హీరోయిన్‌తో కిరణ్ అబ్బవరం ప్రేమ, పెళ్లి - ఈ నెలలోనే ఎంగేజ్‌మెంట్!
చాలామంది హీరో, హీరోయిన్లు తమ మొదటి సినిమా కో స్టార్‌తోనే ప్రేమలో పడతారు. కానీ ఆ రిలేషన్‌షిప్ అనేది కొంతమందికి మాత్రమే వర్కవుట్ అవుతుంది. కొన్ని మాత్రమే పెళ్లి వరకు వెళతాయి. ఇప్పుడు అలా పెళ్లి వరకు రిలేషన్‌షిప్‌లో మరో జంట చేరనుంది. అదే కిరణ్ అబ్బవరం, రహస్య గోరక్ కపుల్. వీరిద్దరి లీడ్ రోల్స్‌లో హీరో, హీరోయిన్‌గా మొదటి సినిమాను కలిసి చేశారు. అప్పటినుండి వీరిద్దరి మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడింది. అయితే పలుమార్లు వీరిద్దరూ ప్రేమలో పడ్డారని రూమర్స్ వైరల్ అయినా.. దానిని వారు పెద్దగా పట్టించుకోలేదు. తాజాగా కిరణ్, రహస్య త్వరలోనే ఎంగేజ్‌మెంట్ చేసుకోనున్నారనే వార్త టాలీవుడ్‌లో చక్కర్లు కొడుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రాజకీయాల్లోకి రచన - పశ్చిమ బెంగాల్‌లో ఎంపీగా పోటీ చేస్తున్న టాలీవుడ్ నటి
రచన.. ఈ పేరు వినగానే తప్పకుండా మీకు అలనాటి సినిమాలు గుర్తుకొస్తాయి. చిరంజీవితో ‘బావగారు బాగున్నారా’ సినిమాతోపాటు ‘లాహిరి లాహిరి లాహిరిలో’, ‘అభిషేకం’, ‘ఈశ్వర్ అల్లా’, ‘సుల్తాన్’, ‘కన్యాదానం’, ‘మావిడాకులు’, ‘పిల్ల నచ్చింది’, ‘రాయుడు’ సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ మూవీ తర్వాత రచన మళ్లీ సినిమాల్లో కనిపించలేదు. సుమారు 22 ఏళ్లుగా టాలీవుడ్‌కు దూరంగా ఉంది. బెంగాలీ, ఒడియా సినిమాలు.. టీవీ షోస్‌లో బిజీగా ఉండటమే ఇందుకు కారణం. ప్రముఖ బెంగాలీ టీవీ షో అయిన ‘దీదీ నెంబర్ 1’కు హోస్ట్‌గా వ్యవహరించి మంచి గుర్తింపును తెచ్చుకుంది రచన బెనర్జీ. ఇప్పుడు బుల్లితెరను వదిలేసి ఏకంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎమ్‌సీ) పార్టీ తరపున హూఘ్లీ లోక్ సభ సీటు కోసం పోటీపడుతోంది రచన. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ - విశ్వక్ సేన్ ‘గామి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ అన్ని కోట్లా?
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన అడ్వెంచర్ డ్రామా ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో చాందినీ చౌదరి కథానాయకిగా నటించింది. ఆరేళ్లుగా నిర్మాణం జరుపుకున్న ఈ సినిమా ఎట్టకేలకు మహా శివరాత్రి కానుకగా మార్చి 8న థియేటర్లలోకి వచ్చింది. తొలి రోజే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ తెచ్చుకుని, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబడుతోంది. మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 20 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
అరే ఏంట్రా ఇది - పెట్టింది రూ.45 కోట్లు, వచ్చింది రూ.38 వేలు, ఇంతకీ ఆ ఘోరమైన ఫ్లాప్ మూవీ ఏమిటో తెలుసా?
ప్రేక్షకులను మెప్పించకపోయినా, ఆశించినన్ని కలెక్షన్స్ రాకపోయినా.. ఆ సినిమాని ఫ్లాప్ సినిమా అనే అంటారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోమే సినిమా మాత్రం.. ఫ్లాప్ సినిమాలందు ఈ సినిమా వేరయ్యా.. అనే లెవెల్‌లో ఉంటుంది. కారణం.. అంత ఘోరమైన కలెక్షన్స్ వచ్చాయి ఈ సినిమాకి. ప్రభాస్ నటించిన 'ఆది పురుష్', టైగర్ ష్రాఫ్, కృతిసనన్ నటించిన 'గణపత్', హృతిక్ రోషన్ నటించిన 'కైట్స్', అక్షయ్ కుమార్, సోనాక్షి సిన్హా నటించిన 'జోకర్' ఇన్ని రోజులు ఈ సినిమాల పేర్లు వినగానే వెంటనే ఫ్లాప్ సినిమాలు అనేస్తారు. నిజానికి బాలీవుడ్ చరిత్రలోనే అత్యంత ఫ్లాప్ సినిమాలు అని వీటిని ఉదహరిస్తారు. కానీ, వీటన్నింటినీ పక్కకు నెట్టేసింది 'లేడీ కిల్లర్' అనే సినిమా. ఇండియాలోనే అత్యంత భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచింది 'లేడీ కిల్లర్'. అర్జున్ కపూర్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాని 'బీఏ పాస్', 'సెక్షన్ 375', 'బ్లర్' లాంటి సినిమాలు డైరెక్టర్ చేసిన అజయ్ బహ్ల్ తెరకెక్కించాడు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
టాలీవుడ్‌లో విషాదం - 'సత్యం' దర్శకుడు సూర్య కిరణ్ మృతి
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కింగ్ అక్కినేని నాగార్జున నిర్మాణంలో ఆయన మేనల్లుడు సుమంత్ కథానాయకుడిగా నటించిన 'సత్యం' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన సూర్య కిరణ్ మృతి చెందారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)