Vijay: ఇళయదళపతి విజయ్.. ఎప్పుడెప్పుడు పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడా అని తన ఫ్యాన్స్ అంతా ఎంతోకాలంగా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఫైనల్‌గా తన సొంత పార్టీకి సంబంధించిన ప్రకటన విడుదలయ్యింది. దీంతో ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీలో ఉన్నారు. కానీ పార్టీ పెట్టి రాజకీయాలపై ఫోకస్ పెడితే.. విజయ్ అప్‌కమింగ్ సినిమాల పరిస్థితి ఏంటి అని కొందరికి అనుమానం మొదలయ్యింది. ప్రస్తుతం విజయ్ చేతిలో వెంకట్ ప్రభు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ చిత్రం ఉంది. దీంతో పాటు లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్‌లో కూడా విజయ్ నటించాల్సి ఉంది. మరి వాటి పరిస్థితి ఏంటని కొందరు ఫ్యాన్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఫ్యాన్స్‌లో కలవరం..
విజయ్.. కొత్త పార్టీని పెట్టే ప్లాన్‌లో ఉన్నాడని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నా.. ఈరోజుతో వాటన్నింటికి క్లారిటీ ఇచ్చేశాడు. ‘తమిళగ వెట్రి కళగంగా’ పేరుతో విజయ్ పార్టీ ప్రారంభమయ్యింది. ఒకవైపు పార్టీ స్థాపించాడని సంతోషపడుతున్న ఫ్యాన్సే.. మరోవైపు ఆయన తరువాతి సినిమాల పరిస్థితి ఏంటని కలవరపడుతున్నారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న చిత్రమే ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT). ఈ మూవీలో విజయ్ డబుల్ యాక్షన్ చేయనున్నాడు. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా పోస్టర్లు చూస్తే దీనిపై క్లారిటీ వస్తుంది. విజయ్ కెరీర్‌లో ఇది 68వ చిత్రంగా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ నుండి విడుదలయిన ప్రతీ లుక్ చాలా రిచ్‌గా కనిపిస్తూ ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేస్తోంది.
ఆ రెండిటిపై ఎఫెక్ట్..
‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’ (GOAT)తో పాటు విజయ్ చేతిలో లోకేశ్ సినిమాటిక్ యూనివర్స్ కూడా ఉంది. ఇప్పటికే లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ‘లియో’లో నటించి.. ఎల్‌సీయూలో భాగం అయిపోయాడు విజయ్. లోకేశ్ కనకరాజ్ వరుసగా తన సినిమాటిక్ యూనివర్స్‌లోనే సినిమాలు చేసుకుంటూ వెళ్లాలని డిసైడ్ అయ్యాడు. అంటే విజయ్ కూడా అందులో భాగం కావాల్సిన అవసరం ఉంది. మరి విజయ్ పూర్తిగా రాజకీయాల్లో లీనమైతే.. ఈ రెండు సినిమాల పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. కొత్తగా పార్టీ పెట్టాడు కాబట్టి ప్రస్తుతం తను ఆ పార్టీకే పూర్తి సమయాన్ని కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటప్పుడు షూటింగ్స్‌లో పాల్గొంటాడా లేదా అని కోలీవుడ్ ప్రేక్షకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
2026లో వస్తాడనుకుంటే..
సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటున్న సమయం నుండి విజయ్ పొలిటికల్ ఎంట్రీ హాట్ టాపిక్‌గా మారింది. 2018లో తుత్తుకుడీ పోలీస్ ఫైరింగ్ ఘటనలో మరణించిన వారి కుటుంబాలను ఓదార్చడానికి విజయ్ వెళ్లినప్పుడు తన పొలిటికల్ ఎంట్రీ విషయంపై పెద్ద చర్చే నడిచింది. ఇక అప్పటినుండి ఈ హీరోకు చెందిన ఫ్యాన్ క్లబ్ ‘విజయ్ మక్కల్ ఇయక్కమ్’ పొలిటికల్ యాక్టివిటీలలో యాక్టివ్ అయ్యింది. లోకల్ బాడీ ఎలక్షన్స్‌లో కూడా పాల్గొంది. డిసెంబర్‌లో తమిళనాడులో వరదలు వచ్చినప్పుడు కూడా విజయ్.. స్వయంగా వెళ్లి కుటుంబాలను కలిశాడు. అంతే కాకుండా వారికి ఆర్థిక సాయాన్ని కూడా అందించాడు. 2026లో విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ 2024లోనే ఎంట్రీ ఇచ్చి అందరినీ సర్‌ప్రైజ్ చేశాడు.
Also Read: ఆడపిల్లను ఇండస్ట్రీకి తీసుకురావాలంటే భయం - కూతురిని హీరోయిన్ చేయడంపై సురేఖా వాణి వ్యాఖ్యలు