పెళ్లి పీటలు ఎక్కబోతున్న మిల్కీ బ్యూటీ, బాయ్ ఫ్రెండ్ తో ఎంగేజ్మెంట్ ఎప్పుడంటే?


దక్షిణాది సినిమా పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. స్టార్ హీరోల సరసన పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. గత కొంతకాలంగా అమ్మడు ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నటుడు విజయ్ వర్మతో లవ్ లో మునిగి తేలుతోంది. బాలీవుడ్‌లో మంచి న‌టుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజ‌య్ వ‌ర్మ తెలుగులోనూ ప‌లు సినిమాలు చేశారు. నానీ హీరోగా నటించిన ‘MCA’ చిత్రంలో విల‌న్ పాత్ర‌లో విజ‌య్ దుమ్మురేపాడు. వీరిద్దరు  రీసెంట్ గా తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ కన్ఫామ్ చేశారు. అయితే, పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకోబోమని చెప్పారు. కొంతకాలం తర్వాత పెళ్లి ఎప్పుడనే విషయం గురించి ఆలోచిస్తామని వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


రష్మిక ఫేక్‌ వీడియో కేసు విచారణ ముమ్మరం, పోలీసుల అదుపులో బిహార్ యువకుడు


స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న డీప్ ఫేక్ వీడియో కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఈ వీడియో వెలుగులోకి రావడంతో సినీ ఇండస్ట్రీ ఆశ్చర్యపోయింది. ఇలాంటి  ఫేక్ వీడియోలను రూపొందించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. దర్యాప్తు కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. తాజాగా ఈ కేసులో ఖాకీలు కీలక పురోగతి సాధించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


రణబీర్ నోట బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్ - దద్దరిల్లిన 'అన్ స్టాపబుల్' స్టేజ్!


నటసింహం నందమూరి బాలకృష్ణ పవర్ ఫుల్ డైలాగ్ ని మరో స్టార్ హీరో చెబితే ఎలా ఉంటుంది? అది కూడా బాలీవుడ్ హీరో చెప్తే ఎలా ఉంటుంది? ఊహించుకుంటేనే క్రేజీగా ఉంది కదూ! ఈ అరుదైన మూమెంట్ తాజాగా 'అన్ స్టాపబుల్'(Unstoppable) షోలో బాలయ్య ముందే జరగడం విశేషం. వివరాల్లోకి వెళ్తే.. నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న 'అన్ స్టాపబుల్' షో కి ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే రెండు సీజన్స్ విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ షో మూడో సీజన్ రీసెంట్ గానే మొదలైంది. ఈసారి లిమిటెడ్ ఎడిషన్ పేరుతో ఆహా ఓటీటీ(Aha OTT)లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపుతున్న‘టైగర్‌ 3’, మూడు రోజుల్లో వసూళ్ల సునామీ - ఎంత వచ్చిందంటే?


బాలీవుడ్ కండల వీరుడు చాలా రోజుల తర్వాత బాక్సాఫీస్ దగ్గర దుమ్మురేపుతున్నారు. ఆయన తాజా చిత్రం ‘టైగర్ 3‘ వసూళ్ల వర్షం కురిపిస్తోంది. కత్రినా కైఫ్ హీరోయిన్ గా మనీష్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా, దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రేక్షకుల ముందుకు  వచ్చింది. తొలుత కాస్త నెగెటివ్ టాక్ తెచ్చుకున్నా, ఆ తర్వాత పుంజుకుంది. థియేటర్లకు ఆడియెన్స్ తాడికి పెరిగింది. నెమ్మదిగా ఈ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)