ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) ఇప్పుడు ఏ సినిమా చేస్తున్నారు? అంటే... లెక్కల మాస్టారు సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప 2' చేస్తున్నారు. మరి, ఆ తర్వాత? ఎవరితో సినిమా ఉంటుంది? అంటే... మాటల మాంత్రికుడు, గురూజీ త్రివిక్రమ్ శ్రీనివాస్ (Trivikram Srinivas) దర్శకత్వంలో! అవును... బన్నీ & గురూజీ కలిసి పాన్ ఇండియా సినిమా చేయబోతున్నారు!


గీతాలో అల్లు అర్జున్ - త్రివిక్రమ్ సినిమా!
అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్ సూపర్ హిట్ కాంబినేషన్! తొలుత వాళ్ళిద్దరూ కలిసి 'జులాయి' చేశారు. ఆ సినిమా ప్రేక్షకులతో పాటు అల్లు అభిమానులను అమితంగా అలరించింది. ఆ తర్వాత చేసిన 'అల వైకుంఠపురములో' సినిమా అయితే ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేసింది. 'అల...' విడుదలైన తర్వాత అల్లు అర్జున్, త్రివిక్రమ్ మరో సినిమా చేస్తామని తెలిపారు. లేటెస్ట్ అప్డేట్ ఏమిటి అంటే... ఆ సినిమా కన్ఫర్మ్ అయ్యింది. 


'అల వైకుంఠపురములో' సినిమాను అల్లు అర్జున్ తండ్రి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్, సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు)కు చెందిన హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మించాయి. మళ్ళీ ఆ రెండూ కలిసి కొత్త సినిమాను నిర్మించనున్నాయని తెలిసింది. 


'2018' సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న సందర్భంగా మీడియాతో మాట్లాడిన 'బన్నీ' వాసు, వచ్చే ఏడాది గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థలు అల్లు అర్జున్ హీరోగా ఓ సినిమా ఉంటుందని చెప్పారు. ఆ సినిమా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా... పూజా హెగ్డే, శ్రీ లీల కథానాయికలుగా త్రివిక్రమ్ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆ సినిమా విడుదల కానుంది. ఆ తర్వాత అల్లు అర్జున్ కథపై త్రివిక్రమ్ వర్క్ చేయడం స్టార్ట్ చేస్తారని సమాచారం.


Also Read : అమెరికాలో 'ఆదిపురుష్' టికెట్ సేల్స్ షురూ - రేటు ఎంతంటే?


హిందీ దర్శకులు సైతం అల్లు అర్జున్ కథానాయకుడిగా సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. 'ఇమ్మోర్టల్ అశ్వథ్థామ'లో హీరోగా నటించమని ఆయన్ను సంప్రదించారు. అయితే, అల్లు అర్జున్ ఇంకా ఏ విషయం చెప్పలేదు. ఆ సినిమా ఓకే చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 'పుష్ప 2' తర్వాత అల్లు అర్జున్ స్పీడ్ పెంచాలని అనుకుంటున్నారట.    


పాన్ ఇండియా మార్కెట్టే టార్గెట్!
'అల వైకుంఠపురములో' సినిమాను హిందీలో 'షెహజాదే' పేరుతో రీమేక్ చేశారు. కార్తీక్ ఆర్యన్, కృతి సనన్ జంటగా నటించిన ఆ సినిమా ఫ్లాప్ అయ్యింది. అయితే, తెలుగు సినిమా చూసిన కొందరు... హిందీలో ఆ ఫీల్ లేదని కామెంట్స్ చేశారు. పైగా, 'పుష్ప' సినిమాతో హిందీలో అల్లు అర్జున్ మార్కెట్ పెరిగింది. అందుకని, త్రివిక్రమ్ దర్శకత్వంలో చేయబోయే సినిమాను పాన్ ఇండియా మార్కెట్టును టార్గెట్ చేస్తూ చేయాలని డిసైడ్ అయ్యారట. అందుకీ తగ్గట్టుగా గురూజీ మంచి పాయింట్ రెడీ చేశారని, స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేయడమే ఆలస్యమని గీతా ఆర్ట్స్ వర్గాల నుంచి అందుతున్న సమాచారం. 
 
Also Read కన్నడ దర్శకుడితో బాలకృష్ణ, రజనీకాంత్ పాన్ ఇండియా మల్టీస్టారర్!?