డిప్రెషన్ వల్లే డ్రగ్స్ తీసుకున్న షణ్ముక్ - సూసైడ్ చేసుకోవాలనుకున్నాడా? వెలుగులోకి సంచలన నిజాలు!
యూట్యూబర్, బిగ్ బిస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ తాజాగా గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన కంప్లైట్ ఆధారంగా షణ్ముఖ్ సోదరుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు... ఆయన ఫ్లాటులో గంజాయి లభించింది. గంజాయి సేవిస్తుండటంతో పాటు అతని దగ్గర 16 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. షణ్ముఖ్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సోదరుడు సంపత్‌ను కూడా పట్టుకున్నారు. ఇదిలా ఉంటే షణ్ముఖ్ ఇంటికి పోలీసులు వెళ్లిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ సంచలన నిజం బయటపడింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
రాధికను వదలని టిల్లు - మళ్లీ తెస్తున్నాడు!
డీజే టిల్లు... బ్లాక్ బస్టర్ హిట్! హీరోయిన్ నేహా శెట్టికి అయితే కొత్త ఇమేజ్, నేమ్ తీసుకు వచ్చిన సినిమా. ఆమె అసలు పేరు కంటే రాధిక పేరుతో గుర్తుపట్టే ప్రేక్షకులు ఎక్కువ. 'డీజే టిల్లు ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉంది మరి! అయితే, సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'లో ఆమె బదులు అనుపమా పరమేశ్వరన్‌ను కథానాయికగా తీసుకున్నారు. హీరోయిన్ అయితే మారింది కానీ రాధిక జపం మాత్రం మానలేదు టిల్లు. ఇప్పటి వరకు విడుదలైన 'టిల్లు స్క్వేర్' ప్రచార చిత్రాలు అన్నిటిలో రాధిక ప్రస్తావన ఎక్కడో ఒక చోట వచ్చింది. ప్రస్తావన మాత్రమే కాదు... సినిమాలో ఆమె క్యారెక్టర్ కూడా ఉందని తెలిసింది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నిండిపోయిన 'మిక్స్ అప్' టీజర్ - 'ఆహా'లో వచ్చేది అప్పుడే!
ఓటీటీ మాధ్యమాలు అందుబాటులోకి వచ్చాక బోల్డ్ కంటెంట్ తో వెబ్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్ లను తెరకెక్కించడం కామన్ అయిపోయింది. కంటెంట్ ఉన్న కథలకి బోల్డ్ నెస్ ని జత చేస్తూ ఆడియన్స్ ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. అలా ఇప్పటికే ఓటీటీలో కొన్ని బోల్డ్ కంటెంట్ తో వచ్చిన సినిమాలు సక్సెస్ అయ్యాయి. ఇప్పుడు తెలుగు ఓటీటీ 'ఆహా' కూడా ఇలాంటి ఓ ప్రయత్నం చేసింది. ఆహాలో త్వరలోనే ఓ బోల్డ్ వెబ్ ఫిల్మ్ రాబోతోంది. దాని పేరే 'మిక్స్ అప్'. కమల్ కామరాజు, ఆదర్శ్ బాలకృష్ణ, పూజా జవేరి, అక్షర గౌడ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్నారు. రీసెంట్ గా రిలీజ్ చేసిన ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్ ఆడియన్స్ లో ఆసక్తి పెంచగా... తాజాగా టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
‘జవాన్’ను మించి ఉంటుంది - షారుఖ్‌తో మరో మూవీ, అట్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జవాన్’. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బ్లాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లను మార్క్ ను క్రాస్ చేసింది. ‘దాదా సాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్’లో బెస్ట్ యాక్టర్లుగా షారుఖ్ ఖాన్, నయనతార అవార్డులను అందుకున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్‌మెంట్స్ బ్యానర్ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి లాంటి స్టార్ యాక్టర్లు ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే గెస్ట్ రోల్ చేసింది. అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. తాజాగా ABP Ideas of India 2024 ఈవెంట్ లో పాల్గొన్న అట్లీ ఈ సినిమాతో పాటు షారుఖ్ తో మరో సినిమా చేసే అవకాశంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)
కాస్ట్లీ కార్ కొన్న ప్రియమణి - కాస్ట్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!
సౌత్ సీనియర్ నటి ప్రియమణి ప్రస్తుతం చేతి నిండా ఆఫర్లతో బిజీ బిజీగా గడుపుతోంది. హీరోయిన్ గా కెరీర్ ముగిసింది అనుకుంటున్న సమయంలో 'ఫ్యామిలీ మ్యాన్' వెబ్ సిరీస్ ఆమెకి మంచి బూస్ట్ ఇచ్చింది. దాంతో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఓవైపు సినిమాలు మరోవైపు వెబ్ సిరీస్‌లు అంటూ క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. (పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.)