ఇటీవల 'దాస్ కా ధమ్కీ' సినిమాతో పలకరించిన మాస్ కా దాస్ విశ్వక్ సేన్.. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే ఈ యంగ్ హీరో 'బూ' అనే మూవీలో నటిస్తున్న విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ఎందుకంటే అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం, చాలా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంది. ఇప్పటి వరకూ మేకర్స్ ఈ మూవీ నుంచి ఎలాంటి ప్రమోషనల్ కంటెంట్ ను రిలీజ్ చేయలేదు.. పబ్లిసిటీ చేయలేదు. అందుకే ఇలాంటి సినిమా ఒకటుందని జనాలకు తెలియలేదు. అయితే ఇప్పుడు సడన్ గా డైరెక్ట్ ఓటీటీలో రిలీజ్ కాబోతుందనే ప్రకటనతో ఈ చిత్రం వార్తల్లో నిలిచింది. 


'బూ' అనేది తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కిన బైలింగ్విల్ హారర్ థ్రిల్లర్ మూవీ. తమిళ్ డైరెక్టర్ విజయ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇందులో విశ్వక్ సేన్ తో పాటుగా, రకుల్ ప్రీత్ సింగ్, నివేదా పేతురాజ్, మేఘా ఆకాశ్, మంజిమా మోహన్, రెబా మోనికా జాన్ వంటి పాపులర్ హీరోయిన్లు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. కానీ అనివార్య కారణాల వల్ల రిలీజ్ ఆలస్యమవుతూ వచ్చింది. అయితే ఎట్టకేలకు ఇప్పుడు విడుదలకు సిద్ధం అయింది. కాకపోతే థియేటర్లలో కాకుండా నేరుగా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ కాబోతోంది. 


జియో సినిమా ఓటీటీలో 'బూ' మూవీ రిలీజ్ కానున్నట్లు జియో స్టూడియోస్ వారు అధికారికంగా ప్రకటించారు. మే 27వ తేదీన తెలుగు తమిళ భాషల్లో ఫ్రీగా స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలిపారు. ''ఈసారి మీకు ఎక్కిళ్లు వస్తే నీళ్ల కోసం చూడకండి.. ఒకసారి చుట్టూ చూడండి.. మీ పరిసరాల్లో దెయ్యం ఉండే ఛాన్స్ ఉంది'' అని ట్వీట్ చేసారు. ఈ సందర్భంగా మేకర్స్ టీజర్ ను సోషల్ మీడియాలో విడుదల చేసారు. 






దెయ్యాల కథలు ఉండే హాలోవీన్స్ బుక్ గురించి రకుల్ ప్రీత్ సింగ్ వివరించడంతో 'బూ' టీజర్ ప్రారంభం అవుతుంది. సినిమా అంతా ఒక హాంటెడ్ హౌస్ లో నైట్ సమయాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. నివేదా పేతురాజ్ ఓ ఇంటికి వెళ్లగా, 'నీకు ఎక్కిళ్ళు వస్తాయా?' అని ఓ పెద్దావిడ అడగడంతో అసలు కథ మొదలవుతుంది. ఆ ఇంట్లో అనుకోని సంఘటనలు చోటు చేసుకోవడంతో.. రకుల్, నివేదా, మేఘా ఆకాశ్, మంజిమాలను అక్కడ ఎవరో తరుముతున్నట్లు భయాందోళనలకు గురవుతుండటం వంటి సన్నివేశాలతో టీజర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. చివర్లో 'జస్ట్ చిల్, యాడ్ థ్రిల్' అంటూ రకుల్ ట్విస్ట్ ఇచ్చింది. ,


Also Read : పవన్ - సాయి తేజ్ - ఇంతకీ ఇద్దరిలో దేవుడెవరు 'బ్రో'?


భూ టీజర్ లో విశ్వక్ సేన్ కు పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు కానీ, స్టోరీలో అతనిది కూడా కీలక పాత్ర అని హింట్ ఇచ్చారు. 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్, విద్యు రామన్ భయపడుతూ నవ్వించే పాత్రలు పోషించారు. జీవీ ప్రకాశ్ కుమార్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా నేపథ్యానికి తగ్గట్టుగా ఉంది. దర్శకుడు విజయ్ ఈ చిత్రాన్ని సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ లా తీర్చిదిద్దారని టీజర్ ని బట్టి తెలుస్తోంది. 


జీ స్టూడియోస్ సమర్పణలో శర్వంత్ రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్ బ్యానర్స్ మీద జ్యోతి దేశ్ పాండే ఈ హారర్ కామెడీ థ్రిల్లర్ ను నిర్మించారు. జవ్వాజి రామాంజనేయులు, యం. రాజశేఖర్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరించారు. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసిన 'బూ' సినిమా.. జీ సినిమా ఓటీటీలో ఫ్రీగా అందుబాటులోకి రానుందని మేకర్స్ తెలిపారు. మరి డైరెక్ట్ డిజిటల్ వేదికలోకి రాబోతున్న ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి. 


Read Also: ఇంటిమేట్ సీన్స్ తో సమంత షాక్ ఇవ్వబోతోందా..?