కృష్ణ కోసం సూపర్ లుక్కు - మహేష్ బాబు మాస్ మామ!


మాస్... మమ మాస్... ఇది సూపర్ మాస్! సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా నుంచి తాజాగా కొత్త స్టిల్ విడుదల చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ రోజు టైటిల్ ప్రకటించడంతో పాటు వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్న సందర్భంగా ఈ కొత్త స్టిల్ వచ్చింది అన్నమాట! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


 ‘ప్రాజెక్ట్ K’ మూవీలో విలన్‌గా కమల్ హాసన్? భారీ రెమ్యునరేషన్ ఆఫర్?


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ ‘ప్రాజెక్ట్ K’. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే హీరోయిన్ గా నటిస్తోంది. లెజెండరీ యాక్టర్  బిగ్ బీ అమితాబ్ బచ్చన్, అందాల భామ దిశా పటాని కీలక పాత్రలు పోషిస్తున్నారు. వైజయంతీ మూవీస్ పతాకంపై అశ్వినీ దత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్  అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాలలో ఒకటిగా నిలిచింది. రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఫ్రెండ్స్ కోసం ప్రభాస్ కీలక నిర్ణయం - యూవీ క్రియేషన్స్‌‌కు నష్టాల నుంచి ఊరట


తెలుగు సినిమా అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన UV క్రియేషన్స్‌ ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరో ప్రభాస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. 'సాహో', 'రాధే శ్యామ్‌' సినిమాలు యూవీ క్రియేషన్స్‌కు పెద్ద నష్టమే మిగిల్చాయని సమాచారం. ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లను రాబట్టకపోవడంతో నిర్మాతలు ఇబ్బందుల్లో పడ్డారు. ఈ క్రమంలో రెబల్ స్టార్ ప్రభాస్.. తన ఫ్రెండ్స్ బ్యానర్‌ను గట్టెక్కించేందుకు డీల్ సెట్ చేసినట్లు తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఇకపై ఓటీటీలోనూ ఆ యాడ్స్ ఉండాల్సిందే - కేంద్రం కీలక నిర్ణయం


కరోనా లాక్ డౌన్ అనంతరం దేశంలో ఓటీటీల ప్రభావం బాగా పెరిగింది. వీటి వినియోగం కూడా రోజు రోజుకు మరింత విస్తృతం అవుతోంది. చాలా మంది సినిమాలు, వెబ్ సిరీస్ లు సహా పలు షోలను చూసేందుకు  OTT ప్లాట్‌ఫారమ్‌లనే ఆశ్రయిస్తున్నారు. కొత్త సినిమాలు సైతం మూడ, నాలుగు వారాల తర్వాత ఓటీటీలోకి విడుదల చేయడంతో సినీ లవర్స్ కూడా ఓటీటీలనే వినియోగిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


సమంత గౌను రేటు వింటే మతులు పోతాయ్ - సామ్ చాలా కాస్ట్లీ గురూ!


'పుష్ప' సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'తగ్గేదే లే' అంటూ చెప్పిన డైలాగ్, ఆ మ్యానరిజమ్ ఎంతో పాపులర్ అయ్యింది. స్టార్ హీరోయిన్, తన నటనతో పాన్ ఇండియా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన సమంత నిజ జీవితంలో చేసే ఖర్చు చూస్తే ఆ మాట అనాలేమో!? ఖర్చు విషయంలో ఆమె ఎక్కడా తగ్గడం లేదు. కాస్ట్లీ చెప్పులు, గౌనులు ధరిస్తూ 'ఔరా' అంటూ ప్రేక్షకులు నోరెళ్ళ బెట్టేలా చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)