'సలార్' మూవీ బిగ్ అప్డేట్ - టీజర్ డేట్ ఫిక్స్, ఎప్పుడంటే..
దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న'సలార్' గురించి ఓ బిగ్ అప్‌డేట్ అధికారికంగా వెలువడింది. మరి కొద్ది రోజుల్లోనే టీజర్ విడుదల కానుందంటూ మేకర్స్ చేసిన ఈ కొత్త అనౌన్స్ మెంట్ ప్రభాస్ ఫ్యాన్స్ ను హుషారెక్కిస్తోంది. ఈ సందర్భంగా ప్రభాస్ యాక్షన్-ప్యాక్డ్ కొత్త పోస్టర్‌ను మేకర్స్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. దాంతో పాటు ఈ మూవీ టీజర్ జూలై 6న ఉదయం 5:12 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ - ఇన్‌స్టాగ్రామ్‌లోకి పవన్ కళ్యాణ్
స్టార్ యాక్టర్, పొలిటికల్ లీడర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఓ పక్క రాజకీయాల్లో ఉంటునే.. మరో పక్క లైనప్ లో ఉన్న సినిమాలను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తున్నారు. బ్రో, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్, హరి హర వీర మల్లు సినిమాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలన్నీ నిర్మాణ దశల్లో ఉన్నాయి. ఇప్పుడు, పవన్ కళ్యాణ్ అభిమానుల కోసం ఓ ఇంట్రస్టింగ్ అప్‌డేట్ వెలువడింది. పవన్ కళ్యాణ్ తన అభిమానులు, ఫాలోవర్లు, కార్యకర్తలతో ఇంటరాక్ట్ కావడానికి త్వరలో ఇన్‌స్టాగ్రామ్‌లో జాయిన్ కానున్నట్లు పవన్ కళ్యాణ్ సోదరుడు కొణిదెల నాగ బాబు అధికారికంగా ధృవీకరించారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా పంచుకున్నారు. అయితే, పవన్ కళ్యాణ్ ఇన్‌స్టాగ్రామ్ డెబ్యూ తేదీ ఇంకా వెల్లడి కాలేదు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


‘నా అంతట నేనేమీ చేయలేదు... కథలో అలానే ఉంది’ - శివకార్తికేయన్ ఫాంటసీ ‘మహావీరుడు’ ట్రైలర్ చూశారా?
శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న తమిళ యాక్షన్ మూవీ ‘మావీరన్’. తెలుగులో ‘మహావీరుడు’ పేరుతో విడుదల కానుంది. ఈ సినిమా ట్రైలర్‌ను నిర్మాతలు రిలీజ్ చేశారు. ఫాంటసీ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా తెలుగు, తమిళ భాషల్లో జులై 14వ తేదీన విడుదల కానుంది. ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్నారు. గతంలో ‘మండేలా’ అనే సందేశాత్మక సినిమా తీసిన మడోన్ అశ్విన్ ‘మహావీరుడు’కి దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగులో ఏషియన్ సునీల్ ఈ సినిమాను పంపిణీ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


రామ్, బోయపాటి పాన్ ఇండియా మూవీకి టైటిల్ ఫిక్స్ - గ్లింప్స్ వీడియో అదిరింది!
రామ్, బోయపాటి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ ను మేకర్స్ అఫీషియల్ గా ప్రకటించారు. ‘స్కంద’ అనే పేరును ఖరారు చేశారు. ‘ది అటాకర్’ అనే ట్యాగ్ లైన్ పెట్టారు.  ఈ మేరకు టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. నీటిలో ఖడ్గంతో శత్రువులను చీల్చి చెండాడుతున్న రామ్ విజువల్స్ విడుదల చేశారు. ‘నేను దిగితే ఓడేది ఉండదు. నేను దిగితే మిగిలేది ఉండదు” అంటూ రామ్ చెప్పే పవర్ ఫుల్ డైలాగులు అభిమానులలో రోమాలు నిక్కబొడిచేలా ఉన్నాయి. అదిరిపోయే  టైటిల్ గింప్స్   సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ దెబ్బతో రామ్ కెరీర్లో మరో ఊరమాస్ హిట్ పడటం ఖాయమని భావిస్తున్నారు.  (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


ఇట్స్ అఫీషియల్ - బన్నీతో త్రివిక్రమ్ నాలుగో మూవీ, హీరోయిన్ ఆమేనా?
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మరోసారి కలిసి సినిమా చేయబోతున్నారు. గత కొద్ది రోజులుగా వీరిద్దరు ఓ సినిమా ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆ ఊహాగానాలు నిజమేనని తేలిపోయాయి. బన్నీ, త్రివిక్రమ్ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. ఇవాళ(సోమవారం) ఉదయం 10:08 గంటలకు మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)