Neha Shetty cameo in Tillu Square movie: డీజే టిల్లు... బ్లాక్ బస్టర్ హిట్! హీరోయిన్ నేహా శెట్టికి అయితే కొత్త ఇమేజ్, నేమ్ తీసుకు వచ్చిన సినిమా. ఆమె అసలు పేరు కంటే రాధిక పేరుతో గుర్తుపట్టే ప్రేక్షకులు ఎక్కువ. 'డీజే టిల్లు ఎఫెక్ట్ ఆ స్థాయిలో ఉంది మరి! అయితే, సీక్వెల్ 'టిల్లు స్క్వేర్'లో ఆమె బదులు అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran)ను కథానాయికగా తీసుకున్నారు. హీరోయిన్ అయితే మారింది కానీ రాధిక జపం మాత్రం మానలేదు టిల్లు. ఇప్పటి వరకు విడుదలైన 'టిల్లు స్క్వేర్' ప్రచార చిత్రాలు అన్నిటిలో రాధిక ప్రస్తావన ఎక్కడో ఒక చోట వచ్చింది. ప్రస్తావన మాత్రమే కాదు... సినిమాలో ఆమె క్యారెక్టర్ కూడా ఉందని తెలిసింది. 


'టిల్లు స్క్వేర్' సినిమాలో అతిథిగా నేహా శెట్టి!
'టిల్లు గాడు ఉన్నన్ని రోజులూ రాధిక ఉంటది' - 'టిల్లు స్క్వేర్'లో అనుపమతో హీరో సిద్ధూ జొన్నలగడ్డ చెప్పే మాట. 'నా పేరు రాధికా కాదు... నా పేరు లిల్లీ' అని ఆమె అంటే... 'నీ పేరు లిల్లీ ఏమో గానీ నువ్వు మనిషివి అయితే రాధికావి. రాధికా జాతికి చెందిన స్త్రీవి' అని హీరో రిప్లై ఇస్తాడు. అంతే కాదు... 'టిల్లు స్క్వేర్'లో రాధిక పాత్రలో మరోసారి నేహా శెట్టిని తీసుకు వస్తున్నారని టాక్. 


'టిల్లు స్క్వేర్' సినిమాలో సుమారు 15 నిమిషాల పాటు రాధికా పాత్ర ఉంటుందని, ఆ సీక్వెన్స్ అంతా హైలైట్ అవుతుందని టాక్. ఆల్రెడీ కొంత షూటింగ్ వర్క్ కూడా కంప్లీట్ చేసినట్లు టాక్. మరి, నేహా శెట్టి పాత్రను ఎలా చూపిస్తారో? వెయిట్ అండ్ సి.


Also Read: పేరు ఎలా మారిందో చెప్పిన తమన్నా - రాజమౌళి ఆ ప్రశ్నకు ఇంకా సమాధానం ఇవ్వలేదట!
 
మార్చి 29న థియేటర్లలో 'టిల్లు స్క్వేర్' విడుదల
Tillu Square release on March 29th: 'టిల్లు స్క్వేర్'ను మార్చి 29న థియేటర్లలో విడుదల చేయడానికి ఏర్పాట్లు చేశారు. నిజానికి, ఈ సినిమాను  ఫిబ్రవరి 9న థియేటర్లలో విడుదల కావాలి. అయితే సంక్రాంతి బరి నుంచి మాస్ మహారాజా రవితేజ 'ఈగల్' విడుదల వాయిదా వేశారు. ఆ సినిమా కోసం ఫిబ్రవరి 7 నుంచి టిల్లును వెనక్కి తెచ్చారు.



'టిల్లు స్క్వేర్' చిత్రానికి మల్లిక్ రామ్ దర్శకత్వం వహిస్తున్నారు. సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. సాయి సౌజన్య సహ నిర్మాత. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమా పతాకాలపై 'టిల్లు స్క్వేర్' సినిమా తెరకెక్కుతోంది. 'డీజే టిల్లు' తరహాలో ఈ సినిమా కూడా కల్ట్ స్టేటస్ అందుకుంటుందని నిర్మాత నాగవంశీ ధీమా వ్యక్తం చేశారు.


Also Read: బర్త్ డేకి బంగారు కేక్ కట్ చేయడం ఏంటి ఊర్వశి - నీ దగ్గరున్నవి డబ్బులా? మంచి నీళ్లా?



సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : సాయి ప్రకాష్, కూర్పు : 'జాతీయ పురస్కార గ్రహీత' నవీన్ నూలి, సంగీతం: రామ్ మిరియాల - అచ్చు రాజమణి, శ్రీ చరణ్ పాకాల, కళ: ఏఎస్ ప్రకాష్, నిర్మాత: సూర్యదేవర నాగ వంశీ, దర్శకుడు : మల్లిక్ రామ్.