ఏపీ ఈఏపీసెట్-2023 అగ్రికల్చర్‌ & మెడికల్‌ స్ట్రీమ్ ఆన్‌లైన్‌ పరీక్షల ప్రాథమిక కీని ఉన్నత విద్యామండలి మే 24న విడుదల చేసింది. ఆన్సర్ కీతోపాటు విద్యార్థుల రెస్పాన్స్‌ షీట్లను కూడా విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఆన్సర్ కీ, రెస్పాన్స్ షీట్లను అందుబాటులో ఉంచారు. పరీక్షలకు హాజరైన విద్యార్థులు వెబ్‌సైట్ ద్వారా తమ సమాధానాలు చెక్ చేసుకోవచ్చు.


పరీక్షకు హాజరైన విద్యార్థులు తమ సమాధాన పత్రాలు పొందడానికి ఎంసెట్ హాల్‌టికెట్ నెంబరు, రిజిస్ట్రేషన్ నెంబరు వివరాలు నమోదుచేసి పొందవచ్చు. ఒకవేళ ఆన్సర్ కీపై ఏమైనా అభ్యంతరాలుంటే మే 26న ఉదయం 9 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంది. 


ఏపీలో మే 15 నుంచి 23 వరకు జరిగిన ఏపీ ఈఏపీసెట్ పరీక్షలకు 93.38 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,24,724 మంది, ఫార్మసీ, అగ్రికల్చర్ విభాగాల్లో 90,573 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు.


Agriculture & Pharmacy Question Paper With Preliminary Keys..


22 May 2023 Forenoon


22 May 2023 Afternoon


23 May 2023 Forenoon


23 May 2023 Afternoon


Website


Student Response Sheet for AP EAPCET - 2023 


ఆన్సర్ కీ అభ్యంతరాల ప్రక్రియ ప్రారంభం..
ఆంధ్రప్రదేశ్‌లో ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల ప్రవేశాలకు నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ ప్రాథమిక ఆన్సర్ కీలను ఉన్నత విద్యామండలి విడుదల చేసింది. మే 23న రాత్రి ఇంజినీరింగ్ ఆన్సర్ కీ, మే 24న ఉదయం అగ్రికల్చర్-ఫార్మసీ విభాగాల ఆన్సర్ కీలను విడుదల చేశారు. అధికారిక వెబ్‌సైట్‌లో పరీక్షల తేదీలవారీగా మాస్టర్ క్వశ్చన్ పేపర్లను, ఆన్సర్ కీని అందుబాటులో ఉంచారు. ఆన్సర్ కీతోపాటు అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లను కూడా విడుదల చేశారు. ఆన్సర్ కీపై అభ్యంతరాలకు అవకాశం కల్పించారు. ఇందుకు సంబంధించిన నమోదు ప్రక్రియ ప్రారంభమైంది. అభ్యర్థులు మే 26 ఉదయం 9 గంటల వరకు అభ్యంతరాలు తెలిపేందుకు అవకాశం ఉంది. 


AP EAPCET - 2023 KEY OBJECTIONS


Also Read: ఈఏపీసెట్‌ ఇంజినీరింగ్‌ విభాగం కీ విడుదల, అభ్యంతరాలకు 26 వరకు అవకాశం!


Also Read:


ఏపీ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
ఆంధ్రప్రదేశ్‌లోని ఎంసీఏ, ఎంబీఏ కోర్సు‌ల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీఐసెట్-2023 పరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. ఐసెట్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, డిగ్రీ హాల్‌టికెట్ నెంబరు, పుట్టినతేది వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 24, 25 తేదీల్లో ఏపీ ఐసెట్-2023 ప్రవేశపరీక్ష నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి 11.30 వరకు మొదటి సెషన్‌లో, మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్‌లో పరీక్ష నిర్వహించనున్నారు. ఏపీఐసెట్‌లో ర్యాంకు ద్వారా 2023 విద్యా సంవత్సరానికి ఏపీలోని విశ్వవిద్యాలయాలు, అనుబంధ కళాశాలల్లో ఫుల్‌టైం ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ ఏడాది శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం ఐసెట్ పరీక్షల బాధ్యత నిర్వహిస్తోంది.
ఐసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి.. 


తెలంగాణ ఐసెట్‌-2023 హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష తేదీలివే!
తెలంగాణలోని ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్‌ ఐసెట్‌ పరీక్ష హాల్‌టికెట్లను తెలంగాణ ఉన్నత విద్యామండలి మే 22న విడుదల చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచింది. ఐసెట్‌కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబరు, పుట్టినతేది, క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ హాల్‌టికెట్ నెంబరు వివరాలు నమోదుచేసి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఈ ఏడాది వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం ఐసెట్ నిర్వహణ బాధ్యతను చేపట్టిన సంగతి తెలిసిందే. 
ఐసెట్ హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి..


మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి..