బాలీవుడ్ లో ఉన్న అగ్ర హీరోల్లో షారుక్ ఖాన్ కూడా ఒకరు. ప్రపంచవ్యాప్తంగా షారుక్ ఖాన్ కి భారీ క్రేజ్ ఉంది. ఆయన సినిమా విడుదల అవుతుందంటే చాలు బాక్స్ ఆఫీస్ షేక్ అవ్వాల్సిందే. ఆ విషయం ఇటీవల కాలంలో రిలీజైన 'పఠాన్' తో మరోసారి రుజువు అయింది. పఠాన్ కి ముందు షారుక్ ఖాన్ వరుస ప్లాప్స్ తో అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశారు. చాలా సంవత్సరాల తర్వాత 'పఠాన్' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకుని షారుక్ ఖాన్ కి తిరుగులేని కమ్‌బ్యాక్ ఇచ్చింది. ప్రపంచవ్యాప్తంగా పఠాన్ రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకుని సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. ఇక షారుక్ ఖాన్ కి సినిమాలపై ఎంత ఫ్యాషన్ ఉందో ఆయన హార్డ్ వర్క్ ని బట్టి మనకు అర్థమవుతుంది. ఈ వయసులో కూడా ఆయన సిక్స్ ప్యాక్స్ మెయింటెన్ చేస్తూ సినిమా కోసం మేకోవర్ అవుతున్నారు.
అయితే తాజాగా అలనాటి బాలీవుడ్ దర్శకుడు కేతన్ మెహతా షారుక్ ఖాన్ గురించి పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు. సుమారు 30 ఏళ్ల క్రితం కేతన్ మెహతా దర్శకత్వంలో 'మాయా మేంసాబ్' అనే సినిమాలో నటించారు షారుక్ ఖాన్. కాగా షారుఖ్ ఖాన్ బాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా 'దీవానా' అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చారు. నిజానికి 'మాయ మేం సాబ్' సినిమానే షారుక్ మొదటి సినిమా. కానీ ఈ మూవీ థియేటర్ రిలీజ్ కాస్త ఆలస్యం అవ్వగా దాని తర్వాత షూట్ చేసిన 'దివానా' సినిమాని ముందు థియేటర్స్ లో రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని దర్శకుడు కేతన్ మెహతా తాజాగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడిస్తూ ఆ సినిమా షూటింగ్ సమయంలో జరిగిన ఓ సంఘటన గుర్తు చేసుకున్నారు.
ఈ క్రమంలోనే కేతన్ మాట్లాడుతూ.. "మేము షూటింగ్ కోసం సిమ్లా వెళ్లినప్పుడు షారుక్ ఖాన్ తల్లి అనారోగ్యంతో చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు. అయినా కూడా షారుఖ్ ఖాన్ షూటింగ్ కోసం సిమ్లాకి వచ్చారు. అప్పుడే నాకు అర్థమైంది, వర్క్ విషయంలో ఎంత ప్రొఫెషనల్ గా ఉంటారో. ఈ విషయంలో షారుఖ్ ఖాన్ కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. తన వల్ల షూటింగ్ కి డిలే అవ్వకూడదని షారుక్ ఖాన్ వెంటనే షూటింగ్ కోసం సిమ్లా కి వచ్చారు. అతని సానుకూల శక్తికి నేను కృతజ్ఞుణ్ణి అని చెప్పారు. షారుక్ ఖాన్ తల్లి అనారోగ్యంతో 1991లో ఢిల్లీలో మరణించారు.
ఇక ఈ సినిమా కోసం షారుఖ్ ఖాన్ ని హీరోగా ఎలా తీసుకున్నారో దర్శకుడు కేతన్ వివరిస్తూ.. "ఈ సినిమా కోసం మేము కొత్త వాళ్లను వెతుకుతున్నాం. అప్పుడు సర్కస్ టెలివిజన్ సోలో నాతో కలిసి పని చేసిన అజీజ్ మిర్జా, సయ్యద్ మిర్జా షారుక్ ఖాన్ ని తీసుకుంటే బాగుంటుందని సూచించారు. దాంతో షారుక్ ని పిలిపించాం. అతనిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీ నాకు బాగా నచ్చింది. అతనితోనే సినిమా తీయాలని డిసైడ్ అయ్యాను" అంటూ తెలిపారు కేథన్ మెహతా. అలా షారుక్ ఖాన్ హీరోగా 'మాయ మేంసాబ్' సినిమా తెరకెక్కింది. షారుక్ తో పాటూ దీపా సాహి, ఫరూక్ షేక్ , రాజ్ బబ్బర్ కీలక పాత్రలో నటించిన ఈ చిత్రం షారుక్ ఖాన్ కి మొదటి సినిమానే అయినా.. దీవానా, చమత్కర్, రాజు బన్ గయా జెంటిల్‌మన్ మరియు దిల్ ఆష్నా హై తర్వాత ఈ చిత్రం విడుదలైంది. అయితే, ‘మాయా మేంసాబ్’లోని పలు అడల్ట్ సీన్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అప్పట్లో షారుఖ్ పెద్ద హీరో కాకపోవడం వల్ల పెద్ద చర్చ జరగలేదు. షారుఖ్ స్టార్ హీరోగా మారిన తర్వాత ఆ మూవీలోని కొన్ని అశ్లీల సీన్స్‌తో నెటిజన్స్ షారుఖ్‌ను ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. అయితే, ఆ మూవీ షారుఖ్‌కు మొదటి అవకాశాన్ని ఇచ్చినా.. తన కెరీర్‌లో ఎప్పటికీ అది మచ్చగానే మిగిలిపోతుంది.
Also Read : ఇన్‌స్టాగ్రామ్‌లో పవన్ కళ్యాణ్ అరుదైన రికార్డ్ - ఒక్క పోెస్ట్ కూడా పెట్టకుండానే!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.