Tamannaah Bhatia- Vijay Varma Wedding: దక్షిణాది సినిమా పరిశ్రమతో పాటు బాలీవుడ్ లోనూ హీరోయిన్ గా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది మిల్కీ బ్యూటీ తమన్నా. స్టార్ హీరోల సరసన పలు బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పింది. అందం, అభినయంతో ప్రేక్షకులను అలరించింది. గత కొంతకాలంగా అమ్మడు ప్రేమాయణం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. నటుడు విజయ్ వర్మతో లవ్ లో మునిగి తేలుతోంది. బాలీవుడ్‌లో మంచి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ వర్మ తెలుగులోనూ పలు సినిమాలు చేశారు. నానీ హీరోగా నటించిన ‘MCA’ చిత్రంలో విలన్ పాత్రలో విజయ్ దుమ్మురేపాడు. వీరిద్దరు రీసెంట్ గా తమ ప్రేమ విషయాన్ని ఇద్దరూ కన్ఫామ్ చేశారు. అయితే, పెళ్లి మాత్రం ఇప్పట్లో చేసుకోబోమని చెప్పారు. కొంతకాలం తర్వాత పెళ్లి ఎప్పుడనే విషయం గురించి ఆలోచిస్తామని వెల్లడించారు.
జనవరిలో నిశ్చితార్థం, ఫిబ్రవరిలో పెళ్లి?
కానీ, ఇప్పుడు పరిస్థితులు మారిన్నట్లు తెలుస్తోంది. ఇప్పట్లో పెళ్లి చేసుకోమని చెప్పినా, తమన్నా పెళ్లికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. గత రెండు రోజులుగా వీరి పెళ్లి వార్తలు సోషల్ మీడియాలో బాగా ప్రచారం అవుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ప్రేమ పక్షలు మూడు ముళ్ల బంధంతో సంసార జీవితంలోకి అడుగు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
కుటుంబ సభ్యుల ఒత్తిడితో పెళ్లి చేసుకోవాలని నిర్ణయం
వాస్తవానికి తమన్నా, విజయ్ వర్మ ఇప్పట్లో పెళ్లి చేసుకోకూడదని భావించారు. కానీ, ఇరు కుటుంబ సభ్యుల నుంచి వీరి పెళ్లి గురించి ఒత్తిడి బాగా వస్తోంది. తమన్నావయసు ఇప్పుడు 33 ఏండ్లు కాగా, విజయ్ వర్మకు 37 ఏండ్లు. వయసు దాటిపోతోందని పెద్దలు ఒకటే గోల చేస్తున్నారట. ఈ నేపథ్యంలోనే ఇద్దరు పెళ్లికి ఒప్పుకున్నారట. ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో లేదంటే జనవరిలో వీరి నిశ్చితార్థం ఉంటుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేయనున్నట్లు సమాచారం. అయితే, ఈ పెళ్లి వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఇటు తమన్నా కానీ, అటు విజయ్ వర్మ కానీ, ఎలాంటి ప్రకటన ఇవ్వలేదు. త్వరలోనే ఈ విషయంపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
రీసెంట్ గా తమన్నా, విజయ్ వర్మ కలిసి ‘లస్ట్ స్టోరీస్ 2’లో నటించారు. 2018లో విడుదలై, మంచి ప్రేక్షకాదరణ పొందిన ‘లస్ట్ స్టోరీస్’ వెబ్ స్టోరీకి కొనసాగింపుగా ‘లస్ట్ స్టోరీస్ 2’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘లస్ట్ స్టోరీస్ సీజన్ 2’లో నాలుగు కథల్ని చూపించారు. వీటిలో ఒక్కో కథకు ఒక్కొక్కరు దర్శకత్వం వహించారు. తమన్నా, విజయ్ వర్మ సెగ్మెంట్ కు సుజోయ్ ఘోష్ దర్శకత్వం వహించారు. ఇందులో తమన్నా, విజయ వర్మ హాట్ సీన్లలో మరింత ఘాటుగా నటించారు.
Read Also: ఫ్యాన్స్‌తో సాయిధరమ్ తేజ్ చిట్ చాట్, నెటిజన్ ప్రశ్నకు సమాధానం చెప్పలేక!