Trinayani Telugu Serial Today Episode : విశాల్‌కు తన పెద్దమ్మ కాల్ చేస్తుంది. ఎందుకు ఇలా చేశారు అని ప్రశ్నిస్తుంది. దీంతో విశాల్ పేపర్‌లో వచ్చిన న్యూస్‌ గురించా అని అడుగుతాడు. కాదు టీవీలో కూడా వస్తుంది అని చాలా మంది తనకు ఫోన్ చేసి మీ చెల్లి పునర్జన్మ ఎత్తిందా ఎందుకు ఇంకా ఫైండ్‌అవుట్ చేయలేదు అని అడుగుతున్నారు అని చెప్తుంది. 


విశాల్: ఇప్పటి వరకు చాలా జాగ్రత్తగా ఉన్నాం పెద్దమ్మ. కానీ ఎవరో నా పేరు మీద నయని పేరు మీద యాడ్ వేయించారు. అవును పెద్దమ్మ నయని కూడా కంగారు పడుతుంది. 
లలితాదేవి: వాట్.. తిలోత్తమ ఒకవేళ ఈ పని చేస్తే మర్యాద దక్కదు అని చెప్పు. వల్లభ చేసినా నా చేతిలో చచ్చాడే వాడు.
విశాల్: పెద్దమ్మ ఆవేశపడకండి.. ఎవరు ఇలా చేశారో నేను కనుక్కుంటాను.
విక్రాంత్: విన్నారు కదా అమ్మ పెద్దమ్మ ఎంత సీరియస్‌గా ఉందో..
తిలోత్తమ: అరే మాకే చెప్పినట్లు చెప్తున్నావ్ ఏంట్రా. 
సుమన: ముందు విలేకర్లను, ఉద్యోగస్తులను ఇంటికి వచ్చి ప్రశ్నించకుండా ఆపండి. 
డమ్మక్క: ఎవరికి వాళ్లు ఈ పని చేయనట్లు నటిస్తే మరి ఎవరు చేసినట్లు. 
నయని: ఈ ఇంటి పరువు తీయాలి అనుకున్న వాళ్లని మేం క్షమించినా లలితా దేవి గారు క్షమించరు. 
సుమన: తోడబుట్టిన చెల్లిలు నీ కడుపున పుట్టినా చూడలేకపోయాను అన్నా బాధ లలితాదేవి అత్తయ్యకు ఉండదా.. చూడాలి అనే ఆశ లేదా.. నిజానికి ఆవిడే ఇలా చేసుంటే బాగుండేది. 
విశాల్: సుమన ఇంటి గుట్టు బయట పెట్టుకోరాదు..
హాసిని: గాయత్రీ అత్తయ్య కనిపించడానికి ఇంకా పదేళ్లు అయినా పట్టని నీకు ఏంటి ప్రాబ్లమ్.
వల్లభ: మాకు ప్రాబ్లమ్..
డమ్మక్క: ఈ పని ఎవరు చేశారో మర్యాదగా ఒప్పుకుంటే మీకే మంచిది. 


ఇక తిలోత్తమను అందరూ ప్రశ్నించడంతో ఉలూచి మీద ఒట్టు పెట్టాలా అని అంటుంది. ఉలూచిని తీసుకొని సుమన దగ్గరకు వెళ్లి ఒట్టు పెట్టాల్సింది నేను కాదు. నువ్వు అని అంటుంది. అందరూ షాక్ అవుతారు.  


తిలోత్తమ: ఉలూచి మీద సుమనతో ఒట్టు వేయించి... ఇప్పుడు చెప్పు గాయత్రీ అక్కయ్య ఫొటోను పేపర్‌, టీవీలకు ఇచ్చింది ఎవరు. 
 సుమన: నేనే.. దీంతో తిలోత్తమ సుమన చెంప పొగలగొడుతుంది. ఎందుకు కొట్టారు అత్తయ్య.
తిలోత్తమ: గాయత్రీ అక్కయ్య ఎక్కడుందో మనకే తెలీదు ఇక జనాలకు ఎలా తెలుస్తుంది. ముందు తెలియాల్సింది మనకే కదా. జనాలకు కాదు అని నీకు తెలీదా..
సుమన: నేను ఇలా చేస్తే వాళ్లకి వీళ్లకి తెలుస్తుంది అని మీరు కంగారు పడుతున్నారా. కన్నకూతురు గురించి తెలిసిన విశాల్ బావగారు ఎవరికి చెప్పకుండా ఎందుకు దాస్తున్నారో ఆయన్ను అడగరెందుకు. చెప్పండి బావగారు. మిమల్ని కన్నతల్లి ఆచూకి మీకు తెలిసినా ఎందుకు చెప్పడం లేదో ఆ విషయం చెప్పండి.
హాసిని: చిట్టీ కూతురు గురించి తండ్రికి తెలిస్తే ఆ విషయం తల్లికి చెప్పకుండా ఉంటాడా..  
సుమన: నా మాటను కండించమని చెప్పండి పోని.
విశాల్: సుమన మా అమ్మ ఎక్కడుందని నాకు తెలుసు అని నీతో చెప్పానా.. 
చెప్పానా..
సుమన: గురువుగారితో మీరు ఏం చెప్పారు బావగారు.
పావనా: ఆపమ్మా నువ్వు నువ్వు ఏం విన్నావో ఏంటో అల్లుడు నయనికి చెప్పకుండా ఉంటాడా..
దురంధర: నీ కూతురు మీద ఒట్టు వేసి నిజం చెప్పావని ఇలా నిందలు వేస్తున్నావ్. ఈ ఇంట్లో వాళ్లు విడిపోవాలి అనే నువ్వు ఇలా చేస్తున్నావే.
సుమన: నేను అన్నది అబద్ధం అయితే బావగారిని కూడా ఒట్టు వేయమని చెప్పండి. 
నయని: బాబుగారు సుమన అలా అంటున్నా మీరు ఏం అనరేమి.
విశాల్: నాకు ఏం చెప్పాలో అర్థం కావడం లేదు నయని. 


రాత్రి డమ్మక్క సుమన దగ్గరకు వచ్చి కాళీగా ఉన్నావా అని అంటుంది. నువ్వు చేసింది మంచి పనే అని డమ్మక్క అంటుంది. చర్యకు ప్రతి చర్య ఉంటుంది అని అంటుంది. ఇక విక్రాంత్ వచ్చి పెద్దమ్మ గురించి తెలుసుకోవడం వల్ల జరిగే మంచి ఏమిటి అని అడుగుతాడు. ఇక డమ్మక్క కళ్లు మూసుకొని భవిష్యత్ చూస్తుంది. అందులో గాయత్రీ పాపకు కిరీటం పెట్టడం కనిపిస్తుంది. ఇక డమ్మక్క సుమన ఎవర్న ద్వేషిస్తుందో వాళ్లే ఈ సామ్రాజ్యాన్ని శాసిస్తారు అని చెప్తుంది. డమ్మక్క ఎందుకు అలా చెప్పిందా అని సుమన తలపీక్కుంటుంది. 


సుమన: మనసులో.. ఎక్కడో అనాథగా పెరగాల్సిన ఆ గాయత్రీ పిల్ల మా అక్క కూతురుగా పెరిగుతుంది. అందరూ దానికే జేజేలు కొట్టి కాబోయే మహారాణి అవుతుందేమో అని భయంగా ఉంది. మనస్ఫూర్తిగా నేను ద్వేషించేది దాన్నే అలాంటప్పుడు అదే ఈ సామ్రాజ్యాన్ని పాలించబోతుందా అదెలా సాధ్యం.


తిలోత్తమ, వల్లభలు మరో కుట్రకు ప్లాన్ చేస్తారు. సీక్రెట్‌గా మైక్‌ను విశాల్ గదిలో లాంతరు దగ్గర పెట్టి తిలోత్తమ వెళ్లిపోతుంది. ఇక రామచిలుక దాన్ని చూస్తుంది. తిలోత్తమ ప్లాన్‌ను చిలుక వింటుంది. విశాల్‌ని సుమన అనుమానిస్తుంది అని అంటే ఎక్కడో ఏదో జరుగుతుంది అని విశాల్ ఏం దాస్తున్నాడో ఎవరితో మాట్లాడుతున్నాడో తెలుసుకోవడానికి విశాల్ గదిలో ఆ మైక్ పెట్టినట్లు తిలోత్తమ వల్లభకు చెప్తుంది. చిలుక తిలోత్తమను తిట్టుకుంటుంది. ఇక విశాల్ ఆ గదికి వస్తాడు. చిలుక ఇప్పుడేం చేయాలి అని ఐడియా అని అక్కడనుంచి ఎగిరిపోతుంది. ఇక తిలోత్తమ, వల్లభలు హెడ్ సెట్ పెట్టుకొని విశాల్ ఏం మాట్లాడుతాడా అని ఎదురు చూస్తారు. ఇంతలో హాసిని విశాల్‌కి జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడానికి అదే గదికి వస్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది. 


Also Read: కార్తీకదీపం 2: 'కార్తీకదీపం' సీరియల్‌ : కొత్త ప్రోమో వచ్చేసింది - అసలు కథ ఇదే