Satyabhama Telugu Serial Today Episode సత్య వాళ్ల మంగళస్నానాల దగ్గరకు రాకుండా విశ్వనాథం దూరంగా ఉంటాడు. దీంతో విశాలాక్షి విశ్వనాథాన్ని ఒప్పించి తీసుకొస్తుంది. ఇక భైరవి మీ అమ్మానాన్నలు లేరు అప్పుడే అప్పగింతలు పెట్టేశారా అని అంటుంది. దీంతో మహదేవయ్య భైరవి మాస్తారు వాళ్లు ఏం పనిలో ఉన్నారో ఏంటో కార్యక్రమం మొదలు పెట్టు అంటారు. దీంతో భైరవి క్రిష్ సత్య, హర్ష, నందినిలకు పసుపు రాస్తుంది. మహదేవయ్య కూడా రాస్తాడు. ఇక అందరు జంటలతోనూ పసుపు రాయిస్తుంది భైరవి. మరోవైపు తన తల్లిదండ్రులు ఇంకా రాలేదు అని సత్య కన్నీళ్లు పెట్టుకుంటుంది. 


క్రిష్: సత్య ఏమైంది..
సత్య: ఏం లేదు. 
భైరవి: ఇదిగో సంధ్య పోయి మీ అమ్మానాన్నలను తీసుకొని రా..
మీన: ఏంటి పిన్ని ఇక్కడ శుభకార్యం జరుగుతుంటే మీరు ఎక్కడికి వెళ్లారు. రండి వచ్చి నలుగు పెట్టండి. ఇక సత్య తల్లిదండ్రులు అయిష్టంగానే నలుగు రాస్తారు. విశ్వనాథం అంటీ ముట్టనట్లు అల్లుడికి పసుపు రాస్తాడు. 
బాలు: ఏంటి మామయ్య ఆ పసుపు రాయడం కొండంత అల్లుడిని తెచ్చుకుంటూ గోరంత రాస్తే సరిపోతుందా. 
మీన: మరెంత రాయమంటావ్ ఏంటి. ఓ పది కిలోలు సరిపోతుందా..
బాలు: నిజానికి సరిపోదు కానీ మా బ్రో సరిపెట్టుకుంటాడు. అయినా కూతుర్ని నెత్తిన పెట్టుకొని చూసుకునే అల్లుడికి ఎంత చేసినా తక్కువే. ఏం చేసినా తక్కువే. ఇంకా రాయండి.. అంటూ చేయి పట్టుకొని ఎక్కువ రాయిస్తాడు. 
మీన: బావగారి అందానికి పసుపుతో నలుగు సరిపోతుందేమో కానీ మా సత్య అందానికి బంగారంతో నలుగు పెట్టాలి తెలుసా.. 
బాలు: ఇదిగో పూల గంప అలాగలాగే.. మా బ్రో మనసు బంగారం అది సరిపోతుంది.
మీన: మరీ అంత పిసినారా..
సత్య: మీన వద్దు ప్లీజ్.
బాలు: నువ్వు రెచ్చి పోతే నేను ఊరుకుంటా కానీ సత్య రెచ్చిపోతే మా బ్రో ఊరుకోడు. బ్రో నువ్వు లెగు చెప్తా. అంటూ క్రిష్‌ని నిల్చొపెడతాడు. 
క్రిష్: రెచ్చిపోవడం అంటే...
బాలు: రెచ్చిపోవడం అంటే నువ్వు అనుకున్న రెచ్చిపోవడం కాదు బ్రో ముద్దుగా.. ప్రేమగా కాబోయే పెళ్లానికి నలుగు పెట్టు. బామ్మ గారు ఇదెక్కడి ఆచారం ఇదేం విడ్డూరం అనుకుంటున్నారా.. కంగారు పడకండి ఇలాంటి టైంలో ఎంజాయ్ చేయాలి అంతే.. కానీ బ్రో.. ఇంకా చూస్తావేంటి.. క్రిష్ సత్యకు కుంకుమ పెట్టి నలుగు రాస్తాడు. క్రిష్ మురిసిపోతాడు. 


ఇక మీన సత్యను కూడా అలాగే చేయమని అంటుంది. సత్య కూడా క్రిష్‌కి కుంకుమ పెట్టి నలుగు రాస్తుంది. తర్వాత రెండు జంటలకు అందరూ మంగళ స్నానాలు చేయిస్తారు. 
 
విశాలాక్షి: అమ్మా సంధ్య మంగళ స్నానాలు తర్వాత వేసుకునే బట్టలు తీసుకొచ్చాం కదా వెళ్లి తీసుకొని రా అమ్మా. సంధ్య బట్టల కోసం వెళ్తూ కాలు జారి పడిపోబోతుంటే అక్కడే ఫోన్ మాట్లాడుతున్న దేవా సంధ్యను పట్టుకుంటాడు. సంధ్య సారీ చెప్పి వెళ్లిపోతుంది. దేవా సంధ్యను తేడాగా చూస్తాడు. తర్వాత దేవా ఏదో చెప్పి తన తండ్రిని అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. తర్వాత రెండు జంటలకు మంగళ హారతులను భైరవి, విశాలాక్షి ఇస్తారు. ఇక దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: 'త్రినయని' సీరియల్ మార్చి 11th: గాయత్రీ దేవి కోసం పేపర్‌, టీవీల్లో యాడ్ ఇచ్చి రచ్చ చేసిన సుమన.. చెంపపగలగొట్టిన తిలోత్తమ!