సూర్య 'కంగువ' గ్లిమ్స్ వచ్చేస్తుంది - ఎప్పుడంటే?
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'కంగువ'. అత్యంత భారీ బడ్జెట్ తో పీరియాడికల్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ మూవీపై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. స్టూడియో గ్రీన్, UV క్రియేషన్స్ నిర్మాణ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో నిర్మిస్తున్నాయి. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇలాంటి తరుణంలో ఈ సినిమా గ్లిమ్స్ వీడియో రాబోతుందంటూ మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. అయితే ఈ గ్లిమ్స్ వీడియో రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేందుకు ఒక్కో పోస్టర్తో సినిమాపై అంచనాలను పెంచేస్తున్నారు. ఈ క్రమంలోనే నిన్న ఓ పోస్టర్ ని విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
నో అంటే నో అనేది మగాళ్లకూ వర్తిస్తుంది - ఆ దర్శకుడికి విశ్వక్ సేన్ స్ట్రాంగ్ కౌంటర్?
టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ స్టార్ హీరో ఇమేజ్ ను దక్కించుకున్నాడు విశ్వక్. కేవలం సినిమాలతోనే కాకుండా తన యాటిట్యూడ్, వ్యాఖ్యలతో ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటాడు. ఒక్కోసారి ఆయన చేసిన వ్యాఖ్యలు, చేష్టలు వివాదాలకు దారి తీస్తూ ఉంటాయి. గతంలో కూడా అలా జరిగిన సందర్బాలను చూశాం. అయితే తాజాగా విశ్వక్ సోషల్ మీడియాలో ఒక వెరైటీ పోస్ట్ పెట్టి మరోసారి అందరి దృష్టినీ ఆకట్టుకున్నాడు. ఈ పోస్ట్ చూసి ‘బేబీ’ దర్శకుడు సాయి రాజేష్ ను ఉద్దేశించే పెట్టాడు అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజన్స్. ప్రస్తుతం ఈ పోస్ట్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడుస్తోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
ప్రభాస్ 'కల్కి' గ్లింప్స్‌లో గద, చక్రం - ఈ డీటైల్స్ గమనించారా? క్రేజీ థియరీలు చెబుతోన్న ఫ్యాన్స్
ప్రభాస్ ‘ప్రాజెక్ట్ K’ సినిమా ‘కల్కి 2898AD’ గ్లింప్స్ ని చాలా మిస్టీరియస్‌గా, అదే సమయంలో చాలా డీటైలింగ్‌గా కట్ చేయించారు డైరెక్టర్ నాగ్ అశ్విన్. ఈ చిన్న గ్లింప్స్ లో చాలా కథను చెప్పారు. బట్ అదంతా లేయర్స్ గానే ఉండటంతో ఆడియెన్స్ వెంటనే గెస్ చేసేందుకు ఆస్కారం లేదు. కానీ ప్రాజెక్ట్ K కల్కి గ్లింప్స్ మీద అప్పుడే చాలా థియరీస్ మొదలైపోయాయి. కొన్ని థియరీస్‌ను నిశితంగా పరిశీలిస్తే మైండ్ బ్లాక్ కాక తప్పదు. ప్రధానంగా వినిపిస్తున్న ఓ థియరీ ఏంటంటే.. ‘కల్కి’ సినిమా మొత్తం కూడా మహావిష్ణువు ఆయుధాల కోసం జరిగే పోరాటం. రైడర్స్ గా పిలవబడే దుష్టశక్తి సైన్యం దాని అధిపతి తమ దగ్గరున్న మోడ్రన్ వెపన్స్ తో పాటు శ్రీ మహావిష్ణువు అతి పురాతన ఆయుధాలను దక్కించుకోవాలని, తద్వారా ఈ భూమిపై ఆధిపత్యాన్ని కొనసాగించాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఏ మహావిష్ణువు ఆయుధాలైతే కావాలనుకుని ఆ దుష్టశక్తి భూమి మీదకు వచ్చిందో... ఆ ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఒక్కో ఆయుధానికి ఒక్కో వ్యక్తి.. ఆ ఆయుధం అంశతోనే జన్మిస్తారు. అలా గ్లింప్స్ లో కనిపించిన ఆయుధాలన్నీ ఇదిగో ఈ ఒక్క ఫోటోలో చూడొచ్చు. ఇక్కడ మహావిష్ణువు చేతిలో గద, శంఖువు, కమలం, సుదర్శన చక్రం ఉన్నాయి. కాది కల్కి గ్లింప్స్ లో వీటి రిఫరెన్స్ లు చూద్దాం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
హత్య' రివ్యూ : 'బిచ్చగాడు' హీరో విజయ్ ఆంటోనీ కొత్త సినిమా ఎలా ఉందంటే?
విజయ్ ఆంటోనీ (Vijay Antony) కొత్త కథలతో సినిమాలు చేస్తుంటారు. ఇంతకు ముందు చేసిన సినిమాలకు భిన్నంగా ఏదో ఒక కొత్తదనం కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఆయన కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'హత్య' (Hatya Telugu Movie). తమిళంలో 'కొలై'గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో హీరోయిన్లు మీనాక్షీ చౌదరి (Meenakshi Chaudhary), రితికా సింగ్ కీలక పాత్రలు చేశారు. ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో నేడు విడుదలైంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కోలీవుడ్‌లో కొత్త రూల్స్ - తమిళ సినిమాల్లో తమిళులే నటించాలి, ఇక్కడే షూటింగ్స్ చేయాలి: ఆర్కే సెల్వమణి
ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI) కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఇప్పుడు ఆ నిబంధనలే తమిళ చిత్ర పరిశ్రమలో వివాదాలకు దారి తీస్తున్నాయి. తమిళ చిత్రాల్లో కేవలం తమిళ నటీనటులు, సాంకేతిక నిపుణులు మాత్రమే ఉండాలని కొత్తగా ఆదేశాలు జారీ చేసింది. అంతే కాదు వీటిని ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసింది. ఈ క్రమంలో కొత్త నిబంధనలపై వచ్చిన విమర్శలను ప్రస్తావిస్తూ.. తమ సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని ఫెఫ్సీ ప్రెసిడెంట్ ఆర్కే సెల్వమణి చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)