Dimple Hayathi: డింపుల్... దుబాయ్లో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్కు తయ్యార్

గ్లామరస్ టాలీవుడ్ హీరోయిన్లలో డింపుల్ హయతి ఒకరు. అంతే కాదు... ఆమె బెస్ట్ డాన్సర్ కూడా! వరుణ్ తేజ్ 'గద్దలకొండ గణేష్' సినిమాలో 'జర్ర జర్ర...' స్పెషల్ సాంగ్ లో ఆమె డాన్స్ ఇరగదీశారు. ఇప్పుడు ఆమె ఓ అవార్డు ప్రోగ్రాంలో అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
Download ABP Live App and Watch All Latest Videos
View In App
మార్చి 3న దుబాయ్ లో జబిల్ పార్కులో గామా ఫోర్త్ ఎడిషన్ అవార్డులు ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఆ అవార్డు వేడుకలో డింపుల్ హయతి డాన్స్ పెర్ఫార్మన్స్ ఇవ్వనున్నారు. ప్రోగ్రాంలో డింపుల్ పెర్ఫార్మన్స్ స్పెషల్ ఎట్రాక్షన్ కానుందని నిర్వాహకులు చెబుతున్నారు.

హైదరాబాద్ సిటీలో శుక్రవారం నిర్వహించిన గామా కర్టైన్ రైజర్, ట్రోఫీ లాంచ్ ఈవెంట్ లో డింపుల్ హయతి ఇలా సందడి చేశారు.
విశాల్ 'సామాన్యుడు', రవితేజ 'ఖిలాడీ', గోపీచంద్ 'రామబాణం' సినిమాల్లో డింపుల్ హయతి నటించారు. ఆ సినిమాల్లో సూపర్ హిట్ పాటలతో పాటు మరికొన్ని పాటలకు గామా అవార్డుల్లో ఆమె డాన్స్ పెర్ఫార్మన్స్ చేయనున్నారని సమాచారం.
డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోలు
డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోలు
డింపుల్ హయతి లేటెస్ట్ ఫోటోలు