Tamannaah Speaks On Feminism: తాజాగా ఓ షోలో పాల్గొన్న తమన్నా ఫెమినిజం(స్త్రీవాదం)పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తనలో ఫేమినిజం భావన లేదని.. పురుష, స్త్రీ శక్తి సమానంగా ఉన్నాయంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. కాగా ప్రస్తుతం ముంబైలో ప్రముఖ మీడియా సంస్థ ABP Network 'ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్' పేరుతో ఈవెంట్‌ నిర్వహించింది. ప్రజలే ఎజెండాగా ఏబీపీ నెట్‌వర్క్‌ ఈ ప్రతిష్టాత్మకంగా ఈ సమ్మిట్‌ని నిర్వహిస్తోంది. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొని ప్రజాస్వామ్యం, దేశ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు హిందుభావాలపై ఈ చర్చించనున్నారు. ఫిబ్రవవరి 23,24 రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమంలో నిన్న మిల్కీ బ్యూటీ తమన్నా పాల్గొంది. ‘సో మెనీ సినిమాస్ - తమన్నాస్ పాన్ ఇండియా ట్రయంఫ్’ అనే సెషన్‌కు హాజరైన ఆఎమను మోడరేటర్ అనంత నాథ ఝా Feminism( స్త్రీవాదం)ప్రై ప్రశ్నించారు. దీనికే తమన్నా స్పందిస్తూ పై వ్యాఖ్యలు చేసింది. 


కొన్ని సార్లు నేను పురుషుడిలా కూడా ఉంటాను..


ఈ సందర్భంగా తమన్నా ఫెమినిజం(స్ట్రీవాదం) అనే భావన ఒక్క మహిళలకు మాత్రమే సంబంధించిందా? పురుషుల్లో స్త్రీవాదం ఉండాలా? వద్దా? అనే దాని తన అభిప్రాయాన్ని పంచుకుంది. "ఫెమినిజం అనే భావన ఒక్క మహిళలకు మాత్రమే సంబంధించింది కాదు. ఇదేం స్త్రీకి మాత్రమే ఉన్న అర్హత కాదు. ఇద్దరిలో ఇలాంటి భావాలు ఉండోచ్చు. ఫెమినిజం అనేది స్త్రీ, పురుషులు ఇద్దరికి సంబంధించినదే. ఎందుకంటే ఇది నమ్మకానికి సంబంధించింది. ఒక మనిషిగా ఉన్నప్పుడు మనలో వివిధ లక్షణాలు, భావాలు ఉంటాయి. స్త్రీలో మాత్రమే ఈ రకమైన భావాలు ఉంటాయి, పురుషులలో ఇవి ఉండవని చెప్పలేం. మనిషులుగా మనలో ఒక్కొసారి స్త్రీ, పురుష తత్త్వాలు రెండూ ఉంటాయి. ఒక్కోసారి నేను పురుషుడిగా కూడా ఆలోచిస్తాను. ఎప్పుడైన నేను గదిలో ఒంటరిగా ఉన్నప్పుడు పురుషుడిలా ఆలోచిస్తాను.. అదే పురుషుడు కొన్నిసార్లు స్త్రీగా కూడా ఆలోచించవచ్చని అనుకుంటున్నాను. కాబట్టి ఒక మనిషిగా మనలో ఇద్దరు(సగం స్త్రీ మరియు సగం పురుషులు) ఉంటారనేది నా అభిప్రాయం" అంటూ తమన్నా చెప్పుకొచ్చింది.


Also Read: నేను కూడా ఆత్మలను చూశా - క్షుద్రశక్తులపై అజయ్ దేవగన్ ఆసక్తికర వ్యాఖ్యలు


ప్రతీ మహిళలకు సాధికారిత ముఖ్యం


అనంతరం ఆమె మాట్లాడుతూ.. "నన్ను అడిగితే ఈ ప్రపంచంలో పురుషుడి-స్త్రీ ఇంకా మధ్య బేధాలు ఉన్నాయి. అది పోవాలి. మరింత సమానత్వం రావాలి. ఒక నటిగా నాకు దీనిపై నా మాట్లాడే రైట్‌ ఉందనుకుంటున్నా. అలాగే దీనిపై నా అభిప్రాయాన్ని చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను" అని పేర్కొంది. అలాగే ఎంపవర్‌మెంట్‌పై కూడా తమన్నా స్పందించింది. ఒక మహిళకు ఎంపవర్‌మెంట్‌ అనేది చాలా అవసరం, ఇది నా వ్యక్తిగత అనుభవంతో చెబుతున్నాను. అదే నేను స్త్రీగా నా పని నేను చేసుకుంటు ఇండిపెండెట్‌గా ఉన్నాను. అందువల్లే ఒక నటిగా నాకంటూ సొంత గుర్తింపు పొందాను. నాకు కావాల్సింది నేను చేయగలను. కానీ ఈ రోజు అది లేనివారు చాలామంది ఉన్నారు. ఎక్కడో దగ్గర మహిళలు ఇంకా ఒకరిపై ఆధారపడే జీవిస్తున్నారు. అలాంటి వారు సాధికారిత పొందడం చాలా ముఖ్యం, ప్రతి మహిళకు కూడా తనకంటూ సొంత గుర్తింపు ఉండాలి. సంపాదించాలి. ప్రతి మహిళలో సాధికారిత ఉండేలని నేను భావిస్తున్నారు. ఒక నటిగా, స్త్రీగా దానికి కోసం నేను మాట్లాడేందుకు, నావంతుగా ఏం చేయడానికి ఎప్పడు సిద్ధంగా ఉంటాను" అంటూ తమన్నా వెల్లడించింది. కాగా ప్రస్తుతం తమన్నా కామెంట్స్ వైరల్‌గా మారాయి.