దర్శక దిగ్గజం ఎస్, ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన 'ఆర్ ఆర్ ఆర్' సినిమా ఎంత పెద్ద సంచలన విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్వాతంత్ర సమరయోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకుని విజువల్ వండర్ గా రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుమారు 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో ఫ్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రం గత ఏడాది మార్చి 22న ప్రపంచవ్యాప్తంగా విడుదలై భారీ విజయాన్ని అందుకోవడం తోపాటు బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ని అందుకుని సరికొత్త రికార్డులు క్రియేట్ చేసింది. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు.


తాజాగా ఓ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్  'RRR' కి సీక్వెల్ చేస్తున్నామని, అందులో రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ఉంటారని వెల్లడించారు. అయితే ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ఉంటుందనే విషయం ప్రస్తుతానికి తెలియదని, కానీ 'ఆర్ ఆర్ ఆర్' సీక్వెల్ విషయంలో చాలా ప్లాన్స్ ఉన్నాయని, 'RRR' సీక్వెల్ని ఏకంగా హాలీవుడ్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. అయితే, ఈ సీక్వెల్‌కు రాజమౌళి దర్శకత్వం వహించడం లేదని ఆయన వెల్లడించారు. ఈ నేపథ్యంలో 'RRR' సీక్వెల్ కు ఎవరు దర్శకత్వం వహిస్తారు? అనే అంశంపై కీలక చర్చ జరుగుతోంది.


'RRR' సీక్వెల్ దర్శకుడిగా కార్తికేయ?


సినిమా పరిశ్రమలో మాత్రం 'RRR' సీక్వెల్ దర్శకుడిగా రాజమౌళి తనయుడు కార్తికేయ అరంగేట్రం చేయబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ విషయంపై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిజానికి కార్తికేయ ‘RRR’ కోసం రెండవ యూనిట్ డైరెక్టర్‌గా ముఖ్యమైన పాత్ర పోషించారు. అనేక ముఖ్యమైన సన్నివేశాలను ఆయనే తీశారు.  అంతేకాకుండా, ఈ సినిమా అంతర్జాతీయ గుర్తింపు పొందడంలో, ఆస్కార్‌కు ఈ చిత్రం నామినేషన్‌  పొందడంలో కీలక పాత్ర పోషించాడు. ఈ సినిమా నిర్మాణంలో ఆయనకున్న అనుభవం దృష్ట్యా 'RRR' సీక్వెల్ కు కార్తికేయ దర్శకత్వం వహించే అవకాశం ఉంటుందని తెలుస్తోంది.


అయాన్ ముఖర్జీ పేరు పరిశీలన?


ఒకవేళ కార్తికేయ 'RRR'  సీక్వెల్ దర్శకత్వ  బాధ్యతలు చేపట్టకపోతే, ‘బ్రహ్మాస్త్ర’ చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దర్శకుడు రాజమౌళి గతంలో అయాన్ ముఖర్జీ ప్రతిభను ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే ఆయన పేరు కూడా బలంగా వినిపిస్తోంది. అయితే, ఈ ప్రాజెక్ట్‌ కి కార్తికేయ సారథ్యం వహిస్తాడని అభిమానులు, సినీ ప్రేమికులు భావిస్తున్నారు. ఒకవేళ ఈ సినిమాకు దర్శకత్వం వహించకపోయినా,  భవిష్యత్తులో కార్తికేయ దర్శకత్వంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


Read Also: ‘దృశ్యం’ కాంబో దూకుడు- ఒక మూవీ షూట్ లో ఉండగానే మరో సినిమా అనౌన్స్!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial