తమన్ వాయిస్‌లో 'జాణవులే' - బాగుంది 'బ్రో'
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో కలిసి ఆయన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ నటించిన సినిమా 'బ్రో' (Bro The Movie). దీనికి త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, మాటలు రాశారు. సముద్రఖని దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ సంస్థలపై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. జూలై 28న విడుదల అవుతోంది. లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే... ఈ రోజు రెండో పాట విడుదల చేశారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


‘RRR’ సీక్వెల్ దర్శకుడిగా జక్కన్న కొడుకు? ఆయన కాదంటే?
దర్శక దిగ్గజం ఎస్, ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వాతంత్ర సమరయోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకుని విజువల్ వండర్ గా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్  'RRR' కి సీక్వెల్ చేస్తున్నామని, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఉంటారని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయం ప్రస్తుతానికి తెలియదని, కానీ 'ఆర్ ఆర్ ఆర్' సీక్వెల్ విషయంలో చాలా ప్లాన్స్ ఉన్నాయని, 'RRR' సీక్వెల్ని ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


‘ఆహా’లోకి విశ్వక్ సేన్ ఎంట్రీ- ఎంటర్ టైనింగ్ షోతో దుమ్మురేపనున్న ఊరమాస్ హీరో!
తెలంగాణ మాండలికంలో అదిరిపోయే ఊరమాస్ డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విశ్వక్ సేన్. ఇప్పటికే ఆయన నటించిన పలు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు వెండితెరపై సత్తా చాటిన ఆయన, ఇక ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నారు. ‘ఆహా’ వేదికగా ఆడియెన్స్‌ ను  అల‌రించ‌బోతున్నారు. సరికొత్త అవతార్ లో  కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ షోకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


‘ప్రాజెక్ట్ K’ నుంచి అదిరిపోయే అప్ డేట్- టైటిల్, గ్లింప్స్ రిలీజ్ డేట్ ఫిక్స్!
ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘ప్రాజెక్ట్-K’ ఈ మూవీకి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్నాడు. అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ వంటి భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీపై చాలా అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే ఈ మూవీ టీమ్ విడుదల చేసిన పోస్టర్లు, మేకింగ్ వీడియోస్ ప్రేక్షకులలో ఆసక్తిని పెంచాయి. తాజాగా ఈ మూవీకి సంబంధించి మరో కీలక అప్ డేట్ వచ్చింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)


కొత్త సినిమాలో హనీరోజ్‌ హాట్‌ లుక్‌, బ్యాన్‌ చేయాలంటూ నెటిజన్ల లొల్లి!
అందాల తార హనీ రోజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన అంద చందాలతో సినీ అభిమానులను ఓ రేంజిలో అలరిస్తోంది. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఈ ముద్దుగుమ్మ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఆమె ‘రాహేలు’ అనే పాన్ ఇండియన్ మూవీలో నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని హనీ రోజ్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో ఆమె బోల్డ్ లుక్ చూసి నెటిజన్ల మతి పోతోంది. ఈ సినిమా బీఫ్ రాజకీయాల చుట్టూ తిరగడం, ఇందులో ఆమె బీఫ్ అమ్మే మహిళగా కనిపించడంతో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఈ సినిమాను బ్యాన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి)