Director Atlee About Shah Rukh Khan Movie: బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ నటించిన బ్లాక్ బస్టర్ హిట్ మూవీ ‘జవాన్’. గత ఏడాది విడుదల అయిన ఈ మూవీ బ్లాక్సాఫీస్ దగ్గర వసూళ్ల వర్షం కురిపించింది. తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం రూ. 1000 కోట్ల వసూళ్లను మార్క్ ను క్రాస్ చేసింది. ‘దాదా సాహెబ్‌ ఫాల్కే ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌’లో బెస్ట్ యాక్టర్లుగా షారుఖ్ ఖాన్‌, నయనతార అవార్డులను అందుకున్నారు. ఈ చిత్రాన్ని రెడ్ చిల్లీస్ ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్‌ పై షారుఖ్ సతీమణి గౌరీ ఖాన్ నిర్మించారు. ఇందులో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి లాంటి స్టార్ యాక్టర్లు ప్రముఖులు కీలక పాత్రలు చేశారు. దీపిక పదుకొనే గెస్ట్ రోల్‌ చేసింది. అనిరుధ్ రవిచందర్ అదిరిపోయే మ్యూజిక్ అందించారు. తాజాగా ABP Ideas of India 2024 ఈవెంట్ లో పాల్గొన్న అట్లీ ఈ సినిమాతో పాటు షారుఖ్ తో మరో సినిమా చేసే అవకాశంపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు.


‘జవాన్’ కంటే మంచి కథతో మరో సినిమా చేస్తా- అట్లీ


“షారుఖ్ ఖాన్ తో తప్పకుండా మరో సినిమా చేసే అవకాశం ఉంది. ‘జవాన్’ కంటే మంచి కథతో ఇంకో సినిమా చేస్తాను. ‘జవాన్‌’ షూటింగ్ సమయంలో షారుఖ్ ఖాన్‌ దగ్గర నుంచి ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఓపికతో షూటింగ్‌ చేయడం, ప్రతీ సీన్ అనుకున్నట్లుగా తెరకెక్కించాలి. అప్పుడే సినిమా విజయం సాధిస్తుందిని ‘జవాన్’తో రుజువు అయ్యింది. నిజానికి షారుఖ్ ఖాన్ నన్ను చాలా ఇష్టపడతారు. ఆయన అంటే నాకు చాలా అభిమానం. షారుఖ్ ఖాన్‌ నటించిన ‘ఓం శాంతి ఓం’, ‘చెన్నై ఎక్స్‌ ప్రెస్‌’, ‘డీడీఎల్‌జే’ సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం. చాలా కాలం క్రితమే ఆయనతో కలిసి పని చేయాలి అనుకున్నాను. ఇన్నాళ్లకు ‘జవాన్‌’  సినిమా చేసే అవకాశం కలిగింది. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన ఓ రూపమైన వ్యక్తి. ఆయనతో కలిసి మళ్లీ వర్క్‌ చేయాలనుంది. నా జీవితంలో నేను చూసిన గొప్ప వ్యక్తుల్లో ఒకరు. షారుఖ్ నన్ను ఎంతో అభిమానిస్తారు. ఎప్పుడూ చాలా ఉత్సాహంగా ఉంటారు. ‘జవాన్‌’ కంటే గొప్ప కథ కుదిరితే కచ్చితంగా షారుఖ్ ఖాన్‌ తో సినిమా చేస్తా” అని అట్లీ చెప్పుకొచ్చారు.



గత ఏడాది వరుసగా మూడు హిట్లు అందుకున్న షారుఖ్  


2018 నుంచి సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న షారుఖ్ ఖాన్, గత ఏడాది ‘పఠాన్’ సినిమాతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ఏకంగా రూ. 1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఆ తర్వాత వచ్చిన ‘జవాన్‘ సైతం మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండు హిట్ల తర్వాత రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వం వహించిన ‘డంకీ‘ సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర బాగానే ఆడింది. ప్రస్తుతం షారుఖ్ ఖాన్ సంజయ్‌లీలా బన్సాలీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ‘పఠాన్‌ 2’ను సినిమా పనులు కూడా కొనసాగుతున్నాయి. 


Read Also: హ్యాపీ బర్త్ డే గౌతమ్ మీనన్ - మేకింగ్ లోనే కాదు, యాక్టింగ్‌లోనూ ఈయన వెరీ స్పెషల్!