'భాగ్ సాలే' రివ్యూ : శ్రీ సింహ లేటెస్ట్ క్రైమ్ కామెడీ ఎలా ఉందంటే?
'మత్తు వదలరా'తో ప్రముఖ సంగీత దర్శకులు ఎంఎం కీరవాణి రెండో కుమారుడు శ్రీ సింహ కోడూరి కథానాయకుడిగా పరిచయమయ్యారు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. అయితే, ఆ తర్వాత సినిమాలు ఆశించిన రీతిలో ఆడలేదు. 'భాగ్ సాలే' ప్రచార చిత్రాలు చూస్తే... శ్రీ సింహ (Sri Simha Koduri)కు మళ్ళీ విజయం అందించేలా కనిపించాయి. మరి, సినిమా ఎలా ఉంది? ప్రణీత్ బ్రహ్మాండపల్లి ఎలా తీశారు? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఏడాది కాదు, 6 నెలలే - సమంతా బ్రేక్ తీసుకోడానికి అసలు కారణం ఇదేనట!
సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఏడాదిపాటు బ్రేక్ తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే, సంవత్సరం బ్రేక్ కాదని, కేవలం 6 నెలలు మాత్రమే సమంతా బ్రేక్ తీసుకుంటుందని ఆమె సన్నిహితులు తెలిపారు. ఇటీవల ‘శాకుంతలం‘ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆమె, ప్రస్తుతం విజయ్ దేవరకొండతో కలిసి ‘ఖుషీ‘ సినమాలో నటిస్తోంది. అటు ‘సిటాడెల్‘ వెబ్ సిరీస్ లోనూ యాక్ట్ చేస్తోంది. ఈ ప్రాజెక్టులు కంప్లీట్ కాగానే సినిమాలకు బ్రేక్ ఇవ్వాలని భావిస్తోందట. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ప్రాజెక్ట్-K బిగ్ అప్‌డేట్, అంతర్జాతీయ వేదికపై టైటిల్ రివీల్ - ఎక్కడంటే?
ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్-K’ ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాయి. ఈ నేపథ్యంలో మూవీ అప్‌డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల కోసం కీలక అప్‌డేట్ ఇచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


నాగశౌర్య 'రంగబలి' రివ్యూ : ఫస్టాఫ్‌లో సత్య కామెడీ హిట్, మరి సెకండాఫ్?
నాగశౌర్య (Naga Shourya) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'రంగబలి' (Rangabali Movie). విడుదలకు ముందు సత్య స్పూఫ్ వీడియో బోలెడు ప్రచారం తీసుకొచ్చింది. ఓ టీవీ కార్యక్రమంలో కొత్త దర్శకుడు పవన్ బాసంశెట్టి కామెడీ టైమింగ్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి సినిమా ఎలా ఉంది? (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


‘గుంటూరు కారం’ కొత్త షెడ్యూల్ ఖరారు - త్రివిక్రమ్ ఫేవరేట్ ప్లేస్‌లో షూటింగ్ షురూ!
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నారు. ఇటీవలే ఈ మూవీకి ‘గుంటూరు కారం’ టైటిల్ ను ఖరారు చేశారు. మహేష్, త్రివిక్రమ్ కాంబోకు మంచి టైమింగ్ ఉంటుంది. గతంలో వచ్చిన సినిమాలు చూస్తే అది అర్థమవుతుంది. అందుకే ఈ ‘గుంటూరు కారం’ సినిమా కోసం కూడా మహేష్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ మూవీకు సంబంధించి కొత్త షెడ్యూల్ ను ప్రారంభించనున్నారు మూవీ టీమ్. ఒకటి రెండు రోజుల్లో బి.హెచ్.ఇ.ఎల్ లో ఈ షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)