టాలీవుడ్ హీరో నుంచి హన్సికకు వేదింపులంటూ వార్తలు - మీడియాపై ఆపిల్ బ్యూటీ ఆగ్రహం


అందాల తార హన్సిక గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. బాల నటిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి, తక్కువ సమయంలోనే హీరోయిన్ గా ఎదిగింది.  అందం, అభినయంతో సౌత్ లో టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించింది. కొద్ది నెలల క్రితమే తన బాల్య స్నేహితుడు, వ్యాపారవేత్త అయిన సోహైల్ ఖతురియాను పెళ్లి చేసుకుంది. జైపూర్ వేదిగా అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు పలువురు సినీ, వ్యాపార ప్రముఖులు హాజరయ్యారు. ప్రస్తుతం తన వైవాహిక జీవితాన్ని చాలా సంతోషంగా గడుపుతున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


డైరెక్టుగా ఓటీటీలోకి వచ్చేస్తోన్న విశ్వక్ సేన్, రకుల్ సినిమా - 'బూ' టీజర్ రిలీజ్!


ఇటీవల 'దాస్ కా ధమ్కీ' సినిమాతో పలకరించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ యంగ్ హీరో 'బూ' అనే మూవీలో నటిస్తున్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం, చాలా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటి వరకూ మేకర్స్ ఈ మూవీ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేయలేదు.. పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఇలాంటి సినిమా ఒకటుందని జనాలకు తెలియలేదు. అయితే ఇప్పుడు సడన్ గా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుందనే ప్రకటనతో ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


గీతాలో వచ్చే ఏడాది అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా - 'పుష్ప 2' తర్వాత సినిమా ఫిక్స్!


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నారు? అంటే... లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' చేస్తున్నారు. మరి, ఆ తర్వాత? ఎవరితో సినిమా ఉంటుంది? అంటే... మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో! అవును... బన్నీ & గురూజీ కలిసి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు! (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


రాజమండ్రి రైల్వే బ్రిడ్జ్‌పై లైవ్‌లో రైలు దోపిడీ - గ్రాండ్‌గా ‘టైగర్ నాగేశ్వరరావు’ ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్!


మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది. ఇప్పటికే  ఈ మూవీ విడుదలకు సంబంధించి డేట్ తో స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాతో రవితేజ పాన్ ఇండియన్ స్టార్ గా మారబోతున్నారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ విడుదల అయ్యింది.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


పదేళ్లు మాటల్లేవు, ఆ మూవీలోనే ప్రేమ పుట్టింది - తమ లవ్ స్టోరీ చెప్పిన నరేష్, పవిత్ర


ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు నరేష్ - పవిత్ర లోకేష్. ఇప్పుడు ఎక్కడ చూసినా వీరి గురించే చర్చ జరుగుతోంది. త్వరలో ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారట. వీరు తాజాగా 'మళ్లీ పెళ్లి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈనెల 26న విడుదలవుతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో తమ లవ్ స్టోరీ బయట పెట్టారు నరేష్. తాజా ఇంటర్వ్యూలో నరేష్ మాట్లాడుతూ.. "ఎప్పుడో 'ఆలయం' సినిమా సమయంలో మొదటిసారి కలుసుకున్నాం. అప్పుడు పవిత్ర నాతో మాట్లాడలేదు. దాంతో ఈ అమ్మాయికి పొగరేమో అని నేను ముందు లైట్ తీసుకున్నా. మళ్లీ ఆ తర్వాత 10 ఏళ్లకు 'హ్యాపీవెడ్డింగ్' షూటింగ్ సమయంలో కలుసుకున్నాం. ఆ టైంలో నాతో గలగలా మాట్లాడుతూనే ఉంది. షూటింగ్ జరుగుతుండగానే నా గురించి చాలా విషయాలు తెలుసుకుంది. అప్పుడు నేను షాక్ అయ్యా. ఆ టైంలోనే ఈ అమ్మాయి బాగుంది, అందంగా ఉందనిపించి ఓ పాజిటివ్ ఎనర్జీ కలిగింది. ఇక షూటింగ్ అయిపోయాక మళ్ళీ నాతో మాట్లాడలేదు’’ అని తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)