తమన్నా అంటే అర్థం ఏమిటో తెలుసా? కోరిక! తనకు ఎనిమిది లేదా తొమ్మిది ఏళ్ల వయసు ఉన్నప్పుడు నటి కావాలని అనుకున్నట్లు తమన్నా తెలిపారు. ఎందుకు? ఎలా? తనలో ఆ కోరిక కలిగిందో తెలియదు కానీ... నటి కావాలని, చిత్ర పరిశ్రమలోకి వెళ్లాలని బలంగా నిర్ణయించుకున్నట్లు ఆమె చెప్పారు. ముంబైలో ABP Network నిర్వహించిన 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్'లో ఆమె పాల్గొన్నారు. ప్రజలే ఎజెండాగా ఏబీపీ నెట్‌వర్క్‌ ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్‌ నిర్వహిస్తోంది. ‘సో మెనీ సినిమాస్ - తమన్నాస్ పాన్ ఇండియా ట్రయంఫ్’ అనే సెషన్‌లో తమన్నా పార్టిసిపేట్ చేశారు.


ABP Ideas Of India Summit 2024కి ప్రత్యేక అతిథిగా హాజరైన తమన్నా... తన పేరులో రెండు అక్షరాలు ఎందుకు వచ్చాయి? అనే దానితో పాటు 'బాహుబలి 2' చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి తాను వేసిన ఓ ప్రశ్న గురించి చెప్పారు.


నా పేరు మార్చుకోవాల్సిన అవసరం రాలేదు కానీ...
Tamannaah on her name: నటి కావాలని అనుకున్నప్పుడు పేరు మార్చుకోవాల్సిన అవసరం తనకు రాలేదని తమన్నా చెప్పారు. ''మా నాన్న నా పేరును ఫిల్మీగానే పెట్టారు. ఆ తర్వాత నేను ఒకరిని కలిశా. ఆయన 'నీ పేరులో మరొక a, ఒక h యాడ్ చేస్తే బావుంటుంది' అని చెప్పారు. ఏది బావుంటుందంటే అది యాడ్ చేయమని చెప్పాను. ఒక a, ఒక h యాడ్ చేశాం. ఆ తర్వాత నుంచి ప్రతి ఒక్కరూ నా పేరును పలకాలంటే కొంచెం శ్వాస తీసుకోవాలి'' అని తమన్నా తెలిపారు.


రాజమౌళిని ప్రశ్నిస్తే నవ్వుతారు తప్ప ఆన్సర్ ఇవ్వరు!
కథానాయికగా తమన్నా ప్రయాణంలో 'బాహుబలి' ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. ఆ సినిమాకు ముందు ఆమె కొన్ని హిందీ సినిమాలు చేశారు. అయితే ఆశించిన స్థాయిలో విజయాలు రాలేదు. 'బాహుబలి'తో కేవలం హిందీ ప్రేక్షకులను మాత్రమే కాదు... అంతర్జాతీయ ప్రేక్షకుల్ని సైతం తమన్నా మెప్పించారు.


Also Read: కొన్నిసార్లు నేను అబ్బాయిలా కూడా ఆలోచిస్తా - 'ఫెమినిజం' మహిళలకు మాత్రమే సంబంధించింది కాదు


'మీ కెరీర్‌లో బాహుబలి గేమ్ ఛేంజర్ అనుకోవచ్చా?' అని తమన్నాను ప్రశ్నిస్తే... ''నా దృష్టిలో, ప్రేక్షకుల దృష్టిలో... బాహుబలి నాకు మాత్రమే గేమ్ ఛేంజర్ కాదు. సినిమా ఇండస్ట్రీకి గేమ్ ఛేంజర్. ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఆ సినిమా రివల్యూషన్. బాహుబలి తర్వాత ప్రేక్షకులు సినిమా చూసే విధానం మారింది. ఆ సినిమాలో నేను చేసిన అవంతిక పాత్రకు నాకు రిఫరెన్స్ ఏమీ లేదు. వ్యక్తిగతంగా, నటిగా నన్ను నిరూపించుకోవడానికి ఎంతో ఆస్కారం కలిగింది. నాకు 'బాహుబలి' సినిమాలో నటించే అవకాశం వచ్చిన తర్వాత దర్శకుడు రాజమౌళిని 'సార్... ఈ పాత్రకు నన్ను ఎందుకు ఎంపిక చేశారు?' అని అడిగా. ఆయన ఎప్పుడూ ఆన్సర్ ఇవ్వలేదు. నేను ఆ ప్రశ్న అడిగిన ప్రతిసారీ నవ్వుతారు. అవంతిక పాత్రలో నటించడం మొదలు పెట్టిన తర్వాత మెల్లగా నాకు అర్థమైంది ఏమిటంటే... నాలో ఉన్న బలాన్ని నేను గుర్తించలేదని తెలిసింది'' అని చెప్పారు.


Also Read: రామ్ చరణ్ to అక్కినేని ఫ్యామిలీ - ఆశిష్ రిసెప్షన్ వేడుకలో సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే



'లస్ట్ స్టోరీస్ 2' వెబ్ సిరీస్, 'జైలర్', 'భోళా శంకర్', మలయాళ సినిమా 'బాంద్రా'తో గత ఏడాది తమన్నా సందడి చేశారు. ప్రస్తుతం తమిళ హారర్ ఫ్రాంచైజీ 'అరణ్మణై 4'తో పాటు మరో రెండు సినిమాల్లో ఆమె నటిస్తున్నారు.