మాస్... మమ మాస్... ఇది సూపర్ మాస్! సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram) దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. ఆ సినిమా నుంచి తాజాగా కొత్త స్టిల్ విడుదల చేశారు. ఆల్రెడీ ఫస్ట్ లుక్ వచ్చింది. ఈ రోజు టైటిల్ ప్రకటించడంతో పాటు వీడియో గ్లింప్స్ విడుదల చేయనున్న సందర్భంగా ఈ కొత్త స్టిల్ వచ్చింది అన్నమాట!


నాన్నా... ఇది మీ కోసం!
''ఈ రోజు మరింత ప్రత్యేకం! నాన్నా... ఇది మీ కోసం'' అంటూ మహేష్ బాబు ఈ స్టిల్ ట్వీట్ చేశారు. గుంటూరు మిర్చి యార్డ్ నేపథ్యంలో సినిమా కోసం ఒక ఫైట్ తీశారని తెలిసింది. ఆ ఫైట్ సీన్ స్టిల్ కింద అర్థం అవుతోంది. మహేష్ బాబు లుక్ హైలైట్ అవుతుండగా... ఆయన వెనుక బ్యాక్ గ్రౌండ్ లో కొంత మంది రౌడీలను కూడా చూడొచ్చు. సాయంత్రం టైటిల్ రివీల్ చేయడంతో పాటు విడుదల చేసే గ్లింప్స్‌లో ఆ ఫైట్ తీసిన విజువల్స్ చూపించే అవకాశం ఉంది. 






'మాస్ స్ట్రైక్' మామూలుగా ఉండదు!
ఈ రోజు (మే 31) మహేష్ బాబు తండ్రి, దివంగత సూపర్ స్టార్ కృష్ణ జయంతి (Krishna Jayanthi 2023). తండ్రి జన్మదినం సందర్భంగా ప్రతి ఏడాది తన సినిమాకు సంబంధించిన ఒక కొత్త కబురు చెప్పడం మహేష్ బాబుకు అలవాటు. ఈ ఏడాది త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటిస్తున్న తాజా సినిమా వీడియో గ్లింప్స్ విడుదల చేస్తున్నారు. 


కృష్ణ జయంతి సందర్భంగా 'మోసగాళ్ళకు మోసగాడు' చిత్రాన్ని 4K ఫార్మెటులో రీ రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా ప్రదర్శించనున్న అన్ని థియేటర్లలో ఈ వీడియో గ్లింప్స్ విడుదల కానుంది. అభిమానులే అతిథులుగా, వాళ్ళ సమక్షంలో విడుదల చేస్తున్నారన్నమాట. 
 
'గుంటూరు కారం' ఘాటు చూపించనున్న మహేష్!?
మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో 'అతడు', 'ఖలేజా' తర్వాత రూపొందుతున్న చిత్రమిది. దీనికి ముందుగా 'అమరావతికి అటు ఇటు' టైటిల్ పరిశీలనలో ఉందని వినిపించింది. మధ్యలో 'ఊరికి మొనగాడు' టైటిల్ కూడా రేసులోకి వచ్చింది. ఆ  రెండూ కాదని 'గుంటూరు కారం'కు హీరో, దర్శకుడు ఓటు వేశారు. 


సాధారణంగా 'అ' అక్షరంతో మొదలయ్యే పేర్లకు కొన్నాళ్లుగా త్రివిక్రమ్ ప్రాముఖ్యం ఇస్తూ వస్తున్నారు. అది ఆయన సెంటిమెంట్. మరి, ఈసారి ఆ సెంటిమెంట్ పక్కన పెట్టినట్టే!


Also Read : తక్కువ అంచనా వేయకండి - 'బడ్డీ'తో బాక్సాఫీస్‌కు గురి పెట్టిన అల్లు శిరీష్!


మహేష్ బాబు సరసన పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా నటిస్తున్న చిత్రమిది.  ఇందులో జగపతి బాబు సైతం కీలక పాత్ర చేస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకం మీద సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న విడుదల కానుంది. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి పీఎస్ వినోద్ సినిమాటోగ్రాఫర్. నవీన్ నూలి ఎడిటర్ కాగా... ఎఎస్ ప్రకాష్ కళా దర్శకత్వం వహిస్తున్నారు.


Also Read ప్రభాస్ కంటే శ్రీ రాముని పాత్రకు ఆ హిందీ హీరోలు బెటరా?