ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్-K’ ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచేశాయి. ఈ నేపథ్యంలో మూవీ అప్‌డేట్ గురించి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానుల కోసం కీలక అప్‌డేట్ ఇచ్చారు.
అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా టైటిల్ రిలీజ్
‘ప్రాజెక్ట్-కె’ మూవీ టైటిల్‌ను అంతర్జాతీయ వేదికపై గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు సన్నహాలు చేస్తున్నారు. ఈ నెల (జులై) 19 నుంచి అమెరికాలోని శాన్ డియాగోలో కామిక్ కాన్ వేడుకల జరగనున్నాయి. అక్కడే జులై 20న ప్రాజెక్ట్‌గా టైటిల్‌తోపాటు గ్లింప్స్ రిలీజ్ చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రభాస్‌తోపాటు అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, దర్శకుడు నాగ్ అశ్విన్, నిర్మాత అశ్వినీదత్ కూడా పాల్గొంటారు. ఈ సమాచారం తెలియగానే ప్రభాస్ అభిమానులు సంతోషంలో మునిగిపోయారు. ప్రభాస్ నటిస్తోన్న ‘సలార్’ మూవీ టీజర్ గురువారం సోషల్ మీడియా వేదికగా విడుదలైన సంగతి తెలిసిందే. మరికొద్ది రోజుల్లోనే ‘ప్రాజెక్ట్-కె’ గ్లింప్స్ కూడా వస్తుందని తెలియడంతో ఫ్యాన్స్ ఉబ్బితబ్బిబ్బు అవుతున్నారు.
‘ప్రాజెక్ట్ కె’లో కమల్ హాసన్ కూడా ఉన్నారని ప్రకటించడంతో మూవీపై ఆసక్తి నెలకొంది. ఆయన విలన్ పాత్రలో నటిస్తున్నాడనే టాక్ వినిపిస్తున్నా.. వాస్తవం ఏమిటనేది ఇంకా తెలియరాలేదు. అయితే, ఈ మూవీలో నటించేందుకు కమల్ హాసన్ భారీ రిమ్యునరేషన్ డిమాండ్ చేసినట్లు తెలిసింది. అలాగే, ఇందులో నటిస్తున్న ఇతర స్టార్స్‌కు కూడా నిర్మాతలు భారీగా చెల్లిస్తున్నట్లు సమాచారం. ఈ మూవీలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకోన్‌తోపాటు దిశా పటానీ కూడా కీలక పాత్రలో నటిస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ సినిమాగా 'ప్రాజెక్ట్ కె'ను తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. 'ప్రాజెక్ట్ కె' చిత్రీకరణ దాదాపు 70 శాతం పూర్తి అయ్యింది. కమల్ హాసన్, ప్రభాస్ మధ్య సన్నివేశాలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నట్లు యూనిట్ సన్నిహిత వర్గాల నుంచి అందుతున్న సమాచారం. అమితాబ్ బచ్చన్, దీపికా పదుకోన్ సీన్స్ ఇంకో పది రోజులు షూటింగ్ చేస్తే పూర్తి అవుతాయని తెలిసింది. అయితే, ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా తెలియరాలేదు.
రెండు భాగాలుగా రూపొందుతున్న ‘ప్రాజెక్ట్ K’
టాలీవుడ్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న చిత్రాల్లో ఒకటిగా ‘ప్రాజెక్ట్ K’ కానుంది. ఈ సినిమాకు సంబంధించి మరో కీలక విషయం బయటకు వచ్చింది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదలకానున్నట్లు సమాచారం. సైన్స్ ఫిక్షన్ ఫ్రాంచైజీ తొలి భాగం కమల్ తో పోరాడేందుకు భవిష్యత్తులోకి ప్రయాణించేందుకు ప్రభాస్ సిద్ధం కావడంతో ముగుస్తుంది. ఫ్రాంచైజీ 2వ భాగం పూర్తిగా ప్రభాస్, కమల్ హాసన్ మధ్యే నడవనున్నట్లు తెలుస్తోంది.
Also Read : తల్లి పరిస్థితి విషమంగా ఉన్నా షారుఖ్ ఖాన్ షూటింగ్‌కు వచ్చారు - ‘మాయా మేంసాబ్’దర్శకుడు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.