India's biggest flop: ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌క‌పోయినా, ఆశించిన‌న్ని క‌లెక్ష‌న్స్ రాక‌పోయినా.. ఆ సినిమాని ఫ్లాప్ సినిమా అనే అంటారు. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోమే సినిమా మాత్రం.. ఫ్లాప్ సినిమాలందు ఈ సినిమా వేర‌య్యా.. అనే లెవెల్‌లో ఉంటుంది. కార‌ణం.. అంత ఘోర‌మైన క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి ఈ సినిమాకి. ప్ర‌భాస్ న‌టించిన 'ఆది పురుష్', టైగ‌ర్ ష్రాఫ్, కృతిస‌న‌న్ న‌టించిన 'గ‌ణ‌ప‌త్', హృతిక్ రోష‌న్ న‌టించిన 'కైట్స్', అక్ష‌య్ కుమార్, సోనాక్షి సిన్హా న‌టించిన 'జోక‌ర్' ఇన్ని రోజులు ఈ సినిమాల పేర్లు విన‌గానే వెంట‌నే ఫ్లాప్ సినిమాలు అనేస్తారు. నిజానికి బాలీవుడ్ చ‌రిత్ర‌లోనే అత్యంత ఫ్లాప్ సినిమాలు అని వీటిని ఉద‌హ‌రిస్తారు. కానీ, వీట‌న్నింటినీ ప‌క్క‌కు నెట్టేసింది 'లేడీ కిల్ల‌ర్' అనే సినిమా. ఇండియాలోనే అత్యంత భారీ ఫ్లాప్ సినిమాగా నిలిచింది 'లేడీ కిల్ల‌ర్'. అర్జున్ క‌పూర్, భూమి ప‌డ్నేక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌లు పోషించిన ఈ సినిమాని 'బీఏ పాస్', 'సెక్ష‌న్ 375', 'బ్ల‌ర్' లాంటి సినిమాలు డైరెక్ట‌ర్ చేసిన అజ‌య్ బహ్ల్ తెర‌కెక్కించాడు. 


క‌లెక్ష‌న్ల క‌రువు.. 


మాములుగా సినిమాకి మంచి క‌లెక్ష‌న్లు వ‌స్తే క‌లెక్ష‌న్ల సునామీ అంటాము. కానీ, ఈ సినిమాకి మాత్రం క‌లెక్ష‌న్ల క‌రువు అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా మొద‌టిరోజు రూ.38,000 క‌లెక్ష‌న్లు సాధించింది ఈ సినిమా. మొద‌టిరోజు థియేట‌ర్ల‌లో ఎన్ని టికెట్లు తెగాయో తులుసా 293 టికెట్లు. రూ.45 కోట్ల వ్య‌యంతో తీసిని ఈ సినిమా మొత్తం మీద రూ.ల‌క్ష వ‌సూలు చేసిందని ట్రేడ్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. దీంతో ఈ సినిమా ఇండియా సినిమా చ‌రిత్ర‌లోనే అత్యంత భారీ ఫ్లాప్ సినిమాగా రికార్డ్ సృష్టించింద‌ని సినీ విశ్లేష‌కులు చెప్తున్నారు. గతేడాది న‌వంబ‌ర్‌లో ఈ సినిమా రిలీజ్ అయ్యింది. క్రైమ్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమా.. 2023 నవంబర్ 3న రిలీజ్ అయ్యింది. అయితే, ఈ సినిమాని అసంపూర్ణంగా రిలీజ్ చేశారట మేక‌ర్స్. ఎడిటింగ్ కట్స్ స‌రిగ్గా చేయ‌లేద‌ని, డ‌బ్బింగ్ కూడా పూర్తి కాకుండా సినిమాని రిలీజ్ చేశార‌నే వార్త‌లు వినిపించాయి. ఎన్నో విమ‌ర్శల‌కు గురైంది ఈ సినిమా. అసలు ఈ సినిమా ఒకటి రిలీజైందనే సంగతి కూడా ప్రేక్షకులకు తెలియదట.


ఓటీటీలో రిలీజ్ చేసేందుకు.. 


'లేడీ కిల్ల‌ర్' సినిమా షూటింగ్ నుంచే అడ్డంకులు ఉన్నాయి. షూటింగ్ డిలే అవ్వ‌డం, దీంతో బ‌డ్జెట్ అనుకున్న దానికంటే ఎక్కువ కావడం నిర్మాతలకు పెద్ద తలనొప్పిగా మారింది. దీంతో ఎలాంటి ప్ర‌మోష‌న్స్ లేకుండా, ఇన్ఫ‌ర్మేష‌న్ లేకుండా థియేట‌ర్ల‌లో సినిమాని రిలీజ్ చేశారు. దీంతో అస‌లు సినిమా రిలీజైన విష‌యం కూడా ఎవ్వ‌రికీ తెలియ‌లేదు. కేవ‌లం 12 థియేట‌ర్ల‌లో మాత్ర‌మే సినిమాని రిలీజ్ చేశారు. అయితే, మేక‌ర్స్ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఫిక్స్ అవ్వ‌డంతో.. రూల్ ప్ర‌కారం, డీల్ ప్ర‌కారం నామ్ కే వాస్తే సినిమాని థియేట‌ర్ల‌లో రిలీజ్ చేసినట్లుగా కూడా టాక్ వినిపిస్తోంది. అయితే, ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా ఓటీటీలో కూడా రిలీజ్ చేయ‌లేదు. మూవీ విడుదలైన 4 - 5 వారాల్లో ఓటీటీలోకి రావాలి. కానీ, అలా జరగలేదు. మన తెలుగు సినిమా ‘ఏజెంట్’ లెక్క!


Also Read: రోజూ ఇన్ని గంటలే నిద్రపోతున్నారా? అయితే, మీకు ‘డయాబెటిస్’ తప్పదు!