తెలుగు చిత్రసీమ మీద బాలీవుడ్ మీడియా కన్నేసిందా? కావాలని, పని కట్టుకుని మరీ తెలుగు హీరో హీరోయిన్లపై విషం చిమ్మే కార్యక్రమం పెట్టుకుందా? ఎందుకీ వివక్ష? కనీసం క్లారిటీ లేకుండా వరుసపెట్టి తప్పుడు వార్తలు ప్రసారం చేయడం ఏమిటి? ఈ ప్రశ్నలు తెలుగు సినిమా సెలబ్రిటీలతో పాటు హిందీ ఎంటర్టైన్మెంట్ మీడియాను ఫాలో అయ్యే కొందరు ప్రేక్షకుల మదిలో ఉన్నాయి.


మరీ ఇంత దారుణమా?
క్యాస్టింగ్ కౌచ్ వంటివి వెలుగులోకి వచ్చినప్పుడు తెలుగు హీరోలపై ఒక్కటంటే ఒక్క విమర్శ కూడా రాలేదు. అదే సమయంలో హిందీ హీరోలు, దర్శకుల నుంచి లైంగిక వేధింపులు ఎదుర్కొన్నట్టు కొందరు కథానాయికలు చెప్పుకొచ్చారు. ఆ ఆరోపణల్లో నిజం ఎంత? అబద్ధం ఎంత? అనేది పక్కన పెడితే... 


తెలుగులో ఓ టాప్ హీరో తనను వేధించాడని హన్సిక చెప్పుకొచ్చినట్టు తాజాగా హిందీలో ప్రముఖ వెబ్ మీడియా ఓ కథనాన్ని వండి వార్చింది. తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని హన్సిక ట్వీట్ చేసింది. దాంతో గాసిప్ రాయుళ్లకు ఆ ట్వీట్ చెంపపెట్టులా మారింది. ఇప్పుడు హన్సిక తెలుగు కంటే తమిళంలో ఎక్కువ సినిమాలు చేస్తున్నారు. తెలుగు హీరో వేధించాడని చెబితే... అందువల్ల, ఆమె తెలుగును వదిలి తమిళ చిత్రసీమకు వెళ్ళిందని ప్రేక్షకులు భావించే అవకాశం ఉందనే విషపు ఆలోచన అనుకుంట! అయితే, వాళ్ళకు హన్సిక ఆ అవకాశం ఇవ్వలేదు. 


శర్వానంద్ పెళ్ళి క్యాన్సిల్ అంటూ అలజడి!
శర్వానంద్, రక్షిత నిశ్చితార్థం జరిగి కొన్ని రోజులు అవుతోంది. జూన్ తొలి వారంలో జైపూర్ సిటీలోని ప్యాలెస్‌లో పెళ్ళికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ తరుణంలో అతని నిశ్చితార్థం రద్దు అయ్యిందని, గొడవలు జరిగాయని సమాచారం తమకు అందిందని బాలీవుడ్ మీడియా రాసుకొచ్చింది. అటువంటి ఏమీ లేదని శర్వానంద్ టీమ్ క్లారిటీ ఇచ్చింది. మెగా హీరో వరుణ్ తేజ్, హీరోయిన్ లావణ్యా త్రిపాఠి గురించి తమకు మాత్రమే తెలుసు అన్నట్లు జూన్ నెలలో నిశ్చితార్థానికి రెడీ అవుతున్నారని సదరు మీడియా సంస్థ పేర్కొంది.


Also Read : తెలుగు హీరోను డమ్మీ చేస్తే ఎలా? తమిళ క్యారెక్టర్ ఆర్టిస్టులే ఎక్కువా?


కాజల్ అగర్వాల్ వంటి కథానాయికలు బాలీవుడ్ కంటే సౌత్ సినిమా ఇండస్ట్రీలో క్రమశిక్షణ, విలువలు ఉన్నాయని మీడియా ముందు చెబుతున్నారు. అదేదో తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఆ మాట చెప్పారని అనుకుంటే పొరపాటే! ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో ఆ మాట చెప్పారు. దక్షిణాది సినిమాల వల్లే తనకు హిందీలో అవకాశాలు వచ్చాయని పూజా హెగ్డే పేర్కొన్నారు. ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చిన హీరోయిన్లు చాలా మంది సౌత్ ఇండస్ట్రీ గురించి గొప్పగా చెబుతున్నారు. 


గాసిప్స్ వెనుక బాలీవుడ్ బడా దర్శక నిర్మాత?
సౌత్ ఇండస్ట్రీలో మరీ ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి జాతీయ స్థాయిలో విపరీతమైన గుర్తింపు లభిస్తోంది. ఈ తరుణంలో తెలుగు సెలబ్రిటీల మీద బాలీవుడ్ మీడియాలో వరుసపెట్టి గాసిప్స్ వస్తుండటం గమనార్హం. ఇదంతా కావాలని విషం చిమ్మే కార్యక్రమంలా ఉందని కొందరు భావిస్తున్నారు. ముఖ్యంగా గాసిప్స్ రాస్తున్న వెబ్ మీడియా వెనుక బాలీవుడ్ బడా దర్శక నిర్మాత ఉన్నారని ముంబై ఖబర్. హిందీ మీడియాలో తెలుగు తారలపై వరుస పుకార్లు చూసి సినీ ప్రముఖులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 


Also Read పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ బైక్స్ & కారుకు సేమ్ నంబర్, సమంత కారుకూ... హరీష్ శంకర్ 2425 సెంటిమెంట్!