చిరంజీవిని క్షమాపణలు కోరిన ఇంద్ర  మూవీ రచయిత చిన్నికృష్ణ - కారణం ఏంటంటే
 ప్రముఖ సినీ రచయిత, 'ఇంద్ర' మూవీ రైటర్‌ చిన్నికృష్ణ మెగాస్టార్‌ చిరంజీవికి క్షమాపణలు చెప్పారు. కేంద్రం చిరుకు 'పద్మవిభూషణ్' ప్రకటించిన నేపథ్యంలో నేడు ఆయనను కలిసిన చిన్నికృష్ణ.. అనంతరం ఓ వీడియో విడుదల చేశారు. ఈ సందర్భంగా చిరును క్షమాపణలు కోరుతూ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశారు. కాగా గతంలో ఆయన చిరుపై విమర్శ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. 'ఇంద్ర’ లాంటి బ్లాక్‌బస్టర్‌ హిట్‌ ఇచ్చిన తనను చిరంజీవి ఏనాడు ఇంటికి పిలిచి భోజనం పెట్టలేదంటూ దుర్బాషలాడారు. గతంలో ఎప్పుడో చేసిన వ్యాఖ్యలకు తాజాగా ఆయన క్షమాపణలు కోరడం గమనార్హం. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


విజయ్ ఫ్యాన్స్ షాకింగ్ న్యూస్ - సినిమాలకు ఇక తాత్కాలిక విరామం?
ఇళయదళపతి విజయ్.. ఎప్పుడెప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని తన ఫ్యాన్స్ అంతా ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా తన సొంత పార్టీకి సంబంధించిన ప్రకటన విడుదలయ్యింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ పార్టీ పెట్టి రాజకీయాలపై ఫోకస్ పెడితే.. విజయ్ అప్‌కమింగ్ సినిమాల పరిస్థితి ఏంటి అని కొందరికి అనుమానం మొదలయ్యింది. ప్రస్తుతం విజయ్ చేతిలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రం ఉంది. దీంతో పాటు లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా విజయ్ నటించాల్సి ఉంది. మరి వాటి పరిస్థితి ఏంటని కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


బాలీవుడ్ నటి పూనమ్ పాండే మృతి, షాక్‌లో అభిమానులు
బాలీవుడ్‌ నటి పూనమ్ పాండే మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్‌లోని తన నివాసంలో రాత్రి తుదిశ్వాస విడిచినట్లు పీఆర్ టీమ్ వెల్లడించింది. ‘‘ఈ ఉదయం మేం ఎంతో బాధాకరమైన విషయాన్ని పంచుకుంటున్నాం. మాకు ఎంతో ఇష్టమైన పూనమ్ పాండేను కోల్పోయాం. సర్వైకల్ క్యాన్సర్‌ కు ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయారు. ఆమె ప్రతి ఒక్కరితో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంది. ఈ సమయంలో బాధాకరమైన విషయాన్ని పంచుకునేందుకు ఎంతో చింతిస్తున్నాం. ఆమె ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేం” అని పూనమ్ సిబ్బంది వెల్లడించారు. తన స్వగ్రామంలోనే ఆమె అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


కళ్లు చెదిరే బంగళా, లగ్జరీ కార్లు, దళపతి విజయ్ ఆస్తుల విలువెంతో తెలుసా?
విజయ్ తన తొలి చిత్రం ‘వెట్రి’లో నటనకు గాను రూ. 500 రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఒక్కో సినిమాకు తన పారితోషికం పెంచుకుంటూ వెళ్లారు. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైనే వసూళు చేస్తున్నారు. అత్యంత ధనవంతులైన ఇండియన్ సినీ స్టార్స్ ఫోర్బ్స్ లిస్టులో విజయ్ చోటు సంపాదించుకున్నారు. విజయ్ వార్షిక ఆదాయం అతని వార్షిక ఆదాయం సుమారు 5.4 మిలియన్లు (రూ.45 కోట్లు). ఆయన నెల వారీ ఆదాయం 360,146 డాలర్లు (రూ.3 కోట్లు). బ్రాండ్ ఎండార్స్‌ మెంట్స్ తో కూడా భారీగానే సంపాదిస్తున్నారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)


'ఫ్యామిలీ స్టార్'కు ఆ ఐదు రోజులూ పండుగ - విజయ్ దేవరకొండ అఫీషియల్‌గా చెప్పేశాడు
కథానాయకుడిగా నటిస్తున్న లేటెస్ట్ ఎంటర్టైనర్ 'ఫ్యామిలీ స్టార్'. తన తొలి వంద కోట్ల సినిమా, 'గీత గోవిందం' వంటి హిట్ ఇచ్చిన పరశురామ్ దర్శకత్వంలో ఆయన రెండోసారి హీరోగా నటిస్తున్న చిత్రమిది. ఈ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్‌' చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేర్కొంది. కొన్ని రోజులుగా ఈ విడుదల తేదీ గురించి అనుకుంటున్న విషయం ప్రేక్షకులకూ తెలుసు. అయితే... ఈ రోజు అఫీషియల్‌గా చెప్పారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)