Poonam Pandey Controversys: బాలీవుడ్ నటి, మోడల్ పూనమ్ పాండే (32) మృతి చెందారు. ఉత్తర ప్రదేశ్ లోని తన నివాసంలో రాత్రి తుదిశ్వాస విడిచింది. ఈ విషయాన్ని ఆమె పీఆర్ టీమ్ అధికారికంగా వెల్లడించింది. గత కొంతకాలంగా గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె చికిత్స తీసుకుంటూ చనిపోయినట్లు తెలిపింది. ఆమె స్వగ్రామంలోనే అంత్యక్రియలు జరగనున్నట్లు తెలిపింది.
32 ఏండ్ల పూనమ్ పాండే మోడల్‌గా నటిగా గుర్తింపు తెచ్చుకుంది. బాలీవుడ్, టాలీవుడ్‌తో పాటు పలు సినిమాల్లో నటించినా అనుకున్న స్థాయిలో గుర్తింపు తెచ్చుకోలేకపోయింది. సినిమాలతో పోల్చితే వివాదాలతోనే ఆమె బాగా పాపులర్ అయ్యింది. ఆమె కెరీర్ లో దుమారం రేపిన టాప్ 10 వివాదాస్పద అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..
పూనమ్ కెరీర్ లో టాప్ 10 వివాదాలు
1. 2011 క్రికెట్ వరల్డ్ కప్ సందర్భంగా ఆమె చేసిన కామెంట్స్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. భారత్ 2011 ప్రపంచ కప్ గెలిస్తే తాను బట్టలు విప్పేస్తానని ప్రకటించింది. అయితే, టీమిండియా వరల్డ్ కప్ గెలిచినా, బీసీసీఐ ఆమెను నిర్ణయాన్ని స్వాగతించలేదు. దీంతో వెనక్కి తగ్గింది.
2. ’బిగ్ బాస్’ సీజన్ 7లో పాల్గొనాల్సిందిగా నిర్వాహకులు ఆమెను సంప్రదించారు. అంతేకాదు, రూ.2.25 కోట్లు ఆఫర్ చేశారు. అయితే, తనకు రూ. 3 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేసింది. అంత మొత్తం ఇచ్చుకోలేమని చెప్పిన నిర్వాహకులు, షో నుంచి ఆమెను స్కిప్ చేశారు.
3. ఇక తన తొలి సినిమా ‘నషా’ను ప్రమోషన్‌ను పూనమ్ సరికొత్తగా ప్రమోట్ చేసుకుంది. వెరైటీగా రొమాంటిక్ వాలంటైన్స్ డే సందేశాన్ని ట్వీట్ చేసిన వారికి ‘నషా’ సినిమాలో తాను ధరించిన హాట్ బికినీని బహుమతిగా అందిస్తానని వెల్లడించింది.
4. పూనమ్ తన యూట్యూబ్ ఛానెల్‌లో ‘బాత్‌రూమ్ సీక్రెట్స్’తో ఒక వీడియోను రిలీజ్ చేసింది. ఈ వీడియో భారతీయుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత ఈ వీడియోను యూట్యూబ్ బ్లాక్ చేసింది.
5. ప్రముఖ రచయిత్రి తస్లీమా నస్రీన్, పూనమ్ పాండే వివాదం అప్పట్లో దుమారం రేపింది. పూనమ్ పబ్లిక్‌గా చెత్త పనులు చేయాలనుకుంటోందని తస్లీమా విరుచుకుపడింది. ఆమె వ్యాఖ్యలపై పూనమ్ వల్గర్‌గా స్పందించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.
6. బాలీవుడ్ నటి చిత్రాంగద సింగ్, పూనమ్ మధ్య ట్విట్టర్ వివాదం కూడా బాగా సంచలనం అయ్యింది. ఇద్దరు ఒకరి గురించి మరొకరు చేసుకున్న అశ్లీల కామెంట్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఆ తర్వాత చిత్రాంగద సింగ్ ట్విట్టర్ అకౌంట్ ఫేక్ అని తెలియడంతో పూనమ్ వెనక్కి తగ్గింది.
7. 2012లో గూగుల్‌లో అత్యధికంగా సెర్చ్ చేసిన ఇండియన్ సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకుంది పూనమ్.
8. 2012 IPL కప్‌ను కోల్ కతా నైట్ రైడర్స్ గెలిస్తే, తన బట్టలు విప్పుతానని పూనమ్ ప్రకటించింది. అయితే, KKR గెలిచినా తను మాత్రం దుస్తులు విప్పకపోవడంతో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేశారు.
9. సచిన్‌ను దేవుడిగా మార్ఫింగ్ చేసిన ఫోటో పక్కనే తన సెమీ న్యూడ్ ఫోటోను పెట్టి సోషల్ మీడియాలో పెట్టడం తీవ్ర వివాదానికి కారణం అయ్యింది.
10. యోగా దినోత్సవం సందర్భంగా, పూనమ్ పాండే తన యూట్యూబ్‌లో షేర్ చేసిన వీడియో నెట్టింట ఓ రేంజిలో వైరల్ అయ్యింది.