Telangana Highcourt : సినిమా దర్శకుడు శంకర్‌కు భూ కేటాయింపును తెలంగాణ హైకోర్టు సమర్థించింది. ఆ భూ కేటాయింపులో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. శంకర్‌కు భూ కేటాయింపును సవాల్ చేస్తూ దాఖలైన పిల్‌ను కొట్టివేసింది. పిటిషన్‌పై బుధవారమే విచారణ జరిపిన న్యాయస్థానం శంకర్‌కు స్టూడియో నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే తప్పేమిటని ప్రశ్నించింది. భూకేటాయింపులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయని, ఒక్కో అవసరానికి ఒక్కో విధానం ఉటుందని అభిప్రాయపడింది.
గతంలో కేటాయించినట్లే శంకర్ కూ కేటాయించామన్న తెలంగాణ ప్రభుత్వం
ప్రభుత్వం సినీ కళాకారులకు, క్రీడాకారులకు భూములను కేటాయిస్తుందని, ఇందులో తప్పుపట్టాల్సిన అవసరం లేదని పేర్కొంది. ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, హజారికాకు ఆయా ప్రభుత్వాలు భూములు కేటాయించాయని గుర్తుచేసింది. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం మోకిలా గ్రామంలోని సర్వే నం.8లో ఎకరం రూ.5 లక్షల చొప్పున 5 ఎకరాలను దర్శకుడు శంకర్‌కు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ కరీంనగర్‌కు చెందిన జే శంకర్ 2020లో ప్రజాహిత వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్, జస్టిస్ తుకారాంజీతో కూడిన ధర్మాసనం ఎదుట వాదనలు పూర్తి కావడంతో భూ కేటాంయిపును సమర్థిస్తూ తీర్పు ఇచ్చారు.
స్టూడియో కోసం ఐదు ఎకరాలను మోకిలా వద్ద కేటాయించిన తెలంగాణ ప్రభుత్వం
విచారణ సందర్భంగా తెలంగాణ ఫిలిం డెవల్‌పమెంట్ కార్పొరేషన్(ఎ్‌ఫడీసీ) సిఫార్సులకు అనుగుణంగానే సినీ దర్శకుడు ఎన్.శంకర్‌కు అంతర్జాతీయ ప్రమాణాలతో ఫిలిం/టీవీ స్టూడియో నిర్మాణానికి ఐదెకరాలు కేటాయించినట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. హైదరాబాద్‌లో సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం 1975లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి ఎకరం రూ.5 వేలు చొప్పున 22 ఎకరాలు కేటాయించారని గుర్తు చేశారు. 1983లో పద్మాలయ స్టూడియో నిర్మాణానికి ఎకరం రూ.8,500 చొప్పున 1984లో సురేశ్ ప్రొడక్షన్స్‌కు ఐదెకరాలు, 2001లో అనందర్ సినీ సర్వీసె్‌సకు జూబ్లీహిల్స్‌లో ఎకరానికి రూ.8,500 చొప్పున కేటాయించారన్నారు.
ఉద్యమం సమయంలో జై బోలో తెలంగాణ సినిమా తీసిన ఎన్.శంకర్
అదే ప్రమాణికంగా సినీ దర్శకుడు శంకర్‌కు స్టూడియో నిర్మాణానికి స్థలం కేటాయించినట్లు తెలిపారు. తాము కేటాయింపులు చేసే నాటికి సబ్‌రిజిస్ట్రార్ లెక్కల ప్రకారం ఎకరం రూ.20 లక్షలుగా ఉందని అరవింద్ వివరణ ఇచ్చారు. ఇటీవల కుల సంఘాలకు ఇచ్చిన భూములపై హైకోర్టు స్టే విధించడంతో.. శంకర్‌కు కేటాయించిన భూమి విషయంలో హైకోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందోనన్న ఉత్కంఠ ఏర్పడింది. శంకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో జై బోలో తెలంగాణ అనే సినిమాను తెరకెక్కించారు.