రామ్ చరణ్ to అక్కినేని ఫ్యామిలీ - ఆశిష్ రిసెప్షన్ వేడుకలో సందడి చేసిన టాలీవుడ్ సెలబ్రిటీలు వీరే
టాలీవుడ్ అగ్ర నిర్మాత 'దిల్' రాజు తమ్ముడు శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి రిసెప్షన్ ఘనంగా జరిగింది. జైపూర్ సిటీలో ఇప్పటికే వివాహం జరిగింది. రిసెప్షన్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ ప్రముఖులు చాలా మంది హాజరయ్యారు. రామ్ చరణ్, నాగార్జున, నాగ చైతన్య వంటి పలువురు ఈ వేడుకలకు హాజరయ్యారు.
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ వేడుకలకు వచ్చారు.
ఈ వేడుకల్లో ఎదురైన రామ్ చరణ్, నాగార్జున ఒకరిని ఒకరు కౌగలించుకున్నారు.
కింగ్ నాగార్జున, నాగచైతన్య, విప్లవ చిత్రాల్లో నటించే ఆర్.నారాయణ మూర్తి ఈ వేడుకల్లో కనిపించారు.
కమెడియన్, క్యారెక్టర్ ఆర్టిస్టు రఘు బాబు కూడా రిసెప్షన్‌కు వచ్చారు.
రచయత, నటుడు బీవీఎస్ రవి కూడా ఆశిష్ రిసెప్షన్‌కు వచ్చారు.
రిసెప్షన్‌లో రభస, కందిరీగ, హైపర్ సినిమాల దర్శకుడు సంతోష్ శ్రీనివాస్
ఆశిష్ రిసెప్షన్‌లో ప్రముఖ నిర్మాత, రాజకీయ నాయకుడు పీవీపీ
వేడుకల్లో ప్రముఖ నటి, నిర్మాత, నాగార్జున మేనకోడలు యార్లగడ్డ సుప్రియ
నటుడు మురళీధర్ గౌడ్