసిన తొలి గీతమిది. అదొక స్పెషల్ అయితే... ఈ పాటను శృతి హాసన్ స్వయంగా పాడటం మరో స్పెషల్! పాటలో వినిపించే గొంతు శృతి హాసన్ అండ్ చిన్మయి శ్రీపాదది. ఈ సాంగ్ మరో స్పెషాలిటీ ఏమిటంటే... మేల్ లిరిక్స్ యువ తమిళ హీరో, చియాన్ విక్రమ్ కుమారుడు ధృవ్ పాడారు.
'ఒడియమ్మా బీటు... ఈడీఎంలో బీటు...' అంటూ సాగే ఈ గీతాన్ని అనంత శ్రీరామ్ రాశారు. హేషామ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు. డిసెంబర్ 7న ఈ సినిమా విడుదల కానున్న సంగతి తెలిసిందే.
Also Read: రెండో పెళ్లికి హీరో కుమార్తె రెడీ - దర్శకుడితో ఐశ్వర్య ప్రేమ!
'హాయ్ నాన్న' సినిమాతో శౌర్యువ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించారు. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం1గా తెరకెక్కిన చిత్రమిది. చెరుకూరి వెంకట మోహన్ (సీవీయమ్), డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, మూర్తి కెఎస్ సంయుక్తంగా నిర్మించారు.
Also Read: యానిమల్ వయలెన్స్... సలార్ యాక్షన్... డిసెంబర్‌లో ధూమ్ ధామ్ థియేటర్లలోకి భారీ అండ్ క్రేజీ సినిమాలు
'హాయ్ నాన్న'... నానికి పాతిక కోట్లు?
'హాయ్ నాన్న' డిస్ట్రిబ్యూషన్, బిజినెస్ డీల్స్ విషయాల్లో హీరో నాని కూడా ఇన్వాల్వ్ అయ్యారని టాలీవుడ్ టాక్. దీని వెనుక ఆయన రెమ్యూనరేషన్ ప్రధాన కారణమని వినబడుతుంది. ఈ సినిమాకు ఆయన 25 కోట్ల రూపాయల పారితోషకం ఇచ్చేలా నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారట. డిసెంబర్ తొలి వారంలో ఈ సినిమాతో పాటు మూడు నాలుగు సినిమాలు వస్తున్నాయి. థియేటర్లలో భారీ పోటీ నెలకొనడంతో ఎక్కువ రేట్లు పెట్టి డిస్ట్రిబ్యూషన్ రైట్స్ తీసుకోవడానికి బయ్యర్లు ఎవరు ముందుకు రావడం లేదట. దాంతో నాని రంగంలోకి దిగుతున్నారని ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి.
ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆 *T&C Apply
బేబీ కియారా ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రానికి హేషామ్ అబ్దుల్ వాహెబ్ సంగీతం అందించారు. సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహకుడు. నానితో ఆయనకు మూడో చిత్రమిది. 'జెర్సీ', 'శ్యామ్ సింగ రాయ్' చిత్రాలకూ ఆయన పని చేశారు. ఆ రెండు చిత్రాల్లో సినిమాటోగ్రఫీ వర్క్ బావుందని పేరు వచ్చింది. ఆల్రెడీ విడుదలైన ప్రచార చిత్రాలు, పాటల్లో కూడా సాను జాన్ వర్గీస్ ఛాయాగ్రహణం బావుంది. ఈ చిత్రానికి కూర్పు : ప్రవీణ్ ఆంథోని, ప్రొడక్షన్ డిజైనర్ : అవినాష్ కొల్లా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : సతీష్ ఈవీవీ.