Youtuber Shanmukh Jaswanth: యూట్యూబర్, బిగ్ బిస్ ఫేమ్ షణ్ముక్ జస్వంత్ తాజాగా గంజాయితో పోలీసులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ విషయం తెలిసిందే. ఓ యువతి ఇచ్చిన కంప్లైట్ ఆధారంగా షణ్ముఖ్ సోదరుడిని అరెస్టు చేసేందుకు వెళ్లిన పోలీసులకు... ఆయన ఫ్లాటులో గంజాయి లభించింది. గంజాయి సేవిస్తుండటంతో పాటు అతని దగ్గర 16 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. షణ్ముఖ్ పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పాటు దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది. దాంతో వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత ఆయన సోదరుడు సంపత్‌ను కూడా పట్టుకున్నారు. ఇదిలా ఉంటే షణ్ముఖ్ ఇంటికి పోలీసులు వెళ్లిన సమయంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ సంచలన నిజం బయటపడింది.


డిప్రెషన్ వల్లే షణ్ముఖ్ గంజాయి తీసుకున్నాడా..?


షణ్ముఖ్, అతని సోదరుడిని పోలీసుటు అరెస్ట్ చేస్తున్న సందర్భంలో తీసిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఆ వీడియోలో షణ్ముఖ్ తన సోదరుడి ప్రియురాలిపై ఫైర్ అవుతూ... ''నేను డిప్రెషన్ లో ఉన్నాను. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా'' అంటూ చెప్పాడు. దీన్ని బట్టి షణ్ముఖ్ గత కొద్దిరోజులుగా మానసిక ఒత్తిడిలో ఉన్నట్లు అర్థమవుతుందిమ్ డిప్రెషన్ కారణంగానే షన్ను గంజాయి సేవిస్తున్నట్లు ఈ వీడియో పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.


నిజానికి యూట్యూబ్ ద్వారా కెరీర్ స్టార్ట్ చేసిన షణ్ముఖ్ తన టాలెంట్ తో బిగ్ బాస్ వరకు చేరుకున్నాడు. ఆ తర్వాత తీసిన షార్ట్ ఫిలిమ్స్ కి మంచి క్రేజ్ వచ్చింది. ముఖ్యంగా యువతను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాంటి షణ్ముఖ్ ఇప్పుడు డిప్రెషన్ కు చేరుకునే స్థాయికి ఎందుకు వెళ్లాడనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఈ విషయంలో కొందరు ప్రేమించిన అమ్మాయి దూరం కావడం వల్లే షణ్ముఖ్ డిప్రెషన్ లోకి వెళ్ళాడని చెబుతుంటే... మరికొందరేమో బిగ్ బాస్ నుంచి వచ్చాక ఆఫర్స్ వస్తాయి అనుకుంటే కెరీర్ పరంగా డౌన్ కావడంతో మానసిక ఒత్తిడికి గురయ్యాడని అంటున్నారు.






షణ్ముఖ్ అరెస్ట్ విషయంలో జరిగిందేంటంటే..


షణ్ముఖ్ జశ్వంత్ సోదరుడు సంపత్ వినయ్ ఓ అమ్మాయితో చాలా కాలంగా ప్రేమలో ఉన్నాడు. కొంత కాలం క్రితం వీళ్లిద్దరి ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. కారణాలు ఏంతో తెలియదు కానీ, కొద్ది రోజులు ఆ అమ్మాయిని దూరం పెట్టాడు. సుమారు 20 రోజుల క్రితం ఆమెను కాదని మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయంలో ఏపీలో ఉంటున్న తన ప్రియురాలికి తెలియడంతో హైదరాబాద్ నార్సింగి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.


గత 10 సంవత్సరాలుగా తాము ప్రేమలో ఉన్నామని, ఇద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగిందని, ఇప్పుడు తనను కాదని మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కంప్లైట్ లో వెల్లడించింది. అమ్మాయి ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు ఎంక్వయిరీ మొదలు పెట్టారు. సదరు అమ్మాయితో కలిసి పోలీసులు సంపత్ వినయ్ ని అదుపులోకి తీసుకునేందుకు షణ్ముఖ్ జశ్వంత్ ఫ్లాట్ కు వెళ్లారు. ఇంట్లోకి వెళ్లి చూడగా, షణ్ముఖ్ గంజాయి తాగుతూ కనిపించాడు. అంతేకాదు, అతడి దగ్గర మరో 16 గ్రాముల గంజాయి దొరికినట్లు పోలీసులు తెలిపారు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్నారు.


Also Read : డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో నిండిపోయిన 'మిక్స్ అప్' టీజర్ - 'ఆహా'లో వచ్చేది అప్పుడే!