Ganja Chocolates in Hyderabad: హైదరాబాద్ లో గంజాయి చాక్లెట్లు భారీగా పట్టుబడ్డాయి. అనంత కుమార్ బారిక్ అనే ఒడిశాకు చెందిన బాలానగర్ ప్రాంతంలోని ఘరక్ కంటా ప్రాంతంలో తన చిన్న కిరాణా షాప్ లో గంజాయి చాక్లెట్ లు అమ్ముతున్నాడని పోలీసులకు సమాచారం అందించింది. దీంతో బాలానగర్ SOT పోలీసులు రంగంలోకి దిగారు. కిరాణా షాపును తనఖీ చేయగా కొన్ని గంజాయి చాక్లెట్ లు పట్టుబడ్డాయి. తదుపరి విచారణలో తన స్కూటీ సీట్ కింద డిక్కీ లో దాచి ఉంచిన 3 ప్యాకెట్లలో 120 చాక్లెట్లను పోలీసులు గుర్తించారు. వీటిని ఒడిశా నుంచి తీసుకుని వచ్చి బాలానగర్ ప్రాంతంలోని కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు. నిందితుణ్ని బాలానగర్ పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Hyderabad News: హైదరాబాద్లో భారీగా గంజాయి చాక్లెట్లు! స్టూడెంట్స్కు అమ్మకం
ABP Desam | 25 Feb 2024 10:04 AM (IST)
Balanagar: ఒడిశా నుంచి తీసుకుని వచ్చి బాలానగర్ ప్రాంతంలోని కూలీలకు, విద్యార్థులకు అమ్ముతునట్లు పోలీసులు గుర్తించారు.
గంజాయి చాక్లెట్లు