Trinayani july 15th: నయని మూకుడులో మణి పెట్టగా అప్పుడే సుమన వద్దు అంటూ మొగ గొంతుతో అరుస్తుంది. దాంతో అందరూ భయపడిపోతారు. మణి పెట్టొద్దు అది కరిగిపోతుంది అని గట్టిగా అరుస్తుంది. చాలా నొప్పి ఉంటుంది అని అంటుంది. ఎవరు నువ్వు మగ గొంతుతో మాట్లాడుతున్నావు అని నయని అడగటంతో.. మగ ప్రాణి మగస్వరం తోనే మాట్లాడుతుంది అని అంటుంది.
మణి మాత్రం అసలు కరిగించవద్దు అని అంటుంది. కానీ నయని మూకుడులో పెట్టేస్తుంది. ఇక వెన్నెల రావడంతో మణి మొత్తం కరిగి నీరుగా మారుతుంది. సుమన వద్దు అని అన్న కూడా వినిపించుకోలేదు అంటూ ఏడుస్తుంది. ఇక గురువు వెంటనే విక్రాంత్ తో సుమన చుట్టూ ఉన్న గీతను చెడిపేయమని. ఇక నీరు తీసుకొని వచ్చి విక్రాంత్ అది చెడిపేస్తాడు.
దాంతో సుమన మామూలు మనిషి అవ్వడంతో అందరూ తనను అదోలా చూడటంతో ఎందుకు అలా చూస్తున్నారు అని అడుగుతుంది. ఇంతసేపు నువ్వు ఏం చేసావో నీకు గుర్తుకు లేదా అని అడగటంతో.. నేనేం చేశాను అని అంటుంది. ఇక నయని జరిగిన విషయం చెప్పగా.. అప్పుడే సమయం మించిపోతుంది అని తొందరగా ఆ నీటిలో ఎవరు ఉన్నారో చూడండి ఢమ్మక్క అంటుంది.
మణి మొత్తం కరిగిపోవటానికి చూసి సుమన కోప్పడుతుంది. ఇక మొదట హాసిని చూడమని విశాల్ అంటాడు. ఎందుకంటే తను ఇంటికి పెద్ద కోడలు కాబట్టి అని కవర్ చేస్తాడు. ఇక హాసిని వెళ్లి చూడగా గాయత్రి దేవి కనిపిస్తుంది. ఎమోషనల్ గా చూసి సంతోషపడుతుంది. ఎవరిని చూశావు అని అడగటంతో తనకు మొఖం గుర్తుకులేదు అని అంటుంది.
నయని చూడబోతూ ఉండగా తను వెళ్లి చూస్తాను అని విశాల్ వెళ్లి చూస్తాడు. ఇక విశాల్ కి కూడా తన తల్లి గాయత్రి దేవి కనిపించడంతో సంతోషంలో కనిపిస్తాడు. ఇక ఎవరు కనిపించారు అని వల్లభ వాళ్ళు అమ్మ కనిపించింది అని నోరు జారుతాడు. దానితో అందరూ ఆశ్చర్యపోగా తిలోత్తమా అమ్మ కనిపించింది అని అంటాడు.
వెంటనే వల్లభ అవును అమ్మ గతంలో నీకేదో దెబ్బ తగిలితే అది చంద్రకారపు మచ్చలాగా మారింది అన్నావు అనటంతో తిలోత్తమా కూడా అవునవును అని అంటుంది. ఇక ఆ తర్వాత తిలోత్తమా చూడగా వెంటనే తనను గాయత్రి దేవి రెండు చేతులతో గొంతు పట్టుకుంటుంది. కానీ గాయత్రి దేవి పట్టుకున్న విషయం అక్కడ ఎవరికీ తెలియదు. ఎవరికి కూడా అక్కడ చెయ్యి పట్టుకున్నట్లు కూడా కనిపించదు.
కాని తిలోత్తమాకు మాత్రం రెండు చేతులు తనను గట్టిగా నొక్కటంతో వెంటనే అక్కడున్న చంద్రకారపు మణి నీటిని కింద పారబోస్తుంది. వెంటనే దూరం జరగటంతో అందరూ తనని ఏం జరిగింది అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తారు. రెండు చేతులు తనను గట్టిగా నొక్కయాని అనటంతో అదంతా నీ భ్రమ అని అంటారు.
ఇక హాసిని అత్తయ్య గారు నీరు కింద పారబోశారు కాబట్టి పరిహారం చేయాల్సింది అనటంతో.. వెంటనే గురువు కూడా రేపు ఉదయాన్నే బోనం ఎత్తుకొని సాయంత్రం వరకు ఉండాలి అని చెబుతాడు. ఇక అందరూ అక్కడినుంచి ఎవరి గదిలోకి వెళ్లి పోతారు. ఇక విశాల్ గాయత్రి పాపని ఎత్తుకొని తన తల్లి గాయత్రిని తలుచుకుంటాడు.
అప్పుడే అక్కడికి నయని తండ్రి కూతుర్లు ఏదో ముచ్చట్లు పెడుతున్నారు అని అంటుంది. తిలోత్తమా అత్తయ్య గొంతు నొక్కింది ఎవరు అని అడుగుతుంది. దాంతో విశాల్ నాకేమీ తెలుసు నేనేమైనా చూశాను అని అంటాడు. నేను గాయత్రి అమ్మగారు అనుకున్నాను అని.. అయినా అమ్మగారు అలా ఎందుకు చేస్తారు అలా చేయరు అని నిజాన్ని కవర్ చేస్తూ మాట్లాడుతుంది. ఇక విశాల్ తన మనసులో.. అమ్మని చంపింది తిలోత్తమ్మా అని నీకు తెలుసని నాకు తెలుసు అని.. నాకు తెలిసిన విషయం నీకు తెలియదు అని అనుకుంటాడు.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial