ప్రస్తుతం థియేట్రికల్ రిలీజెస్ కంటే ఓటీటీ కంటెంట్ కు బాగా డిమాండ్ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఓటీటీ సంస్థలు సరికొత్త కంటెంట్ లో వీక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఓటీటీ విషయంలో సెన్సార్ నిబంధనలు కూడా మరీ ఎక్కువగా ఉండకపోవడంతో నటీనటులు రెచ్చిపోయి నటిస్తున్నారు. దశాబ్దాల తరబడి సినిమా పరిశ్రమలో ఏ రోజు హద్దులు దాటి నటించని వాళ్లు కూడా ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్ లలో ముద్దు సీన్లు, శృంగార సన్నివేశాల్లో కనిపిస్తున్నారు. తాజాగా రెండు దశాబ్దాల తన నో కిస్సింగ్ పాలసీని బ్రేక్ చేసి విజయ్ వర్మతో కలిసి ముద్దు సీన్లలో నటించింది తమన్నా. తాజాగా బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ కూడా తమన్నా బాటలోనే నడుస్తోంది.
లేటు వయసులో ఘాటు సీన్లు
బాలీవుడ్ ముద్దుగుమ్మ కాజోల్ తాజాగా ‘ది ట్రయల్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ప్రస్తుతం ఈ సిరీస్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇందులో న్యాయవాది నొయొనికా సేన్‌గుప్తా పాత్రలో కనిపించింది. అయితే, ఈ సిరీస్ కోసం కాజోల్ తన 31 ఏండ్ల నో కిస్సింగ్ పాలసీని వదులుకుంది. సుమారు 5 పదుల వయసులో లిప్ లాక్ సన్నివేశాల్లో నటించింది. ఒకరితో కాదు, ఇద్దరితో ముద్దు సీన్లు చేసి ఆశ్చర్యపరిచింది. ఈ సిరీస్ రెండు ఎపిసోడ్లలో అలీఖాన్ తో ఒకసారి, జిష్షూ సేన్ గుప్తాతో మరోసారి లిప్ లాక్ సీన్లలో నటించింది. ఈ సీన్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
కాజోల్ సుమారు 3 దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతున్నా, కిస్సింగ్ సీన్లు ఎప్పుడూ చేయలేదు. అందాల ఆరబోతతో అలరించిన ముద్దు సీన్ల జోలికి వెళ్లలేదు. లేటు వయసులో ఆమె చేసిన ఈ బోల్డ్ సీన్లు, ఆమె అభిమానులతో పాటు సినీ లవర్స్ ను ఆశ్చర్యపరుస్తున్నాయి. కొంత మంది ఆమె ను ఈ సన్నివేశాలు చేసినందుకు అభినందిస్తుండగా, మరికొంత మంది విమర్శిస్తున్నారు. ఈ వయసులో ఆ సీన్లు అవసరమా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అమెరికన్ వెబ్ సిరీస్ ‘ది గుడ్ వైఫ్’ కు ‘ది ట్రయల్’ అనేది ఇండియన్ వెర్షన్. భర్త చేతిలో మోసపోయిన ఓ లాయర్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస రూపొందింది. ఈ సిరీస్ లో కాజోల్ నటన పట్ల విమర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు.
రిహార్సల్ చేసి మరీ ముద్దు సీన్లలో నటించారట!
ఇక ఈ ముద్దు సీన్ గురించి అలీఖాన్ పలు విషయాలు వెల్లడించారు. ఈ కిస్సింగ్ సీన్లను ఓ హోటల్ లో చిత్రీకరించినట్లు చెప్పారు. అంతేకాదు, దర్శకుడు ఈ సీన్ షూట్ చేయడం కోసం క్లోజ్డ్ సెట్ ఏర్పాటు చేశారని చెప్పారు. అంటే, ముఖ్యమైన వ్యక్తులు మాత్రమే సెట్‌లో ఉండేలా చూసుకున్నారు. అయితే, ఈ సన్నివేశంలో నటిస్తున్నప్పుడు సిగ్గు, ఇబ్బంది, సంకోచం కలగలేదని ఆయన వెల్లడించారు. అంతేకాదు, ఈ సన్నివేశాన్ని రెండుసార్లు రిహార్సల్ చేసి టేక్ కోసం వెళ్లినట్లు వివవరించారు. అంతేకాదు, రిహార్సల్స్ ను మానిటర్ లో చూసి ఓకే అనుకున్నాకే టేక్ చేసినట్లు చెప్పారు.
Read Also: ఆ విషయాల గురించి మాట్లాడ్డం ఇష్టం లేదు- తమన్నాతో ప్రేమాయణంపై విజయ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial