జయాపజయాలతో సంబంధం లేకుండా ప్రతి సినిమాకూ మార్కెట్ పెంచుకుంటూ వెళుతున్న పాన్ ఇండియా హీరోగా రికార్డులు క్రియేట్ చేసే స్థాయికి రెబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) చేరుకున్నారు. కొత్త సినిమా థియేట్రికల్ రైట్స్ కొనే ముందు సదరు హీరో లాస్ట్ సినిమా ఎన్ని కోట్లు వసూలు చేసింది? అనేది పంపిణీదారులు, ఎగ్జిబిటర్లు చూస్తారు. 


ఆ లెక్కన చూస్తే 'సలార్' రేట్లు తక్కువ ఉండాలి. ఎందుకు? అంటే... 'ఆదిపురుష్' ఆశించిన రీతిలో ఆడలేదు. వసూళ్ళు అయితే వచ్చాయి కానీ ప్రభాస్ డై హార్డ్ ఫ్యాన్స్, సగటు ప్రేక్షకులను ఆ సినిమా డిజప్పాయింట్ చేసింది. అయినా సరే 'సలార్' థియేట్రికల్ రైట్స్ కళ్ళు చెదిరే రేటుకు అమ్మడానికి, కొనడానికి రంగం సిద్ధం అవుతోంది.


రూ. 200 కోట్లకు 'సలార్' తెలుగు రైట్స్?
'సలార్' తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ నుంచి హోంబలే ఫిలిమ్స్ సంస్థ రూ. 200 కోట్ల రూపాయలు రాబట్టాలని చూస్తోందని సమాచారం. రెండు తెలుగు రాష్ట్రాలు... ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో థియేట్రికల్ హక్కులను రూ. 140 నుంచి రూ. 160 కోట్లకు అమ్మాలని చూస్తున్నారట!


నైజాం రైట్స్ రూ. 70 - 80 కోట్లు చెబుతున్నారట. మరోవైపు ఆంధ్రలో థియేట్రికల్ హక్కులను కూడా అదే రేషియో విక్రయించాలని ప్లాన్ చేస్తున్నారట. 'ఆదిపురుష్'  సినిమాకు ఫ్లాప్ టాక్ వచ్చినప్పటికీ... ఓపెనింగ్స్ విపరీతంగా వచ్చాయి. పురాణ ఇతిహాస గ్రంథమైన రామాయణం ఆధారంగా రూపొందిన సినిమా అది. 'సలార్' అలా కాదు... మాస్ యాక్షన్ ఎంటర్టైనర్. పైగా, దీనికి 'కెజియఫ్' వంటి బ్లాక్ బస్టర్ తీసిన ప్రశాంత్ నీల్ దర్శకుడు. అందుకని. భారీ రేటు చెబుతున్నారు. అంతకు కొనడానికి కొందరు రెడీగా ఉన్నాయట. తెలుగు రాష్ట్రాల రైట్స్ 150 కోట్లకు అటు ఇటుగా విక్రయిస్తే... ఓవర్సీస్, జపాన్ లాంటి ఫారిన్ మార్కెట్స్ నుంచి ఈజీగా రూ. 50 కోట్లు వస్తాయని అంచనా.


Also Read : 'సలార్' టీజర్‌లో 'కెజియఫ్ 2' హింట్స్ - ఆ అంశాలు గమనించారా?


తెలుగులో కూడా 'కెజియఫ్ 2' మంచి విజయం సాధించింది. తెలుగు చిత్రసీమలో అగ్ర హీరోల సినిమాలకు వచ్చే స్థాయిలో వసూళ్ళు వచ్చాయి. ఒక్క నైజాంలోనే సుమారు 70 కోట్లు కలెక్ట్ చేసింది. 'సలార్' తీసింది ఆ సినిమా దర్శకుడే కావడం, పైగా ఇందులో తెలుగు హీరో ఉండటంతో హిట్ టాక్ వస్తే 70 కోట్లు రావడం పెద్ద కష్టం ఏమీ కాదు. కానీ, డిస్ట్రిబ్యూటర్లు అంత కోట్ చేసే అవకాశాలు తక్కువ. రూ. 50 నుంచి 60 కోట్లు అయితే  ఈజీగా వస్తాయి. మాస్ జానర్ కాబట్టి టెంప్ట్ చేసినా... ఓ వైపు 'ఆదిపురుష్' రిజల్ట్ వెంటాడుతూ ఉంటుంది కదా!


'సలార్' రైట్స్ రేసులో గీతా ఆర్ట్స్?
'సలార్' రైట్స్ తీసుకోవడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ ఆసక్తి కనబరుస్తున్నారని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన 'కాంతారా'ను ఆ సంస్థే తెలుగులో విడుదల చేసింది. అయితే... ఆ సినిమా రైట్స్ కొనలేదు. కమిషన్ మీద డిస్ట్రిబ్యూట్ చేసింది. ఈసారి అలా కాకుండా అవుట్ రేటుకు 'సలార్' రైట్స్ ఇవ్వాలని నిర్మాణ సంస్థ, కొనాలని గీతా ఆర్ట్స్ భావిస్తున్నాయట.


Also Read గుడిలో విజయ్ దేవరకొండ, సమంత - 'ఖుషి' కోసం యాగం, వైరల్ వీడియో



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial