TS SC Study Circle Free Coachng: తెలంగాణ‌ ప్రభుత్వ ఎస్సీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న 12 ఎస్సీ స్టడీ సర్కిళ్లలో టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగ పరీక్షలతోపాటు.. బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ పరీక్షల కోసం 5 నెలల ఉచిత ఫౌండేషన్‌ కోర్సులో శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నారు. అర్హులైన తెలంగాణకు చెందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులు. ఇందుకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 23న ప్రారంభంకాగా.. మార్చి 6 వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు. డిగ్రీ అర్హత ఉండి, కుటుంబ వార్షికాదాయం రూ.3 లక్షల్లోపు ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్షలో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైనవారికి ఉచిత స్టడీ మెటీరియల్‌ కూడా సమకూరుస్తారు. మరిన్ని వివరాల కోసం 040-23546552 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.


వివరాలు..


* పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ (రెండో బ్యాచ్)


కోచింగ్ అంశాలు: టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1, 2, 3, 4, బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ, ఎస్‌ఎస్‌సీ ఉద్యోగ పరీక్షల 5 నెలల ఉచిత ఫౌండేషన్‌ కోర్సు. 


టీఎస్‌ ఎస్సీ స్టడీ సర్కిల్ బ్రాంచులు..


➥ ఆదిలాబాద్: ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్.


➥ నిజామాబాద్: నిజామాబాద్, కామారెడ్డి. 


➥ సిద్దిపేట: సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి. 


➥ కరీంనగర్: కరీంనగర్, పెద్దపల్లి. 


➥ జగిత్యాల: జగిత్యాల  


➥ రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల.  


➥ వరంగల్: హనుమకొండ, వరంగల్, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, ములుగు. 


➥ ఖమ్మం: ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం.


➥ నల్గొండ: నల్గొండ, యాదాద్రి భువనగిరి. 


➥ సూర్యాపేట: సూర్యాపేట 


➥ మహబూబ్ నగర్: మహబూబ్ నగర్, నాగర్‌కర్నూలు, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట.  


➥ రంగారెడ్డి: రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజ్‌గిరి, వికారాబాద్, హైదరాబాద్. 


సీట్లు: ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అభ్యర్థులు ప్రతి జిల్లాశాఖకు 100 సీట్ల చొప్పున ఎంపిక చేస్తారు. ఇందులో ఎస్సీలకు 75%, ఎస్టీలకు 10%, బీసీ/ మైనారిటీలకు 15% సీట్లు కేటాయించారు.


శిక్షణ వ్యవధి: 5 నెలలు.


అర్హతలు..


* ఏదైనా డిగ్రీ {బీఏ/బీకామ్/బీఎస్సీ/బీటెక్/బీఫార్మసీ/బీఎస్సీ(అగ్రికల్చర్)} ఉత్తీర్ణులై ఉండాలి. 


* ఉద్యోగం చేస్తున్నవారు లేదా పైతరగతులు చదువుతున్నవారు దరఖాస్తుకు అనర్హులు.


* ఎస్సీ స్టడీ సర్కిల్‌లో గతంలో 5 నెలల ఫౌండేషన్ కోర్సు పూర్తిచేసినవారు అనర్హులు.


ఎంపిక విధానం: ప్రవేశ పరీక్షలో సాధించిన మార్కులు, రూల్ ఆఫ్‌ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా. 


పరీక్ష కేంద్రాలు: ఆదిలాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, కరీంనగర్, కరీంనగర్, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వరంగల్, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబ్ నగర్, రంగారెడ్డి.


దరఖాస్తు సమయంలో అప్‌లోడ్ చేయాల్సిన డాక్యుమెంట్లు..


➥ ఆధార్ కార్డు కాపీ


➥ పుట్టినతేదీ ధ్రువీకరణ కోసం పదోతరగతి మార్కుల సర్టిఫికేట్


➥ ఎమ్మార్వో జారీచేసిన కమ్యూనిటీ సర్టిఫికేట్ (స్థానికత, పుట్టినతేదీ వివరాలు, క్యాస్ట్ సర్టిఫికేట్)


➥ ఎమ్మార్వో జారీచేసిన ఇన్‌కమ్ సర్టిఫికేట్ (01.02.2023 - 31.01.2024 సంవత్సరానికి)


➥ డిగ్రీ సర్టిఫికేట్/ ప్రొవిజనల్ సర్టిఫికేట్


➥ దరఖాస్తుదారుడి ఫొటోగ్రాఫ్


➥ దివ్యాంగులైతే డిజెబిలిటి సర్టిఫికేట్


సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్లు..



ముఖ్యమైన తేదీలు...


➥ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేదీ: 06-03-2024.


➥ ప్రవేశ పరీక్ష తేదీ: 10.03.2024.


పరీక్ష సమయం: ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు.


➥ కోచింగ్ షెడ్యూల్: 18.03.2024 నుంచి 17.08.2024 వరకు.


Detailed Notification


Online Application


Website


.