తెలంగాణ మాండలికంలో అదిరిపోయే ఊరమాస్ డైలాగులతో ప్రేక్షకులను అలరిస్తున్న నటుడు విశ్వక్ సేన్. ఇప్పటికే ఆయన నటించిన పలు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. టాలీవుడ్ లో ఈ యంగ్ హీరో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పటి వరకు వెండితెరపై సత్తా చాటిన ఆయన, ఇక ఓటీటీలోకి అడుగు పెట్టబోతున్నారు. ‘ఆహా’ వేదికగా ఆడియెన్స్‌ ను  అల‌రించ‌బోతున్నారు. సరికొత్త అవతార్ లో  కనిపించబోతున్నారు. త్వరలోనే ఈ షోకు సంబంధించిన ప్రకటన వెలువడే అవకాశం ఉంది.


విశ్వక్ సేన్ తో కొత్త షో ప్లాన్ చేస్తున్న ‘ఆహా’


తెలుగు ప్రేక్షకులను అలరించే కంటెంట్ తో ‘ఆహా’ దూసుకుపోతోంది. బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమాలు, వెబ్ సిరీస్‌లో, స్పెష‌ల్ టాక్ షోస్‌, రియాలిటీ షోస్ తో ప్ర‌తీ వారం తెలుగు ప్రేక్ష‌కుల ముంగిట స‌రికొత్త హంగామాను కలిగిస్తోంది. అందులో భాగంగా ఇప్పుడు మ‌రో విల‌క్ష‌ణ‌మైన షో తో ముందుకు రానుంది. ఇప్పటికే తెలుగు స్టార్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌ను ఓటీటీ మాధ్య‌మంలోకి రంగ ప్ర‌వేశం చేయించిన ‘ఆహా’ ఇప్పుడు యంగ్ టాలెంటెడ్ హీరో విశ్వక్ సేన్ తో ఆడియెన్స్‌ ను అలరించబోతోంది. 


టాక్ షోనా? గేమ్ షోనా?


‘ఫ‌ల‌క్‌నుమా దాస్‌’, ‘హిట్‌’, ‘ఓరి దేవుడా’, ‘దాస్ కా ధ‌మ్కీ’ లాంటి వైవిధ్య‌మైన చిత్రాల‌తో కెరీర్ ప్రారంభం నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విల‌క్ష‌ణ‌మైన సినిమాలు చేస్తూ హీరోగా త‌న‌దైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు  విశ్వ‌క్ సేన్‌. దర్శకుడిగా, నిర్మాతగా ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ గా దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఈ హీరో చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ఒకటి షూటింగ్ పూర్తి చేసుకోగా, మిగతా రెండు సెట్స్ పై ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆహాలో ఆయన ఒక కొత్త షో చేయబోతున్నారు. ఈ షో మొత్తం 15 ఎపిసోడ్ లు కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఫుల్ ఎంటర్టైనర్ గా ఈ షోను రూపొందిస్తున్నారట నిర్వాహకులు. త్వరలోనే ఈ షో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అధికారిక ప్రకటన కూడా మరికొద్ది రోజుల్లో రానున్నట్లు సమాచారం. అయితే ఇది టాక్ షోనా? లేదంటే గేమ్ షోనా? అనేది తెలియాల్సి ఉంది.


ఇప్పటికే  సమంత, కమెడియన్ హర్ష, బాలకృష్ణతో పలు టాక్ షోలు చేసి ఆడియన్స్ ని బాగా ఎంటర్టైన్ చేసింది ఆహా. ముఖ్యంగా బాలయ్య అన్‌స్టాపబుల్ ఎంతో అద్భుతంగా సక్సెస్ అయ్యింది. ఈ షో నుంచి ఇప్పటికి రెండు సీజన్లు స్ట్రీమింగ్ అయ్యాయి.  మూడో సీజన్ కోసం ప్రేక్షకులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే విశ్వక్ తో ఒక షో చేయబోతున్నట్లు ప్రకటన రావడం ప్రేక్షకులలో ఇంట్రెస్టింగ్ కలిగిస్తోంది.  


వరుస సినిమాలు చేస్తున్న మాస్ హీరో


ఇక విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘గామి’ అనే సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ఆయన అఘోరగా కనిపించనున్నట్లు తెలుస్తోంది.   ఈ మూవీ షూటింగ్ ఇటీవలే పూర్తి అయ్యింది. అటు #VS10, #VS11 సినిమాలు సైతం వేగంగా చిత్రీకరణ జరపుకుంటున్నాయి.    కొత్త దర్శకుడు రవితేజ ముళ్లపూడి డైరెక్షన్ లో #VS10 తెరకెక్కిస్తుంటే, #VS11 మూవీకి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్నారు.


Read Also: లేటు వయసులో ఘాటు ముద్దులు, ఆ సీన్ కోసం కాజోల్ రిహార్సల్ కూడా చేసిందట!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial